అందరూ పాడుతున్నారు.. అదే పాచిపాట!

తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడగడం అనేది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకూ ఒక కామెడీ ఎఫైర్ లాగా అయిపోయినట్టుగా ఉంది. దాదాపుగా కాస్త వెనుకబడి ఉన్నాం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. వీళ్లంతా నిజంగా…

తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడగడం అనేది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకూ ఒక కామెడీ ఎఫైర్ లాగా అయిపోయినట్టుగా ఉంది. దాదాపుగా కాస్త వెనుకబడి ఉన్నాం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. వీళ్లంతా నిజంగా తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేకహోదా కావాలని అనుకుంటున్నారో.. లేదా, తాము హోదా కోసం డిమాండ్ చేస్తున్నట్టుగా బిల్డప్ లు ఇస్తే సొంత రాష్ట్రంలో తమ రాజకీయ సుస్థిరతకు పునాది వేస్తుందని ఆశపడుతున్నారో అర్థం కావడం లేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. తొలిసారిగా బీహార్ నుంచి హోదా డిమాండ్ వినిపించింది. తాజాగా ఒదిశాలోని బిజూ జనతాదళ్ కూడా అదే అంటోంది.

తమాషా ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలు కూడా అచ్చంగా ఒకే తీరుగా డిమాండ్ వినిపిస్తున్నాయి. తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని, అది వీలుపడకపోతే.. కనీసం ప్రత్యేక ప్యాకేజీ అయినా ఇవ్వాల్సిందేనని అంటున్నారు. అవన్నీ కేంద్రం ఉదారంగా పంచిపెట్టే పప్పుల బెల్లాలే అన్నట్టుగా రాష్ట్రాలు అడిగేస్తుండడం విశేషం.

బీహార్ లో జేడీయూ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ లబ్ధి పొందడానికి ఈ హోదా ఎత్తుగడ వేసిందని అంటున్నారు. మరి ఒదిశాలోని బిజూజనతాదళ్ కు అలాంటి అవకాశం కూడా లేదు. ఆ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఆ రెండు రాష్ట్రాల సంగతి ఇలా ఉంటే.. అసలు విభజన చట్టం ద్వారా.. ప్రత్యేకహోదా ను హక్కుగా కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం పెదవి విప్పడం లేదు. ఢిల్లీ పోతున్నారు.. వస్తున్నారు తప్ప.. హోదా అనే మాట ఆయన నోటమ్మట రావడం లేదు. ఆయన స్వయంగా ఆ ఆలోచన వదిలేసినట్టుంది.

తాజాగా రాజకీయ మైలేజీ కోసమే అన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ప్రత్యేకహోదా పాట ఎత్తుకుంది. అయితే కేంద్రంలోని వర్గాల ద్వారా తెలుస్తున్న సంగతి ఏంటంటే.. చంద్రబాబు కోరుతున్న ఇతర కోరికలను గరిష్టంగా తీర్చడానికి కేంద్రం సంసిద్ధంగా ఉంటుందేమో తప్ప.. ఆయన అడిగారు కదాని.. ప్రత్యేకహోదా మాత్రం ఇవ్వడం జరగకపోవచ్చు అని పలువురు అంచనా వేస్తున్నారు. అయినా అసలు బాబుగారు అడిగితే కదా.. అని కూడా అంటున్నారు.

8 Replies to “అందరూ పాడుతున్నారు.. అదే పాచిపాట!”

  1. కేంద్ర ప్రభుత్వం దగ్గర తాత ల ఖజానా ఏమీ లేదు, ఇప్పటికే ప్రతీ ఏడాది ఐదు నుంచి పది లక్షల కోట్ల రూపాయలు కొత్త అప్పు చెయ్యాల్సి వస్తున్నది, అందువల్ల ఎవరి కోర్కెలు తీర్చలేరు.

    1. మీరు చెప్పిన మాటల్లో నిజం లేదు అనడం లేదు – ఈ ముక్క ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇచ్చినప్పుడు, ప్రత్యేక హోదా మద్దతు ఇచ్చినప్పుడు ఆలోచించి ఉండాల్సింది. కనీసం మీరు ఓటింగ్‌కి గైర్హాజరు అయినా అందరూ నమ్మే వారు – అయినా చంద్రబాబు నాయుడు గారు అంత సున్నితంగా మీకు వినవించుకున్నప్పుడు మీరు ఆయనను వేటాడారు – ప్రజలు కూడా TDPని ఓడించి, BJP చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఇప్పుడు మీ ప్రతాపం చూపించండి YSRCP వారికి “దమ్ము ఉంటే బిల్‌ పాస్‌ చేయండి రాజ్యసభలో” అంటున్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి.

    2. మీరు చెప్పిన మాటల్లో నిజం లేదు అనడం లేదు – ఈ ముక్క ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇచ్చినప్పుడు, ప్రత్యేక హోదా మద్దతు ఇచ్చినప్పుడు ఆలోచించి ఉండాల్సింది. కనీసం మీరు ఓటింగ్‌కి గైర్హాజరు అయినా అందరూ నమ్మే వారు – అయినా చంద్రబాబు నాయుడు గారు అంత సున్నితంగా మీకు వినవించుకున్నప్పుడు మీరు ఆయనను వేటాడారు – ప్రజలు కూడా TDPని ఓడించి, BJP చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకున్నారు. ఇప్పుడు మీ ప్రతాపం చూపించండి వారికి “దమ్ము ఉంటే బిల్‌ పాస్‌ చేయండి రాజ్యసభలో” అంటున్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి.

      1. ప్రత్యేక హోదా బిల్లు లో పెట్టమని బీజేపీ పట్టు పట్టడం వల్ల విభజన తీర్మానం ఆమోదం ఒక రోజు ఆలస్యం అయింది. బీజేపీ గైర్హాజరు కావచ్చు అనేవాళ్ళు తెలంగాణా కి ఒప్పుకుంటూ లెటర్ ఎందుకు ఇచ్చారు? ఇప్పటికి రెండు కళ్ల సిద్ధాంతం ఎందుకు చెబుతున్నట్లు? హైదరాబాద్ ఎందుకు వదిలి రారు?

  2. మొన్నటిదాకా బీజేపీ కి సొంతం గా మెజారిటీ రాకూడదు అనుకున్నారు, కాని అలాంటి పరిస్థితి వస్తే ప్రతీ రాష్ట్రం డిమాండ్స్ పెంచుతుంది అని ఊహించలేదా?

  3. పులికేశి గాడి నీలిముఠా అధికారంలో ఉన్న గత 5 ఏళ్ళలో డిల్లీలో ఎవరి గుడ్డ మడుస్తున్నారు రా ? అడగక ముందే ప్రతి బిల్లుకు ఎగేసుకుని మద్దతు ఇచ్చి ఇప్పుడు ముంజ కతలు పడితే ఎలా, జనాలు ఏమన్నా కభోదులు అనుకున్నారా ,అందుకో 100 అడుగల లోతులో బొం ద పెట్టేరు

Comments are closed.