మళ్లీ కోవిడ్ విజృంభణ!

దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. కొత్త‌గా 1805 మంది క‌రోనా భారిన ప‌డగా.. మ‌రో ఆరుగురు వైర‌స్ కార‌ణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మ‌రోవైపు యాక్టివ్ కేసుల…

దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. కొత్త‌గా 1805 మంది క‌రోనా భారిన ప‌డగా.. మ‌రో ఆరుగురు వైర‌స్ కార‌ణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మ‌రోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఆందోళ‌న‌క‌ర స్థాయికి చేరింది. తాజాగా యాక్టివ్ కేసులు 10వేలు(10,300) దాటాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని చెబుతున్నారు.

వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో నేడు కేంద్రం రాష్ట్రాల ఆరోగ్య కార్య‌ద‌ర్శుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్రాలకు సూచ‌న‌లు ఇవ్వ‌నుంది. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. 

ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌తో పాటు మందులు, ఐసీయూ సదుపాయాలు, పడకలు, వైద్య పరికరాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత వంటి వివరాలపై అన్ని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య కేంద్రాలు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొనాలంటూ కేంద్రం, ఐసీఎంఆర్‌ ఉమ్మడిగా అదేశాలు జారీ చేశాయి.