Advertisement

Advertisement


Home > Politics - National

ప్రధానమంత్రి పదవిపై కోరిక లేదు!

ప్రధానమంత్రి పదవిపై కోరిక లేదు!

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం తన ఢిల్లీ పర్యటనలో రెండవ రోజు తన ఢిల్లీ కౌంటర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు.

2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేయాల‌నే ల‌క్ష్యంతో బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఢిల్లీలో ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ముందుగా ఆప్ నేత‌ల‌ను క‌లిశారు. త‌రువాత సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో తమ పార్టీ కార్యాలయాల్లో సమావేశమయ్యారు. తరువాత హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాతో సమావేశమవుతారు.

2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సోషలిస్ట్ నేపథ్యం ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి జెడి(యు) నేత బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు.

గత నెలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో బంధాన్ని తెంచుకున్న నితీష్ ఆర్జెడీతో క‌లిసి బీహార్ లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత, కేంద్రంలోని బీజేపీ పార్టీని అధికారంలో నుండి గద్దె దింపడానికి ప్రతిపక్షాలను ఏకం చేయడం కోసం కృషి చేయడమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. అంతేగానీ.. ప్రధాని పదవిపై నాకు వ్యామోహం లేదు. నన్ను ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు నిలబెట్టాలనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు అని స్పష్టం చేశారాయన. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?