ఒకే రోజు 5వేలకు పైగా కేసులు.. ఇదే అత్యథికం

భారత్ లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో ఏ రోజుకారోజు రికార్డుల్ని క్రాస్ చేస్తూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలో ఒకే రోజు 5242 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు…

భారత్ లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో ఏ రోజుకారోజు రికార్డుల్ని క్రాస్ చేస్తూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలో ఒకే రోజు 5242 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇదే అత్యథికం. ఓవైపు లాక్ డౌన్ -4 లో మరిన్ని మినహాయింపులు ఇచ్చిన వేళ.. ఇలా ఒకేసారి కేసులు విజృంభించడంతో అందర్లో ఆందోళన ఎక్కువైంది. మరిన్ని సడలింపులతో రాబోయే రోజుల్లో కేసులు మరిన్ని పెరగొచ్చని టెన్షన్ పడుతున్నారు ప్రజలు.

ఈరోజు ఉదయం 8 గంటల నాటికి దేశవ్యాప్తంగా 96,169 కరోనా కేసులు నమోదయ్యాయి. రేపటికి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా 157 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3వేలు నంబర్ దాటి 3029గా నమోదైంది..

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 2347 కేసులు నమోదయ్యాయి. అంటే నిన్న నమోదైన మొత్తం కేసుల్లో సగానికి సగం కేసులు మహారాష్ట్రవే అన్నమాట. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33వేలకు చేరుకుంది. అటు మహారాష్ట్రలో మృతుల సంఖ్య 1198కు చేరుకుంది.

మహారాష్ట్ర తర్వాత గుజరాత్ 11,379 కేసులతో రెండో స్థానంలో, 11,224 కేసులతో తమిళనాడు మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేసుల సంఖ్య 10.054గా ఉంది. గడిచిన 23 గంటల్లో ఢిల్లీలో 721 కేసులు, తమిళనాడులో 639 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో ఇవాళ్టి నుంచి ప్రజారవాణాకు అనుమతిచ్చారు. ప్రభుత్వ రంగ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలు, కార్లకు కూడా కొన్ని కండిషన్స్ తో అనుమతులు ఇచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని కరోనా కేసులు పెరిగా ప్రమాదముందని భావిస్తున్నారు.

మత్తులో మత్తు డాక్టర్/నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అసలు రూపం