తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై స‌స్పెన్ష‌న్ వేటు

కాంగ్రెస్ పార్టీ త‌నను బ‌య‌టికి పంపితే, తాను కోరుకున్న రాజ‌కీయాలు చేయొచ్చ‌ని ఎమ్మెల్సీ మ‌ల్ల‌న్న భావిస్తున్నారు. మ‌ల్ల‌న్న కోరుకున్న‌ట్టే జ‌రిగింది.

పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌నే కార‌ణంతో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కాంగ్రెస్ పార్టీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ చైర్మ‌న్‌, మాజీ మంత్రి జీ.చిన్నారెడ్డి ప్ర‌క‌టించారు. కొంత కాలంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కాంగ్రెస్ పార్టీ విధానాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా బీసీ నినాదంతో ఆయ‌న త‌న‌దైన రాజ‌కీయాన్ని చేస్తున్నారు.

బీసీ రాజ‌కీయాలు చేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీకి అభ్యంత‌రం ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ రెడ్డి సామాజిక వ‌ర్గంపై ఆయ‌న య‌థేచ్ఛ‌గా అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్స్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల నుంచి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ, బీఎస్పీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశారు.

పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల్ని ఉల్లంఘిస్తున్నందుకు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చిన్నారెడ్డి గ‌త నెల 5న నోటీసులు ఇచ్చారు. వారంలోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరారు. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి వివ‌ర‌ణ అత‌ని నుంచి వెళ్ల‌లేదు. దీంతో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై స‌స్పెండ్ వేటు వేశారు. బ‌హుశా ఈ చ‌ర్య‌ల్నే తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా కోరుకుంటున్న‌ట్టుగా వుంది.

కాంగ్రెస్ పార్టీ త‌నను బ‌య‌టికి పంపితే, తాను కోరుకున్న రాజ‌కీయాలు చేయొచ్చ‌ని ఎమ్మెల్సీ మ‌ల్ల‌న్న భావిస్తున్నారు. మ‌ల్ల‌న్న కోరుకున్న‌ట్టే జ‌రిగింది.

6 Replies to “తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై స‌స్పెన్ష‌న్ వేటు”

    1. అంటే ఎగస్పార్టీ వాళ్ళను కాకుండా సొంత పార్టీ నేతలను విమర్శించటం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమైనదని అర్ధం 🙂

Comments are closed.