ప్రభాస్ చేస్తున్న మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో పాటు, కీలక పాత్ర పోషిస్తున్న కన్నప్ప సినిమా కూడా అతడి అభిమానుల జాబితాలో ఉంది. ఈ సినిమాలో శివుడిగా అతడు నటించాడని ప్రారంభంలో అనుకున్నారంతా. కానీ ఆ పాత్రను అక్షయ్ కుమార్ కు కట్టబెట్టారు.
దీంతో కన్నప్పలో ప్రభాస్ పాత్ర ఏంటి, అతడి లుక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందర్లో నెలకొంది. ఎట్టకేలకు కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అతడి పాత్ర పేరు రుద్ర. ప్రళయకాల రుద్రుడిగా, త్రికాల మార్గదర్శకుడిగా, శివాజ్ఞ పరిపాలకుడిగా… అతడి పాత్రను పరిచయం చేశారు మేకర్స్.
సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన శివుడి పాత్రకు కొనసాగింపుగా రుద్ర పాత్రను చూపించబోతున్నట్టు స్పష్టమైంది. ఇంకా చెప్పాలంటే, మానవ రూపంలో ఉన్న బసవయ్యగా ప్రభాస్ ఇందులో కనిపిస్తాడు.
భారీగా జుట్టు, అడ్డబొట్టు, మెడలో రుద్రాక్షలు, చెవిలో కుండలాలు, చేతిలో నంది కొమ్ముల్ని పోలిన కర్రతో మందహాసంతో కనిపిస్తున్నాడు ప్రభాస్. ఈ లుక్ తో సినిమాపై బజ్ కాస్త పెరిగింది.
సినిమాలో ప్రభాస్ ది గెస్ట్ రోల్ కాదని, అతడి పాత్ర దాదాపు 20 నిమిషాలు ఉంటుందని మంచు విష్ణు ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, ప్రభాస్ పై ఇంట్రో సాంగ్ కూడా ఉంది సినిమాలో. ఆ పాటను గణేశ్ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది కన్నప్ప సినిమా.