స‌ప్త స‌ముద్రాల ఆవ‌త‌లున్నా మ‌ట్టి క‌రిపిస్తాం

ఈ ఉగ్ర‌దాడి కేవ‌లం ప‌ర్యాట‌కులపై మాత్ర‌మే కాద‌ని, భార‌తీయ ఆత్మ‌పై అని ఆయ‌న అవేద‌న‌తో చెప్పుకొచ్చారు.

జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో ప‌ర్యాట‌కుల ఉసురు తీసిన ఉగ్ర‌దాడుల‌పై యావ‌త్ భార‌త్ ర‌గిలిపోతోంది. అమాయ‌కుల ప్రాణాల్ని బ‌లిగొన్న ఉగ్ర‌వాదుల అంతు చూడాల‌ని భార‌తీయులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఉగ్ర‌వాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల‌కు ఆత్మ‌శాంతి క‌ల‌గాల‌ని ఆకాంక్షిస్తూ దేశ వ్యాప్తంగా కుల‌మ‌తాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా శాంతియుత ర్యాలీలు, కొవ్వొత్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు, చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌ధాని మోదీ ఉగ్ర‌వాదుల‌పై విరుచుకుప‌డ్డారు. స‌ప్త స‌ముద్రాల ఆవ‌త‌ల ఉన్నా ఉగ్ర‌వాదుల్ని మ‌ట్టి క‌రిపిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జాతీయ పంచాయ‌తీరాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా బీహార్‌లోని మ‌ధుబ‌ని న‌గ‌రంలో ప‌లు అభివృద్ధి ప‌నుల్ని ప్ర‌ధాని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌దాడుల‌పై మోదీ మొద‌టిసారిగా తీవ్రంగా స్పందించారు. 140 కోట్ల భార‌తీయుల సంక‌ల్పం ఉగ్ర‌వాదుల్నే కాదు, వారిని పెంచి పోషిస్తున్న ఉగ్ర‌నాయ‌కుల వెన్ను విరుస్తుంద‌ని మోదీ హెచ్చ‌రించారు. ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదుల దాడిలో అమాయ‌కులు చ‌నిపోయార‌ని మోదీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని దేశ ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఉగ్ర‌వాదుల్ని మ‌ట్టిలో క‌లిపే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న అన్నారు. ఉగ్ర‌వాదుల‌కి త‌గిన గుణ‌పాఠం చెబుతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ ఉగ్ర‌దాడి కేవ‌లం ప‌ర్యాట‌కులపై మాత్ర‌మే కాద‌ని, భార‌తీయ ఆత్మ‌పై అని ఆయ‌న అవేద‌న‌తో చెప్పుకొచ్చారు. దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల‌కు, వాళ్ల‌ను ప్రోత్స‌హించిన వాళ్ల‌కు మ‌నం విధించే శిక్ష ఊహ‌కు కూడా అంద‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

7 Replies to “స‌ప్త స‌ముద్రాల ఆవ‌త‌లున్నా మ‌ట్టి క‌రిపిస్తాం”

  1. క్రికెట్, సినిమాలు బ్యాన్లు ఇలాంటి చిన్న చిన్నవి కాకుండా పెద్ద దెబ్బ కొట్టాలి.

  2. మంచిదే, ఈ విషయంలో ఎవరూ వ్యతిరేకించరు.. కాకపోతే వీటిని ఎన్నికల ప్రచారంలో వాడుకుని రాజకీయం చెయ్యకండి.

    1. కాంగ్రెస్ హయాంలో జరిగిన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై పేలుళ్లు కి ప్రతీకారం తీర్చుకొని ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదు కదా.. కనీసం ప్రతిఘటన కూడా లేదు అప్పటి UPA హయంలో

      1. బ్రదర్, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కనిపించని శతృవు తో పోరాడడం అంత సులభం కాదు, బీజేపీ కి ఐనా, కాంగ్రెస్ కి ఐనా.. ఇద్దరి పాలనలోనూ ఉగ్రవాదుల దాడులు జరిగాయి, జరుగుతునే ఉన్నాయి. నిఘా వర్గాలను బలోపేతం చెయ్యడం, అవకాశం వచ్చినపుడు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుందాం. కాకపోతే వీటిని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడం నీచమైన పని, అది ఎవరు చేసినా సరే.

  3. మన చుట్టుపక్కలే, మన లోనే ,

    ఇండియా కి వ్యతిరేకంగా పని చేసే, 

    ఇండియా లో మెజారిటీ హిందువుల హక్కులు కి వ్యతిరేకంగా పని చేసే 

    వాటికన్ గొర్రె బిడ్డలు,

    మక్కా ఒంటె బిడ్డలు,

    చైనా ఎర్ర బిడ్డలు 

    చాలా మంది వున్నారు.

    వీళ్ళు హిందూ పేర్లు తో నే ఉంటారు, బుద్ధుడి పేరుతో , క్రైస్తవాన్ని వ్యతిరేకించి న  అబ్నేంద్కర్ ముసుగులో పని చేస్తూ వుంటారు. భారత చరిత్ర లో గొప్ప విషయాలు అంటే వీళ్ళకి నచ్చదు. 

    తమ మత మార్పిడి లకి   వ్యతిరేఖంగా లేకుండా ఉండటానికి సెక్యులర్ , అన్ని దేముళ్ళ సమానం అనే అసలు ఆ దేము ల్లే సొంతగా వొప్పుకొని విషయాలన్నీ మన మీద కు రుద్దారు.

    ఒక హిందువు మాత్రమే రాజ్యాంగం కి గీత కంటే విలువ ఇస్తాడు. అలా మైండ్ ను ట్యూన్ చేసారు.

    కానీ క్రైస్తవులు, ముస్లిం లని మాత్రం వాళ్ళ bible, quran  లు రాజ్యాంగం కంటే,దేశం కంటే గొప్పగా చెబుతారు. 

Comments are closed.