వాచీలో చిలుక.. షర్మిల!

ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు అంటే వైఎస్ జగన్‌ను తిట్టడానికి మాత్రమే అని ఫిక్స్ అయిపోవచ్చు.

సాలార్ జంగ్ మ్యూజియంలో ఓ క్లాక్ ఉంది. పన్నెండు కాగానే ఆ వాచీ గూట్లోంచి ఓ చిలుక బయటకు వచ్చి పన్నెండు సార్లు కూసి మళ్లీ లోపలకు వెళ్లిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల వైఖరి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు అంటే వైఎస్ జగన్‌ను తిట్టడానికి మాత్రమే అని ఫిక్స్ అయిపోవచ్చు.

కాంగ్రెస్ పార్టీ అనేది ఏపీలో ప్రతిపక్ష పార్టీ అన్న సంగతి షర్మిల పూర్తిగా విస్మరించారు. బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కనుక కాంగ్రెస్ తరఫున ఎన్నో పోరాటాలు సాగించవచ్చు, కార్యక్రమాలు చేపట్టవచ్చు. కానీ షర్మిల అవేమీ చేయడం లేదు.

కేవలం తెలుగుదేశం పార్టీ అందించిన స్క్రిప్ట్ అనే అనుమానం కలిగేలా ఒకసారి మాట్లాడి, సైలెంట్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శించాలంటే మాత్రం ఓ చిన్న ప్రెస్ నోట్ లేదా ఓ చిన్న ట్వీట్‌తో సరిపెడతారు. జనం కాంగ్రెస్ పార్టీని ఎలా నమ్ముతారు? ఇలా వ్యవహరిస్తుంటే షర్మిల సారధ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిలో ఓ భాగం అనుకుంటారు తప్ప వేరు కాదు.

జగన్‌ను గట్టిగా తిట్టాలి అని తెలుగుదేశం పార్టీ అనుకుంటే చాలు షర్మిల బయటకు వస్తారు. కేవలం జగన్‌ను మాత్రమే దుయ్యబట్టి వెళ్తారు. ఇదంతా చూసి ఏ నాయకుడు కాంగ్రెస్‌లో చేరతాడు? కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క కార్యక్రమం చేపట్టిన దాఖలా ఉందా?

గమ్మత్తేమిటంటే, ఇదంతా చూస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంది, షర్మిలను కొనసాగిస్తోంది. అంటే ఏపీ వరకు బీజేపీ.. కాంగ్రెస్.. తెలుగుదేశం.. జనసేన.. ఎక్స్‌ట్రా.. ఎక్స్‌ట్రా పార్టీలు అన్నీ ఒకటే కూటమి అనుకోవాలేమో?

30 Replies to “వాచీలో చిలుక.. షర్మిల!”

  1. స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది, ycheep పార్టీని నామరూపాలు లేకుండా చేస్తే ఆ వాక్యూమ్ లోకి రావాలని చూస్తుంది

  2. ఈ వార్త నిజం కాదు. అదాని కేసు విషయంలో వైసీపీ నీళ్లు నములుతుంటే షర్మిల కూటమిని కనీసం ప్రెస్‌మీట్‌లో నిలదీస్తోంది. వైసీపీపై విమర్శల్లో షర్మిల అనుసరిస్తున్న విధానం కరెక్టే. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ముందు ప్రధాన ప్రతిపక్షాన్ని బలహీనపరిచి ఆ కాడర్ లాక్కుంటే తను ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీ ఎం.ఎల్.ఏ.లు అసెంబ్లీకి వెళ్లకపోవడంతో కనీసం ఇద్దరు కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.లుంటే తాము అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్ష గళం వినిపించి ఉండేవాళ్లం అన్న షర్మిల మాటలకి కొంతైనా స్పందన ఉంటుందని నా అభిప్రాయం

  3. ఈ వార్త నిజం కాదు. అదాని కే..సు విషయంలో వైసీపీ నీ..ళ్లు నములుతుంటే ష..ర్మి..ల కూటమిని కనీసం ప్రెస్‌మీట్‌లో నిలదీస్తోంది. వైసీపీపై విమర్శల్లో షర్మిల అనుసరిస్తున్న విధానం కరెక్టే. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ముందు ప్రధాన ప్రతిపక్షాన్ని బలహీనపరిచి ఆ కాడర్ లాక్కుంటే తను ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీ ఎం.ఎల్.ఏ.లు అసెంబ్లీకి వెళ్లకపోవడంతో కనీసం ఇద్దరు కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.లుంటే తాము అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్ష గళం వినిపించి ఉండేవాళ్లం అన్న షర్మిల మాటలకి కొంతైనా స్పందన ఉంటుందని నా అభిప్రాయం

  4. కాంగ్రస్ వోటింగ్ అంత వైసీపీ దగ్గర వుంది వాళ్ళ వోటింగ్ తెచ్చుకోవాలంటే జగన్ గారినే టార్గెట్ చెయ్యాలి జనసేన టీడీపీ లను చేస్తే ఏమి రాదు

  5. అవునా, అలాగే ja *** ప్రెస్ మీట్ పెట్టాడంటే శవం దొరికిందని అర్థం!!!!

  6. Assembly కి వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలు చర్చించే వారికే మా ఓటు వేస్తాం అంటున్న పులివెందుల ప్రజలు..

    Next టైం మా mla Sharnila💐

  7. Jagan aney vadu than Thalli ki and Cheylli ki mosam cheysadu annadi nijam kada?

    Mari thana ki cheysina mosam gurinchi aamey adagatam tappa?

    Jagan mocheyti neallu tagey ea GratAndhra Reddy ki muddi meada chala kopam vastadi Jagan ni evarina emi=anna annaru antey.

  8. తెలంగాణ లో తంతే ఆంధ్రప్రదేశ్లో వచ్చి పడింది ఇక్కడ తన్నేవాళ్ళు లేరు కాబట్టి ఇక్కడే ఉంది ఇక్కడ తంతే ఎక్కడకు పోతదో

  9. ఇండి*యా కూట*మి లో చేర్చు*కోండి అని సో*నియా, రాహు*ల్ కా*ళ్ళ మీ*ద ప*డి బో*రు మని ఏడ్చి*న జ*గన్ అని ఢిల్లీ* లో వా*ర్తలు. నిజమేనా గ్రే*ట్ ఆంద్ర*?

  10. కుళ్ళు + ఈర్ష్య +దుగ్ద =sharmila.పెళ్ళై ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్న సంపాదన ఆశిస్తున్న పరాన్న జీవి

  11. ప్యాలెస్ లో చిలుక.. లెవెన్ రెడ్డి.!

    అసెంబ్లీ కి పోయే దైర్యం లేక ప్యాలెస్ లో సెక్రటేరియట్ సెట్టింగ్ ఏసుకుని, తన అనుకూల మీడియా ముందు మాత్రమే అతి మంచితనం, అతి నిజాయితీ పలుకులు పలుకుతున్న A1 చిలుక

Comments are closed.