మూకుమ్మడిగా మరిచిపోయిన టాలెంట్

లైట్ బాయ్ నుంచి దర్శకుడి వరకు ప్రతి ఒక్కరికి పుష్ప-2 క్రెడిట్ ఇచ్చారు. కానీ మూకుమ్మడిగా అంతా కలిసి ఒక మంచి టాలెంట్ ను మరిచిపోయారు. అతడే సామ్ సీఎస్.

వందల మందికి మెమొంటోలు ఇచ్చారు. స్టేజ్ పై కౌగిలించుకున్నారు. పేర్లు మరిచిపోతామని పేపర్లపై రాసుకొచ్చారు. వందల థ్యాంక్సులు చెప్పారు. సామాన్య ప్రేక్షకుడికి అక్కర్లేని పేర్లను కూడా చదివి వినిపించారు. లైట్ బాయ్ నుంచి దర్శకుడి వరకు ప్రతి ఒక్కరికి పుష్ప-2 క్రెడిట్ ఇచ్చారు. కానీ మూకుమ్మడిగా అంతా కలిసి ఒక మంచి టాలెంట్ ను మరిచిపోయారు. అతడే సామ్ సీఎస్.

మరిచిపోయారా.. కావాలని పక్కనపెట్టారా అనేది ఇక్కడ అనవసరం. పుష్ప-2 థ్యాంక్స్ మీట్ లో సామ్ సీఎస్ పేరు వినిపించలేదు. “ఎవరి పేరైనా మరిచిపోతే క్షమించాలి”.. అంతా కామన్ గా ఈ డైలాగ్ మాత్రం చెప్పేశారు.

కానీ సామ్ సీఎస్ విషయంలో మాత్రం ఇది చెల్లదు. మరిచిపోయే పేరు కాదిది. మరిచిపోకూడని పేరు. పేపర్ పై కచ్చితంగా రాసుకొని స్టేజ్ పై చదివి వినిపించాల్సిన పేరు. మరోసారి పుష్ప-2 వాయిదా పడుతుందేమో అనే అనుమానాల మధ్య సినిమా రీ-రికార్డింగ్ సకాలంలో పూర్తయిందంటే దానికి కారణం సామ్ సీఎస్.

సినిమాలో కొన్ని ఎపిసోడ్స్, మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ అద్భుతంగా వచ్చిందంటే దాని వెనక తీసిపడేయలేని పేరు సామ్ సీఎస్. ఇలాంటి వ్యక్తిని యూనిట్ మరిచిపోయింది. హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ నుంచి నిర్మాతల వరకు అంతా మరిచిపోయారు ఈ టాలెంట్ ని.

అనుకోకుండా మరిచిపోయారు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ప్రతి ఒక్కరు మ్యూజిక్ గురించి మాట్లాడారు. దేవిశ్రీ ప్రసాద్ ను ఆకాశానికెత్తేశారు. నిజమే, దేవీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే, తప్పే లేదు. కానీ దేవిశ్రీ గురించి మాట్లాడే ఆ టైమ్ లో సామ్ సీఎస్ కూడా గుర్తుకురావాలి కదా. సినిమాను ఆఖరి నిమిషంలో గట్టెక్కించిన ఇతడ్ని మరిచిపోతే ఎలా?

సామ్ సీఎస్ అతడికి ఒక్క థ్యాంక్స్ చెబితే ఏమౌతుంది? దేవిశ్రీ చిన్నబుచ్చుకుంటాడా? లేక సుకుమార్ హర్ట్ అవుతాడా? నిజంగా పుష్ప-2 నుంచి అతడికి రావాల్సిన గుర్తింపు రాలేదు. కొన్ని ఇంటర్వ్యూల్లో తనకుతాను క్లెయిమ్ చేసుకున్నప్పటికీ పుష్ప-2 యూనిట్ మాత్రం ఎక్కడా అతడికి ఆ క్రెడిట్ ఇవ్వలేదు.

రాత్రి పుష్ప-2 థ్యాంక్స్ మీట్ ను ఆసాంతం చూసుంటాడు సామ్. తన పేరు వస్తుందేమో.. ఎవరైనా తన పేరును ప్రస్తావిస్తారేమో.. ఎవరైనా తన టాలెంట్ ను గుర్తిస్తారేమో అని అన్ని పనులు మానుకొని, కళ్లు కాయలుకాచేలా యూట్యూబ్ కు అతుక్కుపోయి ఉంటాడు. ఫంక్షన్ ముగిసిన తర్వాత అతడు ఎంత బాధపడి ఉంటాడో ఆ దేవుడికే తెలియాలి.

10 Replies to “మూకుమ్మడిగా మరిచిపోయిన టాలెంట్”

  1. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  2. జగన్ సిఎం అవ్వడం కోసం, ఎండల్లో తిరిగి ప్రచారం చేసిన సొంత చెల్లి షర్మిల కి ఏమన్నా క్రెడిట్ ఇచ్చాడా జగన్ రెడ్డి అనే అతను. ఇదీ యిలాగే.

    1. Rajakeeya punarjanma prasaadinchina NTR ne pakkanapetti party balavanthamgaa lakkonna droham Kannaa ido lekkaa ?

      ippudu, puthra vaathsalyam tho pappu gaadiki Varasathvamgaa paggaalu ichenduku mana babu gaaru itharulaki chesthunna drohamtho choosthe idolekkaa brother

Comments are closed.