ఉగాదికి స్ప‌ష్ట‌త ఇవ్వకుంటే.. బాబు ఇంటి ముట్ట‌డి!

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వాలంటీర్లు చాలా ప‌ట్టుద‌ల‌తో ఉద్య‌మిస్తున్నారు.

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వాలంటీర్లు చాలా ప‌ట్టుద‌ల‌తో ఉద్య‌మిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ‌కు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల్సిందే అని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ‌లో వాలంటీర్ల మ‌హిళా నాయ‌కురాళ్లు మీడియాతో మాట్లాడుతూ గ‌త ఏడాది ఉగాది ప‌ర్వ‌దినాన‌… చంద్ర‌బాబునాయుడు త‌మ గౌర‌వ వేత‌నాన్ని రూ.5 వేల నుంచి రెట్టింపు చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఇప్పుడు వాలంటీర్ల వ్య‌వ‌స్థ కొన‌సాగింపుపై చంద్ర‌బాబు ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

మ‌రో రెండు వారాల్లో ఉగాదిని జ‌రుపుకోనున్నామ‌ని, ఈ లోపు సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఒక‌వేళ చంద్ర‌బాబు స్పందించ‌క‌పోతే ఆయ‌న ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని వారు హెచ్చ‌రించారు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి బాలవీరాంజ‌నేయుల‌పై కూడా వాలంటీర్లు ధ్వ‌జ‌మెత్తారు.

మ‌హిళ‌లంటే ఎంతో గౌర‌వ‌మ‌ని ప‌వ‌న్ గొప్ప‌లు చెబుతుంటార‌ని, ఆచ‌ర‌ణ‌లో ఎక్క‌డ‌? అని వారు ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బాల‌వీరాంజ‌నేయులు వాలంటీర్ల వ్య‌వ‌స్థను కొన‌సాగించ‌క‌పోవ‌డానికి సాకులు వెతుకుతున్నార‌ని మండిప‌డ్డారు. క‌రోనా స‌మ‌యంలో కేవ‌లం వాలంటీర్లే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి, ప్రాణాల్ని సైతం లెక్క చేయ‌కుండా సేవ‌లందించార‌ని గుర్తు చేశారు.

కూట‌మి నేత‌లు మాట త‌ప్ప‌డం మంచిది కాద‌న్నారు. 2.60 ల‌క్ష‌ల కుటుంబాల్ని రోడ్డున ప‌డేశార‌ని ఆరోపించారు.

14 Replies to “ఉగాదికి స్ప‌ష్ట‌త ఇవ్వకుంటే.. బాబు ఇంటి ముట్ట‌డి!”

  1. ఏ సినీమాలోనిదో గుర్తులేదు…నీ ఆశ ఆడియాస..నీ దారే ?పూస..బతుకంతా యమ భాధ….లంబాDT రాందాస..

  2. లవడా లో కరోన అన్ని రాష్ట్రాల్లో , దేశాల్లో వచ్చింది రా ఆంధ్ర లో ఏమైనా వలింటర్లు ఏమైనా చావులు ఆపగలిగారా.. అన్ని రాష్ట్రాల్లో మాదిరే చచ్చారు

  3. ఆంధ్రలో కానీ, పక్కన తెలంగాణాలో కానీ ఐదు వేలు వచ్చే జాబ్స్ లేవా? దీని కోసం ఇంత ఉద్యమాలు ఎందుకు? electricians, plumberlu, మెషిన్ కుట్టే వాళ్ళు ఇంత కంటే చాలా ఎక్కువ సంపాదిస్తారు.

Comments are closed.