వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. తమ పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి అధికార పార్టీ కేసులతో వేధిస్తున్నదని అంటున్నారు.
ఇలాంటి సమయంలో కార్యకర్తలను కాపాడుకోవడానికి, వైసీపీ నాయకులు పూనుకుంటున్నారు. కేడర్ డీలాపడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలతో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అనేక సూచనలు చేశారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని, కేసులు పెడుతున్న వారిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉండాలని సజ్జల అంటున్నారు. ఎక్కడైనా కేసులు నమోదు అయితే గనుక.. నియోజకవర్గాల వారీగా ఉన్న నాయకత్వం వెంటనే స్పందించాలని, ఎక్కడికక్కడ పార్టీ కోసం సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, లాయర్ల సేవలను వాడుకోవాలని అంటున్నారు.
మొత్తానికి సోషల్ మీడియా కార్యకర్తలపై వచ్చే కేసుల సంగతి చూసుకోవడానికి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఒక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు, అక్కడ సీనియర్ న్యాయవాదులను సలహాలకోసం నిత్యం అందుబాటులో ఉంచబోతున్నట్టు సజ్జల ప్రకటించారు.
అంతా బాగానే ఉంది. తమ కార్యకర్తల మీద కేసులు నమోదు అయితే న్యాయపోరాటం చేయడం గురించి మాత్రమే సజ్జల వారికి ధైర్యం చెబుతున్నారు. అయితే.. దీనితోపాటు, అసలు కేసులు నమోదు కాకుండా పోస్టులు పెట్టేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచనలు చేస్తే బాగుంటుందని కార్యకర్తలు కోరుకుంటున్నారు.
స్వతహాగా జర్నలిస్టు కూడా అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి.. సోషల్ మీడియా పోస్టుల్లో ఎలాంటి భాష వాడాలి, ఎలాంటి భాష వాడకూడదు, పోస్టులకోసం నాయకుల ఫోటోలతో డిజైన్లు చేసేటప్పుడు ఎలాంటి హద్దులు గుర్తుంచుకోవాలి.. వంటి విషయాలను కూడా కార్యకర్తలకు తెలియజెబితే అసలు కేసులే నమోదు కాకుండా చూసుకోవచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టుల విషయంలో ఎలాంటి నియంత్రణ పాటించాలో అవగాహన కల్పిస్తే.. కేసుల దాకా రాకుండా.. ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగట్టడం సాధ్యమవుతుంది కదా? అంటున్నారు.
సోషల్ మీడియా లో హద్దులు దాటితేనే కే-సులు ఉంటాయా..
వేరే వారు పెట్టిన పోస్ట్ ను షేర్ చేస్తేనే ముసలావిడ అని కూడా చూడకుండా కే-సు పెట్టిన చరిత్ర మనది..
Valla drustilo kulilu vallu nuvvu marinu
మరి ఎలాంటి పొస్ట్లు పెట్టకొడదొ అవగాహన కల్పిస్తె మరి చంద్రబాబు ని పవన్ కల్యాన్ని బూ.-.తు.-.లు ఎవడు తిడతాడు అని సజ్జల అనుకొని ఉంటాడు? మరి క్యాడెర్ అలా చెయకపొతె మరి మన జగన్ అన్నకి కొపం రాదు?
Call boy jobs available 9989793850
ఇప్పుడు కావాల్సింది ఉపదేశాలు కాదు,.ఢీ అంటే ఢీ అనే నైజం..అదే పార్టీకి కొత్త నెత్తురు తెస్తుంది..
check if you lost common sense
vc estanu 9380537747
nee site lone paccchi bhotuu comment allow chestavu .. malli evadiko salaha enduku istav
ప్రతిపక్షం హోదా లేకపోయినప్పటికీ …. ఇంకా జగన్ తొత్తులతోనే ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులు జిల్లా అధికార ప్రతినిధులు కార్యకర్తలు అంతా జగన్ తొత్తు సజ్జల గారి హుకుమ్స్ ఫాలో అయితే…. ఇప్పటికీ కూడా జగన్ దిగి రాలేదంటే … ఆ పార్టీ ఎంటో ఒక్కసారి లెక్కేసుకొని… చూసుకోండి.కొద్దోగొప్పో సింపతైజర్స్ కూడా ఈ షాడో గాడు ఇంకా నాచు లాగా అట్టి పెట్టుకునే ఉన్నాడని బెంగయటం బెటర్…ఈ పార్టీ లో ఇంతే బ్రదర్స్ టైం వేస్ట్ ఎవరి పని వాళ్లు చూసుకోవడం బెటర్.
మంది సొమ్ము అప్పనంగా దోచుకున్నప్పుడే తప్పు రా పురుగులు పట్టి పోతాము అని చెప్పుంటే ఇవాళ ఆ దోచుకున్న సొమ్ము పంచుకోడానికి ఇలా రోడ్ల మీద పడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా %#’విజయమ్మ గారు..