కూటమిలో సకల శాఖ మంత్రి

టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ సకల శాఖల మంత్రి ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన ఎవరో కాదని చంద్రబాబు తనయుడు, మంత్రి అయిన నారా లోకేష్ అని అంటున్నారు.

గతంలో వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రి అని అసలు మంత్రి కాని ఒకాయన పేరు వినిపించేది. దానినే పట్టుకుని విపక్షం భారీ విమర్శలు చేసేది. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగేది. ఇది కాస్త ఆ ప్రభుత్వం పట్ల జనంలో అసంతృప్తి పెరగడానికి కారణమైంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ సకల శాఖల మంత్రి ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన ఎవరో కాదని చంద్రబాబు తనయుడు, మంత్రి అయిన నారా లోకేష్ అని అంటున్నారు.

ఆయన అన్ని శాఖల గురించి మాట్లాడుతారని, కానీ ఆయన సొంత శాఖతో పాటు ఏ శాఖ మీద ఆయనకు పెద్దగా అవగాహన లేదని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ ఘాటు విమర్శలు చేశారు. ఏడు నెలల కూటమి పాలనలో ప్రజలకు తాము చేసిన మేలు ఏదో చెప్పుకోవాల్సింది పోయి, ఇంకా వైసీపీ ప్రభుత్వం మీదనే ఆరోపణలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని ఆయన విమర్శించారు.

ఉత్తరాంధ్రలో వైసీపీ అయిదేళ్ల పాలనలోనే మేలు జరిగిందని గుడివాడ అన్నారు. దీని మీద కావాలంటే డిబేట్‌కి తాను సిద్ధమని సవాల్ చేశారు. శ్రీకాకుళంలోని ఉద్దానానికి ₹700 కోట్ల రూపాయలతో రక్షిత మంచి నీరు అందించినా, పలాసలో ఆసుపత్రిని నిర్మించినా అది జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని అన్నారు.

విశాఖలో అనేక పరిశ్రమల రాకకు బాటలు వేశామని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న వాటినే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. రైల్వే జోన్‌కి తమ ప్రభుత్వం 52 ఎకరాల భూమిని ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. రైల్వే జోన్, బల్క్‌ డ్రగ్‌ పార్క్, ఎన్టీపీసీ రావడం జగన్ ఘనతే అని ఆయన చెప్పారు. ఊరకే ఈ మాటలు చెప్పడం లేదని, జీవోలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

శ్రీకాకుళంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూలపేట పోర్టు నిర్మాణం మొదలుపెట్టామని ఆయన చెప్పారు. అలాగే విజయనగరం, పాడేరుల్లో మెడికల్ కాలేజీలు నిర్మించామని చెప్పారు. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ తీసుకొచ్చామని, సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశామని వివరించారు.

అదే విధంగా కోర్టు కేసులను పరిష్కరించి అన్ని అనుమతులు సాధించి ప్రతిష్ఠాత్మకమైన భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం మొదలుపెట్టడంతో పాటు, 2002 ఎకరాలు సమీకరించి పునరావాస పనులు కూడా పూర్తి చేయడం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ ఘనతే అని గుడివాడ క్లెయిమ్ చేశారు.

11 Replies to “కూటమిలో సకల శాఖ మంత్రి”

  1. మీ “సకల శాఖా మంత్రి” కి 11 వచ్చాయి.. మా “సకల శాఖా మంత్రి” కి 135 సీట్లు ఇచ్చారు ప్రజలు..

  2. అమరనాథ్ ప్లీజ్ ఆపు బై రాసిచిన స్క్రిప్ట్ సూపర్ చదువుతున్నావ్ తెలుగు బానే ఉంది నీది. జగ్గడిని సపోర్ట్ చెయ్యడం అంటేనే పాముకి పాలు పోసి పెంచడం. నీకు కుక్క కి బొక్క ఏసినట్టు మంత్రి ఇచ్చిండు కాదా అని అంత లేపకు వాణ్ని

  3. అమరనాథ్ ప్లీజ్ ఆపు బై రాసిచిన స్క్రిప్ట్ సూపర్ చదువుతున్నావ్ తెలుగు బానే ఉంది నీది. జగ్గడిని సపోర్ట్ చెయ్యడం అంటేనే పాముకి పాలు పోసి పెంచడం. నీకు కు క్క కి బొక్క ఏసినట్టు మంత్రి ఇచ్చిండు కాదా అని అంత లేపకు వాణ్ని

Comments are closed.