వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన లంచగొండి అని ఆయన తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కష్టపడి చదివి గ్రూప్-1 ద్వారా డీఎస్పీ ఉద్యోగం పొందిన భావన… ఎంతో ఉత్సాహంగా విధులు నిర్వర్తించాల్సింది పోయి, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
గ్రూప్-1 ద్వారా డీఎస్పీ ఉద్యోగం సాధించింది ప్రజలకు సేవ చేయడానికి కాదా? అని ఆయన ప్రశ్నించారు. వెంపర్లాడుతూ విధులు నిర్వర్తించాల్సిన డీఎస్పీ, అందుకు విరుద్ధంగా కార్యాలయానికే పరిమితమై, తన కిందిస్థాయి సిబ్బంది ద్వారా లంచాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించడం గమనార్హం.
నరసింహ అనే రాష్ట్రస్థాయి క్రికెట్ బుకీ కోసం, ఏం సంబంధం లేని అతని బంధువు మునివరపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆయన అన్నారు. దీని వెనుక రాష్ట్ర స్థాయిలోని ఉన్నత పోలీస్ అధికారి ఉన్నట్టు ఆయన ఆరోపించారు. నరసింహను రప్పించుకుని అతని నుంచి భారీ మొత్తంలో వసూలు చేయడానికే మునివరపై అక్రమ కేసు పెట్టారన్నారు. మునివరకు హితోపదేశం చేయడంతో 15 ఏళ్లుగా బెట్టింగ్‌కు దూరంగా వుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఒకవేళ మునివర బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు డీఎస్పీ అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. పోలీస్‌శాఖలో అందరూ లంచాలు పంచుకుంటున్నట్టు ఆయన ఆరోపించడం గమనార్హం. మద్యం దుకాణాల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. అక్రమ రేషన్ బియ్యం లారీని , సంబంధిత అక్రమార్కుల నుంచి డబ్బు తీసుకుని విడిచి పెట్టినట్టు ఆయన ఆరోపించారు.
Ee dunnapothu DSP oka pedda vedava. Ee musalodu inkoka vedava.. iddariki laavadevillo Theda vachhinatlundi