సింహాద్రి అప్పన్న మా ఇలవేలుపు…

నందమూరి బాలక్రిష్ణకు భక్తిఎక్కువ. అంతే కాదు, ఆయన ఎక్కువగా నారసింహస్వామిని అర్చిస్తారు. అది ఆయన స్వయంగా చెప్పుకున్నారు.ఇక ఆయన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వాటిని చూసుకుంటే సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ…

నందమూరి బాలక్రిష్ణకు భక్తిఎక్కువ. అంతే కాదు, ఆయన ఎక్కువగా నారసింహస్వామిని అర్చిస్తారు. అది ఆయన స్వయంగా చెప్పుకున్నారు.ఇక ఆయన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వాటిని చూసుకుంటే సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా ఇలా కనిపిస్తాయి. 

ఇక బాలయ్య తన సినిమా హిట్అయితే విశాఖ వచ్చి సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకోవడం అనవాయితీగా పెట్టుకున్నారు.ఇక అఖండ హిట్ అయిన నేపధ్యంలో ఆయన సింహాచలేశుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా సింహాద్రి అప్పన్న తన ఇల వేలుపు అని బాలయ్య చెప్పారు. 

స్వామి వారి కటాక్షంతోనేమీకు విజయాలు దక్కుతున్నాయని అర్చక స్వాములు సైతం బాలయ్యను దీవించారు. ఇదిలా ఉంటే బాలయ్యదారిలో కూడా మరికొన్ని ఆలయాలను దర్శించి తన భక్తిని చాటుకున్నారు. విశాఖలో బాలయ్య అఖండసక్సెస్ మీట్ కంటే ముందు ఇలా ఆలయాలకు వెళ్ళి మొక్కులు తీర్చుకున్నారు. 

మొత్తానికి బాలయ్య ఆధ్యాత్మికపర్యటన ఆయన అభిమానులను హుషార్ కలిగించింది. ఇక తెలుగుదేశం నాయకులు కూడా ఆయన వెంట కదిలివచ్చారు. మొత్తానికి అఖండ హిట్ తో ఆయన టీడీపీ క్యాడర్ కి కొత్త జోష్ తెచ్చారనే తమ్ముళ్ళసంతోషం చూస్తే అర్ధమవుతుంది.