అల్లుడుగారూ..మీరెక్కడ?

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపిఎల్ షెడ్యూలు వచ్చింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క మ్యాచ్ లేదు. హైదరాబాద్ లో మాంచి గ్రౌండ్ వుంది. కానీ నో మ్యాచ్. విశాఖలో మాంచి గ్రౌండ్…

క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపిఎల్ షెడ్యూలు వచ్చింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క మ్యాచ్ లేదు. హైదరాబాద్ లో మాంచి గ్రౌండ్ వుంది. కానీ నో మ్యాచ్. విశాఖలో మాంచి గ్రౌండ్ వుంది. కానీ నో మ్యాచ్. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన నిరసన వ్యక్తం అవుతోంది. 

బహుశా ఈ పరిస్థితి ముందుగా ఊహించి ఏమో హైదరాబాద్ కు ఓ మ్యాచ్ అయినా ఇవ్వాలని మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికపై కోరారు. కానీ చిత్రంగా ఆంధ్ర నుంచి అలాంటి డిమాండ్ ఏదీ వినిపించలేదు. 

విశాఖ క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అకాడమీ తరపున ఓ ప్రకటన కూడా రాలేదు.  వైకాపా కీలక నేత విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్ర రెడ్డి నే ఆంధ్ర క్రికెట్ బోర్డు అసోసియేషన్ అధ్యక్షుడు. ఆయన కానీ ఆయన అసోసియేషన్ కానీ ఓ స్టేట్ మెంట్ ఇచ్చిన జాడ లేదు.

నిజానికి ఆంధ్రకు ఓ టీమ్ లేకపోవచ్చు. కానీ ఎన్నోసార్లు విశాఖలో ఎన్నో మ్యాచ్ లు జరిగాయి. అలాంటి విశాఖను ప్రొజెక్ట్ చేసి ఓ మ్యాచ్ సాధించడం లో అసోసియేషన్ కీలక బాధ్యులు విఫలమయ్యారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

మన మీడియా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా, సోషల్ మీడియా మాత్రం దుమ్ములేపుతోంది. 

''..అహ్మదాబాద్ నుండి ఏదయినా  టీమ్ ఉందా ?''

'' ఏదయినా టీమ్ అహ్మదాబాద్ ని సొంత గ్రౌండ్ గా సెలెక్ట్ చేసుకుందా ?''

'' గుజరాత్ లో ఏమైనా కరోన తక్కువ ఉందా ?''

'' పంజాబ్ లో రైతులు ఉద్యమం చేస్తున్నారు కాబట్టే మొహాలీ గ్రౌండ్ తీసేసారా ?''

'' హైదరాబాద్, వైజాగ్ చేసిన పాపం ఏంటి ?''

'' తెలుగు ప్రజలకు IPL చూసే భాగ్యం లేదా ?''

'' కరోన వలనే హైదరాబాద్ నుండి IPL షిఫ్ట్ చేశారు అనుకుందాం .మరి ముంబై లో కరోనా లేదా ?''

'' తెలుగు రాష్ట్రల మీద ఈ వివక్ష దేనికి ?''

అహ్మదాబాద్ తప్పితే ఇక  ఫైనల్ హోస్ట్ చేసే స్టేడియం ఇండియాలో లేదా ??

ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కానీ వీటికి సమాధానం చెప్పేవారు లేరు, నిలదీసేవారు లేరు.

దమ్ముంటే మోదీని ప్రశ్నించు.

లోకేష్ పార్టీని నడపగలుగుతారా?