విశాఖ అంటే అందరికీ లవ్. అవును విశాఖ ఎవరికైనా డార్లింగ్. విశాఖ బ్యూటీ ఆఫ్ డెస్టినీ అని గొప్పగా చెప్పుకుంటారు ప్రకృతి ప్రేమికులు. ఇదిలా ఉంటే విశాఖని సినీ రాజధానిగా చేయాలని ప్రస్తుత జగన్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.
విశాఖకు అన్ని విధాలుగా హంగులు సమకూర్చాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖను మరవద్దు, వదలొద్దు అంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. అవును ఆయన పర్యాటక మంత్రి, పైగా విశాఖ జిల్లా ప్రతినిధి. తాజాగా విశాఖ జిల్లా భీమిలీలో చత్రపతి హిందీ రీమేక్ షూటింగ్ జరుగుతోంది. దీనికి వీవీ వినాయక్ దర్శకుడు.
లోకేషన్ కి వెళ్ళిన మంత్రి అక్కడ చిత్ర యూనిట్ తో ముచ్చట్లు పెడుతూ విశాఖలో మరిన్ని షూటింగులు చేయండి మిత్రమా అని ప్రేమగా కోరారు. అంతే కాదు, షూటింగులకు అన్ని విధాలుగా విశాఖ జిల్లా అనుకూలమని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
విశాఖలో ప్రకృతి రమణీయతతో పాటు, టూరిజం పరంగా కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయని అవంతి వెల్లడించారు. మొత్తానికి టాలీవుడ్ ఏపీకి షిఫ్ట్ అవాలని ప్రభుత్వం చాలా కాలంగా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపధ్యంలో మంత్రి అవంతి సినిమా షూటింగులు విశాఖలో జరగాలని కోరుకుంటూ సినీ ప్రముఖులకు ఆహ్వానం పలుకుతున్నారు. మరి మంత్రి మాట మన్నిస్తారా. చూడాలి.