రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌!

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కేసిరెని హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.

రేపు విచారణ అధికారుల ఎదుట హాజరవుతున్నానంటూ ఈ మధ్యాహ్నం ఒక ఆడియో విడుదల చేశారు. అయితే ఇంతలోనే ఆయన అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే కేసిరెడ్డికి సిట్ అధికారులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాని కేసిరెడ్డి, బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడటంతో, రేపు విచారణకు వస్తున్నానని ఆడియో రిలీజ్ చేశారు.

ఇప్పటికే జగన్ ప్రభుత్వం హయాంలో లిక్కర్ వ్యాపారంలో అవకతవకలు జరిగాయంటూ చాలా మంది అధికారులను, ప్రజాప్రతినిధులను సిట్ అధికారులు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే, లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కొన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేసిరెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి అని, ఆయనను నమ్మి మోస‌పోయాన‌ని మీడియాకు చెప్పారు.

ఈ కేసులో మాజీ సీఎం జగన్‌నే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న దృష్టిలో కేసిరెడ్డి నుంచి వచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా జగన్‌పై కేసులు ఉంటాయా, ఉండవా అన్నది స్పష్టమవుతుంది. లిక్కర్ కేసులో అవినీతి జరిగిందా లేదా అనే విషయం కసిరెడ్డి ఏం చెబుతారన్నదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.

19 Replies to “రాజ్ కేసిరెడ్డి అరెస్ట్‌!”

  1. కసిరెడ్డి గారు చాలా అదృష్టవంతుడు. చాలా త్వరగా ప్రమాదాన్ని గుర్తించి లొంగిపోయాడు. ఏమైనా ఈయన పోలీస్ కస్టడీ లోనే క్షేమముగా ఉంటాడు. తండ్రి మాట విని లొంగిపోయాడు.

  2. ఉత్తముడు అమాయకుడు అయిన రాజ్ కేసి రెడ్డి .. రాజేష్ రెడ్డి పేరుతో ఎందుకు ప్రయాణం చేస్తున్నాడో..

    ఆ ముక్క ఇక్కడ ముక్కలేదెందుకో.. ఆ ముక్క రాస్తే జగన్నాటకం అందరికీ తెలిసిపోతుందని .. మింగేసావా వెంకట్ రెడ్డి..

      1. వావ్ .. నీకెలా తెలుసు.. నువ్వు నాది పట్టుకుని వేలాడుతున్నావా..?

    1. Sir

      Emi cheppadu emi teladu

      Endukante chattam iche hakkulu, protection musugulo rendu rojula news matrame

      Lekunte chala mandi leaders jail ku vellevaru

      Nyayam anedi konatage vastuvu ayindi

      Rendu rojulu coverage ante

  3. ఈ బోకు గాడు మారు పేరుతో ఫారన్ jump అవ్వాలని చూసి అడ్డంగా దొరికాడు, తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవాలి?? వాడిని నువ్వెందుకు సమర్థిస్తున్నావు??

  4. అమాయకుడు, సౌమ్యుడు, గుణవంతుడు, మంచి వ్యాపారవేత్త, నాకు బాగా సన్నిహితుడు అయిన కసిరెడ్డి గారిని అరెస్టు చేయడం అన్యాయం ఆక్రమం అంటున్న మా అన్నయ్య 

  5. వాడేమో రాజ్ ని రాజేష్ రెడ్డి అని మార్చుకొని అమెరికా చెక్కేసే ప్లాన్ లో దొరికి పొయ్యాడు.. నువ్వేమో కసిరెడ్డి ని కేసిరెడ్ది అని మార్చి రాస్తున్నావు.

    అన్నియ్య బాచ్ అంతా ఇంతేనా ?

    1. వాడి అసలు పేరు కేసి రెడ్డి.. మన మీడియా కసి రెడ్డి గా మార్చేసి రాసింది..

      విజయ సాయి రెడ్డి కూడా కసి రెడ్డి అని చెప్పేవాడు..

      మొన్న ఆడియో లో వాడే వాడి అసలు పేరు కేసి రెడ్డి గా చెప్పుకొన్నాడు..

      ..

      కానీ ఈ రాజశేఖర్ రెడ్డి.. రాజేష్ రెడ్డి గా మారిపోవడమే వింత..

  6. కసి రెడ్డి చాలా కసిగా కసిగా,  అందం గా ఉంటాడు… 

    బా య్యా… రాత్రికి ప్యాలస్ కి వెనక గేట్ గుండా రా.. 

    – ప్యాలెస్ పులకేశి 

Comments are closed.