జగన్ మీద కోపం… ఆయన సీఎం అయ్యారు

ఏపీలో ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కూటమి పట్ల ప్రజలు అనుకూలంగా స్పందించి ఓట్లు వేశారా, లేక జగన్…

ఏపీలో ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కూటమి పట్ల ప్రజలు అనుకూలంగా స్పందించి ఓట్లు వేశారా, లేక జగన్ మీద విపరీతమైన కోపంతో ఓట్లు వేశారా అనే అంశం మీద విశ్లేషణలు చూస్తే, రెండూ కరెక్ట్‌ అని అంటున్నారు.

దీని గురించి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ శర్మ విశ్లేషణ చేస్తూ, జగన్ మీద కోపంతోనే చంద్రబాబును ప్రజలు గెలిపించి సీఎం చేశారని అభిప్రాయపడ్డారు. 2019లో చంద్రబాబు మీద కోపంతో జగన్‌కు ఓటేసిన ప్రజలు, ఇప్పుడు జగన్ మీద ఆగ్రహంతో బాబుని తిరిగి అధికారం అప్పగించారని ఆయన అన్నారు.

“జగన్‌ అయినా బాబు అయినా, ఎవరు వచ్చినా వారికి అదానీ, అంబానీలు తప్ప, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు వంటి వారి కష్టాలు కనిపించడం లేదు,” అని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శర్మ, ఏ ప్రభుత్వం వచ్చినా పెట్టుబడిదారులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని, పేదల వైపు మాత్రం చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆఖరుకు ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముని కూడా ఇవ్వడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ఆయన అన్నారు. పెన్షన్ అన్నది ఉద్యోగుల హక్కు అని ఎవరి దయా దాక్షిణ్యాలు దానికి అవసరం లేదని అన్నారు. ప్రభుత్వాలు దిగి రావాలంటే ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏపీలో అయితే చంద్రబాబు లేకపోతే జగన్ అన్న రాజకీయం ఉందంటే ప్రజలకు ఎవరు నచ్చకపోతే రెండవ వారిని ఎన్నుకుంటున్నారు అని మాజీ ఎమ్మెల్సీ తన రాజకీయ విశ్లేషణగా చెప్పేశారు అనుకోవాలి.

16 Replies to “జగన్ మీద కోపం… ఆయన సీఎం అయ్యారు”

  1. మరి ఈ ముక్క జగన్ రెడ్డి కి తెలుసా..

    లక్షల కోట్లు సంక్షేమం చేసినా.. నువ్వే మా నమ్మకం జగనన్న అంటూ “సిద్ధం” సభల్లో కోట్ల మంది జనాలు ఘోషించినా..

    ఈ జగన్ రెడ్డి మీద కోపం ఎందుకొచ్చిందో.. పార్టీ లో ఏమైనా విశ్లేషించుకొన్నారా..?

    చంద్రబాబు ఈవీఎంలు మేనేజ్ చేసాడు అని .. పార్టీ సమావేశాల్ని సమోసా బిస్కట్ తో ముగించేశారా..?

    2024 లో ఎవరు ఓడినా.. వాళ్లకి రాజకీయ భవిష్యత్తు ఉండదని రెండు పార్టీలకు తెలుసు.. ప్రజలకు కూడా తెలుసు..

    అందుకే ప్రజలు జగన్ రెడ్డి ని తన్ని తరిమేసి.. శాశ్వతం గా వదిలించుకున్నారు..

    అర్థం చేసుకొంటే.. ఆ పార్టీ క్యాడర్ అయినా బాగు పడతారు..

  2. బద్దలైన అబద్దం..

    ===========

    ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా గత ప్రభుత్వం 14 లక్షల కోట్లు అని ఊరూ వాడా అబద్దాలు ప్రచారం చేశారు.. చంద్రబాబు, పవన్, ఇంకా మిగతా..

    ==========

    ఇప్పుడు అసెంబ్లీ లో రాష్ట్ర మొత్తం అప్పు 6 .5 లక్షల కోట్లు అని అనౌన్స్ చేశారు. మరి ఇన్నాళ్లు చెప్పిన 14 లక్షల కోట్లు అని ఊరూ వాడా చెప్పిన ప్రచారం అబద్దం…

    అలా చెప్పి జనాల్ని ఎధవల్ని చేశారు..

    ===========

    బద్దలైన ఇంకో అబద్దం ..

    1. అబద్దాలతో ఇలా ప్రజలని మోసం చేసి ప్రచారం చేయడం అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదమే…అదికూడా మొన్న అసెంబ్లీలో పేపర్లో ఆలా 14 లక్షలు కోట్ల అప్పులు అని రాసారు.. మేము వాటిని చూసి చెప్పాము అనడం ఇంకా పెద్ద తప్పిదమే… కొన్ని వ్యవస్థలని కొత్తగా జగనుగారు చేసినట్టు ఇంకెవరూ చేయలేదు… చేయలేరు

  3. ఈ శర్మ ఎవడో కళ్ళు మూసుకొని మాట్లాడుతాడా? నెహ్రూ ఇందిర టైమ్ లో adani కంపెనీ లేదు, ఏ రకమైన సంక్షేమ పథకాలు కూడా లేవు ఇప్పుడు ఉన్నట్లు!

    1. ఇప్పుడంతా అధాని మాయం. మోడీ మహాసేయుడు ఆదాని కోసమే విదేశాలకి 
      తిరుగుతున్నాడు
      1. ఈనాడు టీవీ చానెల్స్ అంబానీ తీసుకున్నపుడు, ఆంధ్రజ్యోతి ని CNN IBN తీసుకున్నపుడు, మా టీవీ చానెల్స్ ని స్టార్, జెమినీ ని మారన్ సొంతం చేసుకున్నప్పుడు ఈ బాధ ఏమైంది?

  4. అయ్యా! శర్మ గారూ ఈ మాత్రం చెప్పడానికి తమరు విశ్లేషకులు అవ్వాలా ఏమిటి? ఇద్దరు ఉన్నప్పుడు ఒక్కడే గెలుస్తాడు . వాడి మీద కోపం అయినా వీడి మీద ప్రేమ అయినా ‘ఒక్కడికే అవకశం ‘బీదలకేసి చూస్తు ఉంటే పోషణ ఎక్కడి నుంచి వస్తుంది సార్ తమ కుటుంబానికి తమరు పెట్టుబడిదారు కాబట్టి తక్కి న వాళ్లు సద్దుకు పోతున్నారు తమకు తెలియనిది కాదు ‘దేశానికి నాయకులు ఉన్నా అంబానీలు దానీలు ఉంటేనే భవిష్యుత్తు ‘ వర్మలు, శర్మలు కారు క్షమించగలరు. న

  5. ఆ విషయం ఆ రివర్స్ తుగ్లక్ బచ్చగానికి చెప్పండి

    ఐదు ఏళ్లకే అతను అంటే ఎందుకు అంత ఏవగింపు కలిగిందో అడగండి. ప్రజా పాలన పేరిట అరాచక విధ్వంస పాలన సాగిస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పండి. ప్రజా పాలన మరిచి పగా ప్రతీకారమే ధ్యేయంగా పాలన సాగిస్తే ఎలా ఉంటుందో చెప్పండి.

    ఊరంతా ఉత్తరం అంటే ఉలిపి కట్టే దక్షిణ మన చందంగా పరిపాలన సాగిస్తే ఎలా ఉంటుందో చెప్పండి

    అమరావతి పూర్తిచేస్తే చంద్రబాబు పేరు వస్తుందని దానిని పాడు పెట్టి పెట్టి మూడుముక్కలాడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన అర్హతలు ఏమిటి రాజశేఖర్ రెడ్డి కొడుకు అనేగా. మరి రాజశేఖర్ రెడ్డి పాలన ఎలా సాగింది ఈయన పాలన ఎలా సాగింది దానికి ఫలితం ఏమొచ్చిందో తెలిసిందే కదా. పిల్ల కాకికి ఏమి తెలుసు ఉండేది డబ్బా అన్న సంగతి ఈయనకు తెలిసినట్టు లేదు. అందుకే పొంగనామాలు వచ్చాయి

    కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇంతటి పరాభవము పగవానికి కూడా వద్దు

  6. ఇక ఆర్దనరీ ఆన్సర్ sir మీ లాంటి వాళ్ళు రాజకీయ విసెలేశకులుగా ఉండాలి…

  7. జనాలు 2019 లో 151 సీట్లు లె..1 కి ఇచ్చి, 2024 లో 164 సీట్లు కూటమికి ఇస్తే ఎక్కువ కోపం ఎవరిమీద ఉన్నట్టు శర్మ గారు..?

Comments are closed.