Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబుకు ఎందుకు కాల్ చేయాలి?

బాబుకు ఎందుకు కాల్ చేయాలి?

మనిషి అన్నాక సిగ్గు శరం వుండాలి అని పెద్ద అంటూ వుండారు. కానీ ఆ రెండూ వదిలేస్తేనే రాజకీయ నాయకులుగా మనగలరు అని సెటైర్లు కూడా వినిపిస్తుంటాయి. తెలుగుదేశం నాయకులు., ఆ పార్టీ అనుకూల వెబ్, ప్రింట్ మీడియా లు చేస్తున్న గోల చూస్తుంటే ఇది నిజమేమో అనిపిస్తోంది. 

మోడీ దేశంలో కాస్త ప్రముఖ లేదా నోటెడ్ రాజకీయ నాయకుడు అన్న ప్రతి వారికీ కాల్ చేసి, కరోనా వైరస్ కల్లోలం మీద మాట్లాడారు. కానీ చంద్రబాబుకు మాత్రం కాల్ చేయలేదు. ఇదే ఇప్పుడు తెలుగుదేశం బాధ. తెలుగుదేశం బాధ అంటే దాన్ని భుజాన మోసే మీడియా బాధ. అంతవాడు ఇంతవాడు, క్రైసిస్ మేనేజ్ మెంట్ కే కింగు, అలాంటి వాడిని పిలవకపోవడం ఏమిటి? అన్నది వీళ్ల క్వశ్చను. రాజకీయాలకు అతీతంగా కరోనా మీద పోరాడడం అంటే ఇదేనా అని మరో క్వశ్చను.

అసలు చంద్రబాబును ఎందుకు సంప్రదించాలి? ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి. పావలా పని చేసి, పదిరూపాయల మేరకు ఎలా టముకు వేసుకోవాలి? అన్నది తెలుసుకోవడం కోసమా? ఎలా పబ్లిసిటీ తెచ్చుకోవాలో మోడీకి బాగా తెలుసు. ఆ విషయంలో ఆయన బాబుగారి కన్నా నాలుగు ఆకులు ఎక్కువే తిన్నారు.

అసలు బాబుగారిని మోడీ ఎందుకు పట్టించుకోవాలి?

మొదట్లో భాజపా అండగా నిలిస్తే, అవసరం తీరిపోయాక, మోడీని అరెస్ట్ చేస్తా అని హుంకరించారు. ఆ తరువాత భాజపాతో పొత్తు క్షమించరాని తప్పిందం అని లెంపలు వేసుకున్నారు.

మళ్లీ అవసరం అయ్యాక, ఢిల్లీ వెళ్లి, బతిమాలో, బామాలో, మొత్తం మీద మళ్లీ పొత్తు, దాంతో అధికారం సాధించారు. తీరా మళ్లీ తేడా గా వుంది వ్యవహారం అని అనుమానించి, మోడీ  మీద సమరభేరి మోగించారు. దేశంలో వున్న అందరు ప్రతిపక్ష నాయకుల కన్నా తానే సూపర్ హీరో అనే రేంజ్ లో ఎన్నికల టైమ్ లో దేశం అంతా తిరిగేసి, మోడీకి చెమటలు పట్టించేసామన్నంత కలరింగ్ ఇచ్చారు. ఆ టైమ్ లో ఆయన అనుకుల పత్రికల్లో మోడీ వ్యతిరేక కథనాలు ఇన్నీ అన్నీ కావు. గట్టిగా ఏడాది కాలేదు. పత్రికలు తిరగేస్తే అన్నీ కనిపిస్తాయి.

ఎన్నికల్లో ఓడిపోయాక, మళ్లీ మోడీకి దగ్గరవదుమాని చేయని ప్రయత్నం లేదు. మోడీజీ..మోడీజీ అంటూ కలవరించడం, తన పార్టీ జనాల్ని దొడ్డి దోవలో భాజపాలోకి పంపడం అందరూ గమనిస్తున్నదే. 

కానీ బాబుగారికి తెలియంది ఏమిటంటే, రాజకీయంగా మోడీ అందరినీ ఓ కంట కనిపెడుతూనే వున్నారు. బాబుగారేమిటొ, అవసరం తీరిపోయాక ఆయన ఎలా ప్రవర్తిస్తారో ఆయనకు రెండు సార్లు క్లియర్ గా బోధపడింది. ఓసారి మోసపోవచ్చు. రెండోసారి మోసపోవచ్చు. కానీ మోడీ కదా మూడోసారి మోసపోవడానికి సిద్దంగా లేరు. అందుకే పిలవలేదు బాబుగారిని అనుకోవాలి.

ఏమైనా మోడీ నుంచి బాబుగారికి పిలుపు రాకపోవడం, ఎప్పటికైనా తెలుగుదేశం-భాజపా ఒకటి అవుతాయి అని ఆశగా చూస్తున్న తెలుగుతమ్ముళ్లకు నిరాశనే మిగిల్చింది.

పారిశుధ్య కార్మికురాలి కాళ్ళు క‌డిగిన వైసీపీ ఎమ్మెల్యే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?