టీడీపీ టార్గెట్‌ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయలు

టీడీపీ సోష‌ల్ మీడియా ధోర‌ణి విచిత్రంగా వుంది. త‌ట‌స్థుల‌పై కూడా వైసీపీ ముద్ర వేసి, సొంత వాళ్ల‌ను టీడీపీ సోష‌ల్ మీడియా టార్గెట్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

టీడీపీ సోష‌ల్ మీడియా ధోర‌ణి విచిత్రంగా వుంది. త‌ట‌స్థుల‌పై కూడా వైసీపీ ముద్ర వేసి, సొంత వాళ్ల‌ను టీడీపీ సోష‌ల్ మీడియా టార్గెట్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. మొద‌ట గౌరు శిరీష‌, మంత్రి పార్థ‌సార‌థి, ఆ త‌ర్వాత కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడుని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌ల్ని టీడీపీ సోష‌ల్ మీడియా టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు మంత్రి పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే, ల‌చ్చ‌న్న మ‌న‌వ‌రాలైన గౌతు శిరీష వెళ్లారు. అయితే మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత జోగి ర‌మేశ్‌తో క‌లిసి పాల్గొన‌డంపై టీడీపీ సోష‌ల్ మీడియా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ పోస్టులు పెట్టింది. జోగి ర‌మేశ్ కూడా గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. అందుకే గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్లారు. ఇవేవీ టీడీపీ సోష‌ల్ మీడియా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీని వెంట‌బెట్టుకునే దైవ ద‌ర్శ‌నానికి వెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌నాయుడు వెళ్ల‌డాన్ని త‌ప్పు పడుతూ టీడీపీ సోష‌ల్ మీడియా పెద్ద‌గానే ట్రోల్ చేసింది. ఇవ‌న్నీ మ‌రిచిపోక‌నే… తాజాగా లోక్‌స‌భ‌లో టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుపై కొంద‌రు టీడీపీ అధికార ప్ర‌తినిధులు, సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కార‌ణం ఏందో తెలుసుకుందాం.

ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ వ‌ద్ద‌కు అక్కినేని నాగార్జున కుటుంబ స‌భ్యులు, అలాగే యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్‌తో పాటు ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయలు వెళ్లారు. ఈ ఫొటోను టీడీపీ యాక్టివిస్టులే సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ తిట్ట‌డం గ‌మ‌నార్హం. సొంత పార్టీ ఎంపీ అనే క‌నీస గౌర‌వం కూడా లేకుండా ఒక మ‌హిళా అధికార ప్ర‌తినిధి లోఫ‌ర్ అని తిట్ట‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాని మోదీతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీని లావు క‌లిపించార‌నేది ఆరోప‌ణ‌. అలాగే వైసీపీ నుంచి వ‌చ్చిన లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుకు సీటు ఇచ్చి గెలిపించుకుని, ఫ్లోర్ లీడ‌ర్ ప‌ద‌వి ఇస్తే, ఇలాంటి దిక్కుమాలిన ప‌నులు చేస్తున్నాడంటూ విరుచుకుప‌డుతున్నారు.

11 Replies to “టీడీపీ టార్గెట్‌ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయలు”

  1. అంతే .. వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్ధం కోసం ఏమైనా చేస్తారు.. ఆఖరికి సొంతమనుషులును అయినా… పురాణాల్లో హిరణ్యకసుపుడి కంటే దారుణం.. అలా తయారు చేశారు వాళ్ళని..

  2. ఇప్పటికి 8 నెలలు అయింది

    రాష్ట్రంలో gst పడిపోయింది.. ఎందుకు.. ? ఎందకంటే సగం కారణం వ్యాపారాలు పడిపోయాయి… ఇంకో సగం చాలామంది gst కట్టడం లేదు.. ఎందుకంటే … ఎలక్షన్ ముందు రమేష్ అనే ఒక కిరాసానాయాలా వ్యాపారి ఎం చెప్పాడో గుర్తుకు వస్తే తెలుస్తాది.. నేను ఎంపీ అయితే… gst కట్టకపోయినా అధికారులు ఎం చెయ్యకుండా చేస్తా అన్నాడు.

    పోనీ, మేము అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతది అన్నారు.. తీరా చూస్తే అదే సగం వరుకు తగ్గిపోయింది.. .. ఎందుకు.. వీళ్ళు వచ్చాక కబ్జాలు పెరిగాయ్.. దాంతో జనాలు పూర్తిగా భయపడిపోయారు.. ఆంధ్ర లో ఎవరూ కొనడం లేదు.. దాంతో అందులో తగ్గిపోయాయి..

    లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది.. ఎందుకు.. ? ఎందుకంటే, ఇంతకుముందు, గవర్నమెంట్ డైరెక్ట్ గ అమ్మడం వలన, ఎక్కువ ఆదాయం వచ్చేది… ఇప్ప్పుడు అంతా టీడీపీ వాళ్ళే, ఇంకేముంది… మొత్తం..

  3. అంతే .. వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్ధం కోసం ఏమైనా చేస్తారు.. ఆఖరికి సొంతమనుషులును అయినా… పురాణాల్లో హిరణ్యకసుపుడి కంటే దారుణం.. అలా తయారు చేశారు వాళ్ళని..

  4. ఇంతకీ బాబోరు చెవిలో ఎవరైనా చెప్పారా.. ? సంపద సృష్టించడం ఎలానో.. పోనీ ఆ మూలాన ఉన్న ముసలమ్మని పిలవండి..

  5. అధికారంలో ఉన్నోళ్లకు ఎరవేసి అక్రమంగా ఆస్తులు ‘కొట్టేయ్యడం, వాటిని నిలబెట్టుకోవడానికి ఇంట్లో వాళ్ళను కూడా తార్చడం నాగ్యాడికి బటర్ తో పెట్టిన విద్య

  6. బాబోరు : ఆంధ్ర లో జగన్ ని, ఢిల్లీ లో కేజ్రీవాల్ ని ఓడించారు.. ఢిల్లీ , ఆంధ్ర లో స్కూల్స్ బాగు చేశారు.. అయినా జనాలు వోట్ వెయ్యలేదు..

    నేను : అందుకేనా. మీరు ఎంచక్కా స్కూల్స్ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు.. సో, అప్పుడు ఎంచక్కా జనాలు చదువు సంధ్య లేక మీ ఎనక గొర్రెల్లా తొరిగొచ్చు.. ఇక్కడ కొంచమందికి కామెంట్స్ పెట్టుకొని బ్రతికే జాబ్ ఇచ్చినట్టు ఇవ్వొచ్చు.. గొర్రెల్లా మార్చొచ్చు.. మళ్ళీ చదివేస్తే వాళ్ళు మనల్నే ప్రశ్నిస్తారు.. అందుకే వాళ్ళని మొగ్గలోనే ముంచాలి..

  7. నువ్వు తప్ప ఎవ్వరు టార్గెట్ చేయలేదు. వీసా రెడ్డి , 11 రెడ్డి (2 రెడ్డి ఇన్ 2029) ని ఎలా వదిలసాడో, మంగలి , నాగ్ …. ఇంకా చాలా మంది 11 రెడ్డి (2 రెడ్డ్ ఇన్ 2029) ని వదిలేసారు.

Comments are closed.