దేశమంతా ఢిల్లీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. మరికొన్ని నిమిషాల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ నెల 5న అన్ని స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరిగాయి. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఎక్కువ సర్వే సంస్థలు బీజేపీ వైపే మొగ్గు చూపాయి.
అయితే మరోసారి ఢిల్లీ పీఠాన్ని తామే దక్కించుకుంటామని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ పట్టుదలతో వుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇవాళ 8 గంటలకు కౌంటి్ంగ్ మొదలు పెడతారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
దీంతో దేశ వ్యాప్తంగా ఢిల్లీలో ఎలాంటి తీర్పు వస్తుందో అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో సర్వే సంస్థలు ఇండియా కూటమి వైపు ఎక్కువగా మొగ్గు చూపాయి. చివరికి బీజేపీ నేతృత్వంలోని కూటమికి విజయం దక్కిన సంగతి తెలిసిందే. అందుకే ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ ఏమైనప్పటికీ, ఎగ్జాట్ పోల్స్ ఎలా వుంటాయనే ఉత్కంఠ. మరీ ముఖ్యంగా బీజేపీకి కేజ్రీవాల్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు.
దేశ రాజధాని కేంద్రంగా తమకు వ్యతిరేక గళాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవడాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్‌లో కూడా సీట్లు రావని అంటున్నారు. తినబోతు రుచి చూడడం ఎందుకు? కాసేపట్లో అన్నీ తెలిసిపోనున్నాయి.
ప్లే బాయ్ వర్క్ >> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది