ప‌వ‌న్ స‌హా జ‌న‌సేనపై టీడీపీ మీడియా నిఘా!

జ‌న‌సేన మంత్రులు, ఎమ్మెల్యేల‌పై టీడీపీ నేత‌లెవ‌రూ మాట్లాడ‌కుండా, వాళ్ల మీడియా ప‌ని ప‌డుతుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రానున్న రోజుల్లో జ‌న‌సేన మంత్రులు, ఎమ్మెల్యేల‌పై టీడీపీ అనుబంధ మీడియా ఒక క‌న్నేసి ఉంచ‌నుంది. ఏపీ హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌పై ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఘాటు కామెంట్స్ నేప‌థ్యంలో టీడీపీ గుర్రుగా వుంది. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు టీడీపీ నాయ‌కులెవ‌రూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌పై స్పందించ‌న‌ప్ప‌టికీ ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలిసింది.

అధికారంలోకి వ‌చ్చి ఐదు నెల‌లు కూడా కాక‌పోవ‌డం, మ‌రోవైపు జ‌నం తిడ్తున్నార‌ని ప‌వ‌న్ చేసిన కామెంట్స్ కూట‌మి స‌ర్కార్‌కు రాజ‌కీయంగా న‌ష్టం తెచ్చాయ‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో వుంది. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క‌రువ‌య్యాయ‌ని, దానికి అనితే కార‌ణ‌మ‌ని, ఆమె చ‌ల‌నం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప‌వ‌న్ చేసిన కామెంట్స్ ప్ర‌తిప‌క్షానికి రాజ‌కీయంగా ఆయుధం ఇచ్చిన‌ట్టైంది.

ఈ నేప‌థ్యంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు జ‌న‌సేన మంత్రులు, అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపై నిఘా పెట్టాల‌నే ఆలోచ‌న‌లో టీడీపీ వుంది. అంతేకాదు, జ‌న‌సేన మంత్రులు ఏ మేర‌కు విజ‌య‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారో చూడాల‌ని టీడీపీ అనుకూల మీడియా సీరియ‌స్‌గా వుంది. అలాగే జ‌న‌సేన ఎమ్మెల్యేల అరాచ‌కాల‌పై త్వ‌ర‌లోనే వ్య‌తిరేక క‌థ‌నాలు మొద‌లు పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఆ మీడియా ఉంది.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నార‌ని, ఆయ‌నకు ప‌రిపాల‌న అంటే ఏంటో రుచి చూపాల‌ని ఆలోచ‌న‌తో టీడీపీ పెద్ద‌లున్నారు. అందుకే జ‌న‌సేన మంత్రులు గొప్ప‌గా చేస్తున్న ప‌నులేవీ లేవ‌ని త్వ‌ర‌లో నిరూపించ‌నున్నారు. జ‌న‌సేన ఎమ్మెల్యేలు ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఇంత‌కాలం ఎందుకులే అనుకున్నామ‌ని, ఇక‌పై ఉపేక్షిస్తే అస‌లుకే ఎస‌రు తెచ్చేలా ఉన్నార‌నే ఆలోచ‌న‌లో టీడీపీ అనుకూల మీడియా వుంది.

జ‌న‌సేన మంత్రులు, ఎమ్మెల్యేల‌పై టీడీపీ నేత‌లెవ‌రూ మాట్లాడ‌కుండా, వాళ్ల మీడియా ప‌ని ప‌డుతుంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో జ‌న‌సేనానితో పాటు ఆ పార్టీ నాయ‌కుల‌కు ద‌బిడిద‌బిడే అంటున్నారు.

24 Replies to “ప‌వ‌న్ స‌హా జ‌న‌సేనపై టీడీపీ మీడియా నిఘా!”

  1. ఒకె వార్త కి ఎన్ని ఆర్టికల్స్ రా బాబు! ఈ వార్త నె పట్తుకొని, వార్త తొ పాటు

    నీ విశ్లెషణ,

    నీ అనుమానాలు,

    నీ కధలు,

    నీ కుట్ర సిద్ధాంతాలు,

    అని వదలకుండా ఇన్ని ఆర్టికల్స్ రాస్తున్నవ్ అంటె నువ్వు ఎంత కరువులొ ఉన్నరొ అర్ధం అవుతుంది!

    .

    వరదలొ కొట్టుపొతున్న వాడికి ఒక ఒ చిన్నపాటి కర్ర దొరికితె ఎంత ఆనంద పడతాడొ, కొట్టుకు పొతున్న Y.-.C.-.P కొసం నీ అల్పానందం కూడా అలానె ఉంది.

  2. ఒకె వార్త కి ఎన్ని ఆర్టికల్స్ రా బాబు! ఈ వార్త నె పట్తుకొని, వార్త తొ పాటు

    నీ విశ్లెషణ,

    నీ అనుమానాలు,

    నీ కధలు,

    నీ కుట్ర సిద్ధాంతాలు,

    అని వదలకుండా ఇన్ని ఆర్టికల్స్ రాస్తున్నవ్ అంటె నువ్వు ఎంత కరువులొ ఉన్నరొ అర్ధం అవుతుంది!

  3. ఎందుకో glk చాలామంది అస్సలు పేర్లతో కామెంట్ హీయారు…పాపం వాళ్ళ తండ్రేక్కడున్నాడో పట్టుకుని వీళ్ళ పేర్లు చెప్పించాలి..

  4. సీఎం పదవిని సగం PK కి ఇచ్చేయాలి. అప్పుడు సగం ఉప ముఖ్యమంత్రి పదవి PK బాబు గారికి ఇస్తాడు. కోస్తాంద్ర అంతా PK చూసుకుంటాడు. రాయలసీమ & ఇతర ప్రాంతాలు బాబు చూసుకుంటాడు. అప్పుడు చూద్దాం, ఎవరు బాగా పరిపాలన చేస్తారో 😜😂🤣

  5. పిచ్చి జిఎ వాళ్లు ఎలక్షన్స్‌లో కలిసిపోతారు గెలిచాక విడిపోతారు అని ఎ మాత్రం రాజకీయ జ్ఞానము ఉన్నా వల్లకి అర్థం అవుతుంది.. విడిపోయి మన నడ్డి విర్రగొడతారు..

    ఎందుకంటె ఏది చేసి అయినా మళ్ళీ మనల్ని రాజకీయం గా భూస్థాపితం చెయ్యడానికి ఎత్తులు.. నువ్వు మాత్రం సక్కలు గుడ్డుకుంటున్నావ్

Comments are closed.