Advertisement

Advertisement


Home > Politics - Gossip

టీడీపీలో తొలి వికెట్ అతడిదేనా..?

టీడీపీలో తొలి వికెట్ అతడిదేనా..?

తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిజానిజాలు వెలికితీసే పనిలో ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే కాంట్రాక్ట్ పనులపై అధికారులు సమీక్షలు ప్రారంభించారు. ఇక అమరావతి భూముల కుంభకోణం మరోఎత్తు. అసలు సీఆర్డీఏ పేరుతో టీడీపీ గవర్నమెంట్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. భూసమీకరణ దగ్గరనుంచి, ఇటుకల పేరుతో తీసుకున్న విరాళాలు, ఉద్యోగులనుంచి ఒకరోజు జీతం పేరుతో వసూలు చేసిన సొమ్ము.. ఇలా చాలావాటికి లెక్కలు తేలాల్సి ఉంది. ఇవన్నీ తేలితో టీడీపీ హయాంలో పడే తొలి వికెట్ మాజీమంత్రి నారాయణదేనని తేలుతోంది.

సీఆర్డీఏ పేరుతో జరిగిన అక్రమాలన్నీ అప్పటి మున్సిపల్ శాఖా మంత్రిగా వ్యవహరించిన నారాయణ పేరుమీదుగానే జరిగాయి. చంద్రబాబు తనచేతికి మట్టి అంటకుండా అన్నీ నారాయణని అడ్డుపెట్టుకునే చేశారు. సీఆర్డీఏకి సంబంధించి అధికారుల నియామకాలు, బదిలీలు అన్నీ మున్సిపల్ శాఖే చూసుకునేది. విదేశీ పర్యటనలకైనా, అధికారులతో సమీక్షలకైనా చంద్రబాబుతోపాటు నారాయణ కచ్చితంగా హాజరయ్యేవారు.

చంద్రబాబు పాపంలో నారాయణకు కూడా మంచి వాటానే దక్కింది అనుకోండి. తీరా డొంక కదిలే సమయానికి చంద్రబాబు తనకేం సంబంధం లేదు, అంతా నారాయణదేనంటున్నారట. రేపు సీఆర్డీఏపై సీఎం జగన్ విచారణకు ఆదేశిస్తే.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మాజీమంత్రి నారాయణదే. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన నారాయణకు ఇప్పుడు అమరావతి అక్రమాలు మెడకు చుట్టుకోబోతున్నాయి.

అధికారం చేతిలోలేదు కాబట్టి.. తన విద్యాసంస్థలను కాపాడుకోవడానికి అయినా నారాయణ జగన్ కు సరెండర్ కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు అమరావతి పేరుతో మరో సమస్య వచ్చింది. దీంతో జగన్ తో సంధి చేసుకోడానికి నారాయణ ఎదురు చూస్తున్నారని టాక్. ఇలాంటి వాటికి జగన్ మెత్తబడే రకం కాదని అందరికీ తెలుసు.

మరి అక్రమాల విచారణ మొదలైతే.. నారాయణ పరిస్థితి ఏంటో..? టీడీపీలో బలి అయ్యే తొలి వికెట్ నారాయణదే అని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. 

తండ్రీ కొడుకులు సాకులు వెతుకుతున్నారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?