చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!

హైదరాబాద్ శంషాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

హైదరాబాద్ శంషాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే, మంచు మనోజ్, అతని భార్య ఇంటికి చేరుకోగా, సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డగించారు. గేటు వద్ద మనోజ్ వాహనాన్ని ఆపడంతో, ఆయన కారు నుంచి దిగిపోతూ గేట్లను తోసుకుంటూ ఇంటి లోపలికి వెళ్లారు.

గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించిన మనోజ్‌పై, మోహన్ బాబు సిబ్బంది, బౌన్సర్లు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో, మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం, గాయాలపాలైనట్లు కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.

చిరిగిన చొక్కాతో బయటకు వచ్చిన మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “పోలీసుల దగ్గరుండి నన్ను కొట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?” అని ప్రశ్నించారు.

ఈ ఘటన తర్వాత మోహన్ బాబు మీడియా ప్రతినిధులతో ఘర్షణకు దిగారు. మీడియా ప్రతినిధులపై బూతులు తిడుతూ దాడి చేశారు. ఆ దాడిపై మీడియా ప్ర‌తినిధికి గాయాల‌య్యాయి.

ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు వెంటనే మోహన్ బాబు నివాసానికి చేరుకుని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మోహన్ బాబు, మంచు విష్ణు తుపాకులను సీజ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఈ సంఘటన మంచు కుటుంబంలో వున్న విభేదాలు మరింత తీవ్రం అయ్యాయి.

12 Replies to “చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!”

        1. jagan family brother & sister are in two prominent political parties their allegations on each other carry political significance… so media coverage is not wrong…Manchu family issue is purely personal without any political activity involved… both are not same

Comments are closed.