తెలంగాణ ఎన్నికల్లోకి టీడీపీ ఎంట్రీ?

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వం ప్రకటిస్తేగానీ టీడీపీ ఏం చేయబోతున్నదో తెలుస్తుంది.

ఎన్నికలంటే అసెంబ్లీ ఎన్నికలో, పార్లమెంటు ఎన్నికలో కాదు. తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని అంటున్నారు.

ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గట్టి పట్టుదలతో ఉన్నారట. తెలంగాణలో పార్టీకి నాయకత్వం లేదుగానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారని అంటున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తండ్రీ కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు అండ్ ఆయన కుమారుడు ప్లస్ ఏపీ మంత్రి అయిన నారా లోకేష్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తొందరలో అంటే కొత్త ఏడాది ప్రారంభమైన కొన్ని రోజుల్లో తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాలని అనుకుంటున్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలనేదానిపై ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మతో బాబు సమావేశం అయినట్లు తెలుస్తోంది. టీడీపీ అధ్యక్ష పదవి రేసులో తీగల కృష్ణా రెడ్డి, బాబూ మోహన్, అరవింద కుమార్ గౌడ్ ఉన్నారు.

టీడీపీ తెలంగాణలో కార్యకలాపాలు మొదలుపెడితే బీజేపీ అండ్ బీఆర్ఎస్ నుంచి కూడా కొందరు నాయకులు టీడీపీలోకి వెళ్ళవచ్చనే ఉహాగానాలు సాగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే టీడీపీ పోటీ చేస్తుందని టాక్ వచ్చింది. కానీ టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బ తింటాయని రేవంత్ రెడ్డి చెబితే చంద్రబాబు ఆగిపోయాడని అంటారు.

అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నాయకులు బాబు మీద ఒత్తిడి చేశారు. కానీ ఏపీలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బాబు తన దృష్టి మొత్తం ఏపీ మీదనే పెట్టారు. అనుకున్నట్లే అక్కడ బీజేపీ, జనసేనతో కూటమి ఏర్పాటు చేసి ఘనవిజయం సాధించారు. వచ్చే ఎన్నికలవరకు ఏపీలో టీడీపీకి ఢోకా లేదు.

కాబట్టి ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు నాయకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని చంద్రబాబు ఇప్పటివరకు ప్రకటించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వం ప్రకటిస్తేగానీ టీడీపీ ఏం చేయబోతున్నదో తెలుస్తుంది.

4 Replies to “తెలంగాణ ఎన్నికల్లోకి టీడీపీ ఎంట్రీ?”

  1. ఆంధ్రలో 151 స్పీడ్ లో తిరుగుతున్న FANన్ని ఆపేసిన రేవంత్ రెడ్డిని ఓడించాలంటే, మనం కూడా అక్కడ పోటీ చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకు కి దెబ్బ కొట్టాలి అని తింగిరి సన్నాసి కి సలహా ఇచ్చిన సజ్జలు.

  2. ఆంధ్రాలోనే ఒకపక్క జనసేన ఇంకోపక్క బీజేపీ లేకుంటే పోటీ చెసే ధైర్యం కూడా లేదు .. పక్క రాష్ట్రాల్లో గెలుకుడు అవసరమా

Comments are closed.