మ‌ళ్లీ తెర‌పైకి ఇ-పాస్‌

క‌రోనా సెకెండ్ వేవ్ అన్ని ర‌కాల ఇబ్బందుల‌ను తీసుకొస్తోంది. గ‌త ఏడాదిని మ‌రిపిస్తోంది. ఇక మీద‌ట ప్ర‌యాణం చేయాలంటే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని డీజీపీ స‌వాంగ్ స్ప‌ష్టం చేశారు.  Advertisement ఏపీలో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే…

క‌రోనా సెకెండ్ వేవ్ అన్ని ర‌కాల ఇబ్బందుల‌ను తీసుకొస్తోంది. గ‌త ఏడాదిని మ‌రిపిస్తోంది. ఇక మీద‌ట ప్ర‌యాణం చేయాలంటే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ‌ని డీజీపీ స‌వాంగ్ స్ప‌ష్టం చేశారు. 

ఏపీలో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే వాహ‌నాలు జప్తు చేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో రేప‌టి నుంచి రాష్ట్రంలో ప్ర‌యాణానికి కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

‘అత్యవసర ప్రయాణికుల కోసం రేపట్నుంచి ఇ-పాస్‌ విధానం అమలు చేయనున్నాం. ఇ-పాస్‌ పోలీస్‌ సేవ అప్లికేషన్‌ సౌకర్యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. త‌దుప‌రి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదు. 

శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉల్లంఘనలపై డయల్‌ 100, 112నెంబర్లకు సమాచారం అందించాలి’  అని డీజీపీ అన్నారు.

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతిని అదుపు చేసేందుకు ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్ర‌తి రోజూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు 6 గంట‌ల వ‌ర‌కూ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

కేవ‌లం ప్ర‌తి రోజూ ఆరు గంట‌లు మాత్రం …అది కూడా ఉద‌యం 6 నుంచి మ‌ధ్నాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వ్యాపార స‌ముదాయాలు, ఇత‌ర‌త్రా కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ కర్ఫ్యూ 18వ తేదీ వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోనుంది.