దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖంలోనే కొనసాగుతూ ఉంది. గత వారం రోజుల్లో కరోనా కేసులు స్టడీగా వస్తున్నా… కరోనా కారణ మరణాల సంఖ్య మాత్రం బాగా తగ్గింది. ఈ సంఖ్య చాలా రోజుల తర్వాత అత్యంత తక్కువ స్థాయికి వచ్చిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇది దాదాపు నాలుగు నెలల క్షీణత స్థాయి అని తెలుస్తోంది.
నాలుగు నెలల కిందట ఎంత తక్కువ స్థాయిలో కరోనా కారణ మరణాలు నమోదయ్యాయో, ఇప్పుడు అంత తక్కువ స్థాయికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ ప్రభావం మరణాల సంఖ్య విషయంలోనూ కనిపిస్తూ ఉంది.
ఇలా దేశంలో కరోనా ప్రభావం దాదాపు క్షీణ దశలో ఉంది. కేసులు, సంఖ్య ఇతర నంబర్లన్నీ.. ఆల్మోస్ట్ లో లెవల్ లో నమోదవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే కేరళలో మాత్రం కేసులు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కేరళలో వచ్చిన కేసుల సంఖ్య రెండు లక్షలకు పైనే! ఒక్క వారం రోజుల్లో రెండు లక్షల కేసులకు పైగా రావడం కేరళలో రికార్డుగా నమోదవుతోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కాలేదట. ఇది అక్కడ పీక్ స్టేజ్ గా నిలుస్తోంది.
దేశమంతా కరోనా కేసులు దాదాపు తగ్గుముఖం పట్టినా, క్షీణ స్థాయిలో స్టడీగా కొనసాగుతున్నా, కేరళలో మాత్రం పాత రికార్డులు బద్ధలవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండు లక్షల నమోదుతో అక్కడ కరోనా పతాక స్థాయికి చేరింది. మూడో వేవ్ కు కేరళల హాట్ స్పాట్ అవుతోందా? అనే సందేహాలు నెలకొన్నాయి.
అయితే దేశమంతా సెకెండ్ వేవ్ ప్రబలినప్పుడు కేరళలో కేసులు ఎక్కువగా రాలేదని, ఇప్పుడే అక్కడ సెకెండ్ వేవ్ నడుస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. ఇటీవల పండగల నేపథ్యంలో కేరళలో ఆంక్షల సడలింపు ఎక్కువైంది. షాపింగులు చేసుకోవచ్చని, పండగలు హ్యాపీగా జరుపుకోవాలని కేరళ ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. బక్రీద్ కూ, ఓనం పండగకూ మినహాయింపులు సాగాయి. అప్పటి నుంచి కేరళలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి.