ఇప్పుడే టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగ‌పాము చొర‌బ‌డాలా?

ప్ర‌స్తుత త‌రుణంలో టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగుపాము వెళ్ల‌డంపై ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు.

తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి అత్యంత శ‌క్తిమంత‌మైన దైవంగా హిందువుల విశ్వాసాన్ని చూర‌గొన్నారు. క‌లియుగ దైవమైన తిరుమ‌ల శ్రీ‌వారి విష‌యంలో ఏ చిన్న త‌ప్పు చేసినా, శిక్ష త‌ప్ప‌ద‌నే భ‌యం ప్ర‌తి ఒక్క‌రిలో వుంది. ప్ర‌స్తుతం టీటీడీ గోశాల‌లో గోమాత‌ల మ‌ర‌ణాల‌పై తీవ్ర వివాదం ఏర్ప‌డింది. టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మూడు నెల‌ల్లో వంద‌కు పైగా గోవుల ప్రాణాలు పోయాయ‌ని చేసిన ఆరోప‌ణ‌తో కూట‌మి ప్ర‌భుత్వం ఉలిక్కి ప‌డింది.

ఈ నేప‌థ్యంలో టీటీడీ ఈవో శ్యామ‌లారావు, చైర్మ‌న్ ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు గోవుల మ‌ర‌ణాల‌పై ఒక్కో సంఖ్య చెప్ప‌డంతో వివాదం మ‌రింత జ‌ఠిల‌మైంది. ఈ ముగ్గురు వేర్వేరుగా వెల్ల‌డించిన వివ‌రాలు వైసీపీకి అస్త్రాల‌య్యాయి. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి విష‌యంలో ఎవ‌రైనా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే, త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంద‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో తిరుప‌తిలో టీటీడీ ఈవో శ్యామ‌లారావు బంగ్లాలోకి నాగుపాము చొర‌బ‌డింది. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతం చెంద‌న తిరుప‌తి వుంది. ఇక్క‌డ పాములుండ‌డం స‌హ‌జం. అయితే ఈవో బంగ్లాలోకి నాగుపాము వెళ్ల‌డం, దాన్ని టీటీడీ రిటైర్ట్ ఉద్యోగి ర‌వీంద‌ర్‌నాయుడు ప‌ట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. పామును ప‌ట్టుకుని గోనె సంచిలో వేస్తుండ‌గా ర‌వీంద‌ర్‌నాయుడి చేతిపై పాము కాటు వేయ‌డం గ‌మ‌నార్హం.

ఆయ‌న్ను వెంట‌నే స‌మీపంలోని స్విమ్స్‌కు త‌ర‌లించి, చికిత్స అందించారు. అయితే గోశాల‌లో గోవుల మ‌ర‌ణాల‌పై వివాదం చెల‌రేగిన ప్ర‌స్తుత త‌రుణంలో టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగుపాము వెళ్ల‌డంపై ప్ర‌జ‌లు ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు.

16 Replies to “ఇప్పుడే టీటీడీ ఈవో బంగ్లాలోకి నాగ‌పాము చొర‌బ‌డాలా?”

  1. చైర్మన్ గా ధర్మారెడ్డి ఎప్పుడు వచ్చారు. ముందు proper గ న్యూస్ పబ్లిష్ చేయి.

  2. మన జగన్ రెడ్డి పెబుత్వం లో నాగుపాములు జగన్ రెడ్డి సంక్షేమాన్ని మెచ్చి.. జగన్ రెడ్డి కి ఓటు వేయాలనే అత్యుత్సాహం తో ఈవీఎంలోకి దూకి సచ్చిపోయిన విషయాన్ని.. మనం మర్చిపోతే ఎలా..?

    జగన్ రెడ్డి కి వచ్చిన 40% ఓట్లలో నాగుపాముల ఓట్లు కూడా ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం..

  3. చివరికి పాములతొ కూడా రాజకీయాలు మొదలు పెట్టారా? ఎందిరా అయ్యా ఈ పిచ్చి రాతాలు!!

Comments are closed.