జైల్లో పోసానికి ప్ర‌త్యేక గ‌ది

రాజంపేట స‌బ్ జైల్లో ఉన్న సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళికి ప్ర‌త్యేక గ‌దిని జైలు అధికారులు కేటాయించారు.

రాజంపేట స‌బ్ జైల్లో ఉన్న సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళికి ప్ర‌త్యేక గ‌దిని జైలు అధికారులు కేటాయించారు. రెండు రోజుల క్రితం శివ‌రాత్రి రోజు రాత్రి హైద‌రాబాద్‌లో నివాసంలో ఉన్న పోసానిని అన్న‌మ‌య్య జిల్లా ఓబులవారిప‌ల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 14 గంట‌ల పాటు సుదీర్ఘ ప్ర‌యాణం త‌ర్వాత పోసానిని ఓబుల‌వారిప‌ల్లె పోలీస్‌స్టేష‌న్‌కు తీసుకెళ్లారు.

అనంత‌రం అన్న‌మ‌య్య జిల్లా ఎస్పీ విద్యాసాగ‌ర్‌నాయుడు ఆయ‌న్ను సుదీర్ఘంగా విచారించారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా రిమాండ్ విధించారు. దీంతో ఆయ‌న్ను రాజంపేట స‌బ్ జైలుకు త‌ర‌లించారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కు మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

పోసానిని ప్ర‌త్యేక నిందితుడిగా ప‌రిగ‌ణించి అందుకు త‌గ్గ‌ట్టు స్పెష‌ల్ రూమ్ కేటాయించడం విశేషం. త‌న‌తో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో దూషించేలా, రెచ్చ‌గొట్టేలా మాట్లాడించార‌ని నేర అంగీకార ప‌త్రంలో సంత‌కం చేసిన‌ట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసు ఎంత వ‌ర‌కు నిలుస్తుంద‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మ‌రోవైపు పోసాని బెయిల్ కోసం రైల్వేకోడూరు కోర్టులో పిటిష‌న్ వేశారు. ఇవాళ‌, రేపు సెల‌వు కావ‌డంతో సోమ‌వారం పోసాని పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం వుంది.

5 Replies to “జైల్లో పోసానికి ప్ర‌త్యేక గ‌ది”

    1. ఫస్ట్ తెలుగు రాయడం నేర్చుకో, తరువాత ఇంగ్లీషులో ఏడుద్దువు గాని..

Comments are closed.