అందుకే వైసీపీ కార్యక్రమాలకు దూరం!

తన సొంత సమస్యల వల్లనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను అని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు.

వైసీపీ నుంచి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బయటకు వెళ్తారని ప్రచారం ఇటీవల కొద్ది రోజులుగా జరుగుతోంది. ఆయన జనసేనలో చేరుతారని కూడా చెబుతున్నారు. ఆయన వైసీపీ నుంచి జంప్ అవుతారని తామర తంపరగా వార్తలు వస్తున్నాయి. దాని మీద మొదటి సారి తమ్మినేని సీతారాం రియాక్ట్ అయ్యారు. తాను వైసీపీ నుంచి వెళ్ళడం లేదు, ఏ పార్టీలోనూ చేరడం లేదు అని వివరణ ఇచ్చారు. తనకు జనసేనలో చేరాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు

తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలని ఆయన ఖండించారు. తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నారని అందుకే తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను అని తమ్మినేని వివరణ ఇచ్చారు.

ప్రతీ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం ఆపండి అంటూ ఆయన ఘాటుగానే స్పష్టం చేశారు. తమ్మినేని గొంతుక అయితే కొన్నాళ్లుగా పార్టీ వేదికల మీద వినిపించడం లేదు. ఆయన సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో కొత్త వారిని ఇంచార్జి బాధ్యతలు అప్పగించడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు అని ప్రచారం కూడా చేస్తున్నారు.

అయితే తన సొంత సమస్యల వల్లనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను అని తమ్మినేని క్లారిటీ ఇచ్చారు. ఆయన వైసీపీలో ఉంటున్నట్లుగా చెప్పారని అంటున్నారు. అయితే ఆయన తాజాగా చేసిన ఈ ప్రకటనతో అయినా ఈ ప్రచారం ఆగుతుందా అంటే చూడాలని అంటున్నారు. మునుపటి మాదిరిగా తమ్మినేని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటేనే తప్ప వీటికి చెక్ పడే అవకాశం లేదని అంటున్నారు.

8 Replies to “అందుకే వైసీపీ కార్యక్రమాలకు దూరం!”

  1. ‘ఒరే సీతి తమ్మి, పార్టీ లో ఉన్నానుంటూ మావోడు పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చెయ్యకుండా ఏ పార్టీ లోనూ బేరం దొరక్క గోపీగాడిలా ఉండటమే నీ భాషలో “లంజత్వం” అంటే

  2. జనసెన నుండి స్పందన కరువు అయినట్టు ఉంది. లెక పొతె ఇన్ని రొజులు ఈ ముక్క ఎందుకు చెప్పలెదు!

Comments are closed.