77 ఏళ్ళకు ఆ గ్రామానికి కరెంట్

తొలి లైట్ అక్కడ వెలిగి వారి జీవితాలలో కాంతులు నింపింది. ఆ గ్రామం ఉమ్మడి విశాఖ జిల్లాలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని నీలబందగా ఉంది.

ఈ రోజుకీ కరెంట్ లేని పల్లెలు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 పూర్తి అయిపోయింది. అయినా విద్యుత్ కాంతులు చూడని అభాగ్య వంతులైన గ్రామీణులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒక ఊరి వారికి విద్యుత్ సదుపాయం లభించింది. తొలి లైట్ అక్కడ వెలిగి వారి జీవితాలలో కాంతులు నింపింది. ఆ గ్రామం ఉమ్మడి విశాఖ జిల్లాలోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని నీలబందగా ఉంది.

ఆ గ్రామంలో ఉన్నవి మూడు కుటుంబాలు మొత్తం 26 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఆ గ్రామానికి విద్యుత్ కనెక్షన్ రావడంతో గ్రామ ప్రజలు అంతా ఆనందంతో చిందులు వేశారు. తమ ఊరికీ కరెంట్ వచ్చిందని ఇక మీదట తాము కూడా అందరి లాగానే హాయిగా ఉండవచ్చు అని తెగ మురుస్తున్నారు.

విద్యుత్ వెలుగులు లేకుండా ఇన్నాళ్ళూ చీకటిలో మగ్గిన ఆ గ్రామం ఇక శాపాల నుంచి బయటపడింది అని అంటున్నారు. కరెంట్ వస్తే మిగిలిన మౌలిక సదుపాయాలు అన్నీ వస్తాయని ఇతర ప్రాంతాలతో గ్రామలతో సమానంగా ఆ గ్రామం కూడా పోటీ పడి ముందుకు సాగుతుందని అధికారులు తెలియచేస్తున్నారు. పల్లె వెలుగుతోనే దేశానికి అసలైన వెలుగు అని ఇతర పల్లెలకూ ఆ సౌభాగ్యం కల్పించాలని కోరుతున్నారు.

6 Replies to “77 ఏళ్ళకు ఆ గ్రామానికి కరెంట్”

Comments are closed.