ఉంటే ఉండండి. పోతే పొండి.. పవన్ ఫ్రస్ట్రేషన్

పవన్ కల్యాణ్ రెస్ట్ లో ఉన్నారు. తనకెంతో ఇష్టమైన ట్విట్టర్ లో కూడా ఆయన కనిపించడంలేదు. మరోవైపు 99టీవీని కూడా అమ్మేయడం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో పవన్ ని నమ్ముకుని, జనసేనకోసం కెరీర్ ని…

పవన్ కల్యాణ్ రెస్ట్ లో ఉన్నారు. తనకెంతో ఇష్టమైన ట్విట్టర్ లో కూడా ఆయన కనిపించడంలేదు. మరోవైపు 99టీవీని కూడా అమ్మేయడం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో పవన్ ని నమ్ముకుని, జనసేనకోసం కెరీర్ ని త్యాగంచేసి పార్టీలోకి వచ్చిన చాలామంది, జనసేన సీనియర్ నేతల దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. పార్టీలో ఉండాలా వద్దా, అసలు పవన్ తమకు ఏమైనా సలహా ఇస్తారా.. భవిష్యత్ గురించి భరోసా ఇస్తారా అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ముఖ్యంగా గాజువాక, భీమవరం నేతలు తెగ ఇదైపోతున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేయాలని ఓ అరడజను మంది ఆశపడ్డారు. చివర్లో పవన్ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. పవన్ కోసం తప్పుకున్న వారంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అని నిలదీస్తున్నారు. పవన్ చెప్పకపోయినా పార్టీకోసం శక్తికి మించి డబ్బులు ఖర్చు చేశామని, పవన్ ఎమ్మెల్యే అయిన తర్వాత అంతా సర్దుకుంటుందని భావించామని, ఇప్పుడిలా తేడాకొడితే మాకు దిక్కెవరని వాపోతున్నారు. వీరి ప్రశ్నలకు సీనియర్లు కూడా తల పట్టుకుని కూర్చున్నారు.

అయితే పవన్ దగ్గర జరిగిన ఓ డిస్కషన్ చాలా హాట్ హాట్ గా సాగిందని సమాచారం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటూ కొంతమంది సీనియర్లు పవన్ దగ్గర చర్చ పెట్టారు. కిందిస్థాయి నేతల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతోందని కూడా వారు పవన్ కి చెప్పాలని చూశారు. అయితే ఆయన మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. కనీసం తాను పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోవడాన్ని పవన్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్టీ అధ్యక్షుడిని కూడా గెలిపించుకోలేని క్యాడర్, ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టుగా మాట్లాడారట పవన్. ఉంటే పార్టీలో ఉండండి, లేకపోతే పొండి అని ఖరఖండిగా చెప్పేశారని సమాచారం. పాతికేళ్ల ప్రస్థానం అంటూ చెప్పిన పవన్ లో అప్పుడే ఫ్రస్టేషన్ మొదలైంది. అందకే ఆయన అందరికీ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. 

తండ్రీ కొడుకులు సాకులు వెతుకుతున్నారు