లోకేష్ గుడ్ లుక్స్ కోసం!

లోకేష్ గుడ్ లుక్స్‌లో పడేందుకు అనేక మంది టీడీపీ నేతలు పోటీ పడ్డారు.

విశాఖ పర్యటనకు లోకేష్ వచ్చారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయడం కోసం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలకు కూడా దిశా నిర్దేశం చేశారు. లోకేష్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు తమ ప్రభుత్వం ఏమి చేసింది, ఏమి చేస్తోందో వివరించే ప్రయత్నం చేశారు. లోకేష్ ఈసారి పర్యటనలో ఎక్కువగా సీనియర్ నేతలు ఆయన వెంట కనిపించడం విశేషం.

లోకేష్ గుడ్ లుక్స్‌లో పడేందుకు అనేక మంది టీడీపీ నేతలు పోటీ పడ్డారు. అంతే కాదు, జనసేనకు చెందిన నాయకులు కూడా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. వారంతా గతంలో టీడీపీలో పనిచేసిన వారే కావడం విశేషం.

ఉత్తరాంధ్రలో అనుకున్న వారికి మంత్రి పదవులు దక్కలేదు. అలాగే నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది చూస్తున్నారు. వారి ఆశలు నెరవేరడం లేదు. దాంతో వారంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ రావడంతో, ఆయనను కలవడం, ఆయనతోనే ఉంటూ కనిపించడం ద్వారా తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో లోకేష్ అతి ముఖ్యుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చంద్రబాబు తర్వాత అంతటి వారిగా ఉన్నారు. దాంతో లోకేష్ చుట్టూనే టీడీపీ తమ్ముళ్లు ర్యాలీ అవుతున్నారని అంటున్నారు.

అయితే లోకేష్ టీడీపీపై పూర్తి పట్టు సాధించారు. ఆయన ఆలోచనలు కూడా ఆయనకు ప్రత్యేకం. టీడీపీకి కొత్త రక్తాన్ని అందించాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. పార్టీ మరింత కాలం ముందుకు సాగాలంటే యువ నేతలు అవసరమన్న భావనతో టీడీపీ ఉందని చెబుతున్నారు. దాంతో సీనియర్లు లోకేష్ చుట్టూ కనిపించినా, టీడీపీ ఒక పార్టీగా తీసుకోవాల్సిన సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. అయినా ఎవరి ప్రయత్నాలు వారివి, ఎవరి ఆశలు వారివి అని అంటున్నారు.

14 Replies to “లోకేష్ గుడ్ లుక్స్ కోసం!”

  1. ఏమి చెప్పాలనుకున్నావో ఏందో? లోకేష్ తో సీనియర్లు లేరంటావ్…నువ్వు వేసిన ఫోటో నే చెబుతుంది….లోకేష్ వెనుక గత రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షులు, హ్యాట్రిక్ కొట్టిన సీనియర్లు ఉన్నారు అని

    1. తాడేపల్లి పిల్లి.. పులివెందుల పులకేశి.. ఆంధ్రుల పాలిట సైకో నాయాల ఒకడుండే వాడు కనీసం ఆ పార్టీ వాళ్ళకి కూడా అందుబాటులో లేకుండా కదరా అదే వాడి బ్రతుకు 😂😂

  2. కనీసం నాయకుడు లోకల్ నుండి.. మంత్రుల స్థాయి వరకు కలుస్తూ వారి సాధకబాధకాలు వింటూ ఉన్నారు.. అప్పట్లో ఒకడుండే వాడు తాడేపిల్లి ఇంట్లోనే కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ.. వాడి లా ఐతే కాదు కదరా GB గా 😂

  3. పిల్లి.. పులివెందుల పులకేశి.. ఆంధ్రుల పాలిట సైకో నాయాల ఒకడుండే వాడు కనీసం ఆ పార్టీ వాళ్ళకి కూడా అందుబాటులో లేకుండా కదరా అదే వాడి బ్రతుకు 😂😂

Comments are closed.