నేటి ఆంధ్రా పోలీసుల్లో సాయికుమార్లు లేరా?

అధికారం చేతిలో ఉంది కనుక ఎంత కుదిరితే అంత అడ్డంగా దోచేసుకునే యావ చూపిస్తున్నారు. అన్నీ పోలీసుల కనుసన్నల్లో జరగడం ఇక్కడ ప్రత్యేకత.

సినిమాలని చూసి జనం నేర్చుకుంటారా? లేక బయట జరుగుతున్నవే సినిమాల్లో చూపిస్తారా? ఇదొక డిబేట్. ఏదైనా కావొచ్చు. తాజాగా ఒక సినీ ఫక్కీ సన్నివేశం మీడియా సాక్షిగా అందరికీ దర్శనమయ్యింది. అదే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఫోన్ వార్నింగ్.

స్థానిక విజయ డైరీ ఆఫీసుకెళ్లి, చైర్మన్ సీట్లో కూర్చుంది. అక్కడి నుంచే చైర్మన్ కి ఫోన్ చేసి తాను చేసింది ఒక చైర్మన్ గా అతనికి తప్పనిపిస్తే కంప్లైంట్ ఇచ్చుకోమని, ఒక బంధువుగా కూర్చున్నానుకుంటే లైట్ తీసుకోమని చెప్పింది. అసలు మ్యాటర్ ఇది కాదు. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు పక్కన పోలీసులు నిలబడి చోద్యం చూస్తున్నారు. మధ్యలో స్మైల్ ఇస్తున్నారు.

పైగా ఇదంతా ఎవరో సీక్రెట్ గా రికార్డ్ చేసింది కాదు. ఎమ్మెల్యే మేడమే స్వయంగా రికార్డ్ చేయించుకుని మీడియాలోకి వెళ్లేలా చూసారు. వ్యవస్థల్ని కీలుబొమ్మలుగా మార్చడమంటే ఇదే కదా! పోలీసు వ్యవస్థని, ఎమ్మెల్యే స్థానాన్ని హాస్యాస్పదం చేయడమే కదా?

ఇదిలా ఉంటే వేరే చోట్ల జరుగుతున్న విషయాలు ఇంకా ఘోరంగా ఉన్నాయి. అఖిలప్రియ లాగ ఆ ఘనకార్యాలను రికార్డ్ చేయించుకుని జనానికి పంచే దమ్ము లేదంతే వాళ్లకి.

రాత్రికి రాత్రి ఇసుకని తవ్వుకుని లారీలకి ఎక్కించి బోర్డర్ దాటించి బెంగళూర్, చెన్నై పంపిస్తున్నారు. ఇదేదో “పుష్ప”లో పోలీసుల కన్నుగప్పి చేసే స్మగ్లింగ్ అనుకునేరు! సాక్షాత్తు పొలీసులే దగ్గరుండి ఈ రవాణాకి సహకరిస్తున్నారు.

అలాగే కొన్ని చోట్ల ఏ గొడవలోనో ఏ వ్యక్తినో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనుకోండి. అతను తెదేపా వ్యక్తి అని తెలిస్తే తక్షణం వదిలేస్తారు. కాదని తెలిస్తే ఎవరైనా తెదేపా వ్యక్తి వచ్చి వదలమంటే వదులుతారు. అదే వైకాపా మనిషని తెలిస్తే లోపలే!

అంతే కాదు. ఒకానొక వ్యాపారి నానాకష్టాలు పడి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడుకుందాం. అది లాభసాటిగా ఉందనుకుందాం. రూలింగ్ పార్టీ నాయకుడెవడో వచ్చి ఆ వ్యాపారంలోని లాభల్లో వాటా ఇమ్మంటాడు. కుదరదంటే మొత్తం లాక్కుంటానంటాడు. అయినా లొంగకపోతే పోలీసులచేత వార్నింగులు ఇప్పిస్తాడు. చేసేది లేక వాటా అన్నా ఇవ్వాలి, లేదా మూసేసుకుని వేరే రాష్ట్రానికి పోవాలి. అదీ సన్నివేశం.

ఇక ల్యాండ్ కబ్జా కథలైతే వర్ణనాతీతం.

ఇలాంటివి వైకాపా పాలనలో జరగలేదా అంటే నిక్షేపంగా జరిగాయి. అయితే అప్పుడు 50% పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి జరిపితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 100% నిర్వీర్యమయ్యి అరాచకత్వం కోరలు చాపింది.

సినిమాల్లో రౌడీ పోలీసులుంటారు. నాయకులకి మాత్రమే కొమ్ము కాసే కరప్టెడ్ పోలీసులుంటారు. కానీ వాళ్ల మధ్యలోనే నిజాయితీ గల “పోలీస్ స్టోరీ”లో సాయికుమార్ లాంటి పోలీసుని, “విక్రమార్కుడు”లో రవితేజ లాంటి రాథోడ్ ని హీరోగా చూపిస్తారు. కానీ ఇక్కడ ఏపీలో ఆ రకం పోలీస్ హీరోలు కనిపించడం లేదని జనం ఉవాచ. ఎందుకంటే రాజకీయనాయకుల ఒత్తిడి.

పోలీసుల్ని తప్పుబట్టి లాభం లేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులకి సేవ చేయడమంటే ప్రజలకి సేవ చేయడం కిందే లెక్క. ఆ నాయకులు చెప్పింది వింటారు, పాటిస్తారు. “పోలీస్ స్టోరీ”లో సాయికుమార్ లాగ “అగ్ని…” అని అరిస్తే ఉద్యోగాలు ఊడొచ్చు. ఆ రిస్కెందుకు చేస్తారు? అందుకే నాయకుల్ని ఎన్నుకున్న జనానికి ఉండాలి. ఎటువంటి రౌడీ నాయకుల్ని ఎన్నుకుంటున్నాము అన్నది వాళ్లకి తెలియాలి! వాళ్లు ఏ పార్టీ నాయకులైనా సరే.

సాధారణంగా పేదవాడు పోలీసంటే ఎక్కువ భయపడతాడు. ఉన్నవాడు కాస్త భయపడ్డా బయట పడొచ్చనే ధీమా ఏదో ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశులో ఉన్నవాడు, లేనివాడు అనే తేడా లేదు. ఏ పార్టీకి చెందిన వాడు అనేదే లెక్క. ఒక “కూటమి” వర్గానికి చెందిన పేదవాడు డబ్బున్న వైకాపా వాడిని కొడితే ఆ పేదవాడిని ఏమీ చెయ్యరు. ఎక్కువ చేస్తే డబ్బున్నవాడని కూడా చూడకుండా బెదిరిస్తారు లేదా వాళ్లతో గొడవెందుకని పోలీసులే క్లాసు పీకుతారు.

అదే పేద వైకాపా వ్యక్తిని డబ్బున్న కూటమి వాడు కొడితే, పేద వాడికే నాలుగు తగిలిస్తున్నారు తప్ప ఉన్నవాడిని ఏమీ చేయట్లేదు పోలీసులు.

ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఒక వ్యవస్థను నిర్మించుకున్నాం. “మనం” అంటే మన ముందు తరం వారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. లేదంటే వ్యవస్థలున్నా ఉపయోగముండదు. ఈ రుగ్మత క్యాన్సర్ లాగ దేశమంతా పాకొచ్చు. ప్రజాస్వామ్యం ముసుగులో అరాచకవాదం రాజ్యమేలుతూ ఉంటుంది.

ఇంతటి స్థాయిలో ఈ దుస్థితి ఇతర రాష్ట్రాల్లోనూ లేదు.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే వ్యవస్థ కుళ్లిపోయింది. జనం, ఏలుతున్న పెద్ద నాయకులు కళ్లు తెరవకపోతే ఇది చాలా ప్రమాదం. ఒక పక్కన రఘురామరాజు, టీవీ5 మూర్తి.. ఇంకొంతమంది.. వైకాపా పాలనలో తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగట్లేదని వాపోతున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీకారాలకి స్థానం లేదోమో, నిజంగా ధర్మపాలనేమో అనే అనుమానాలొస్తాయి వాళ్ల గోడు చూస్తుంటే. పై స్థాయిలో నిజంగా అలాగే ఉండొచ్చు.

కానీ కింది స్థాయిలో మాత్రం అస్సలు అలా లేదు. ప్రతీకారాలు వ్యక్తిగతంగా మాత్రమే కాదు.. పార్టీ పరంగా తీర్చేసుకుంటున్నారు. అధికారం చేతిలో ఉంది కనుక ఎంత కుదిరితే అంత అడ్డంగా దోచేసుకునే యావ చూపిస్తున్నారు. అన్నీ పోలీసుల కనుసన్నల్లో జరగడం ఇక్కడ ప్రత్యేకత. అదీ అసలు కత.

– హరగోపాల్ సూరపనేని

39 Replies to “నేటి ఆంధ్రా పోలీసుల్లో సాయికుమార్లు లేరా?”

  1. వైసీపీ పాలనా లో 50% పోలీసు వ్యవస్థ నాశనమైపోయినప్పుడు.. తమరు ఏ కలుగు లో దాక్కున్నారో..

    ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు..

    గుడ్ మార్నింగ్.. హరగోపాల్..

    1. మా దూల బాబాయ్ ….తోనే ఇలా ఉంటె ..మా మహర్షి తాత వచ్చాక వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ ఫన్ ..మాములుగా కాదు….సైట్ కి ట్రాఫిక్ తగ్గినప్పుడు అంతా ఇలాంటి ట్రంప్ కార్డ్స్ ని దింపి ఇలాంటి ఆణిముత్యాలు రాయిస్తారు ….

  2. వైసీపీ పాలనా లో 50% పోలీసు వ్యవస్థ నాశనమైతె ఇప్పుడు 100% అవుతుందా?

    .

    RRR మీద సుమొటొ గా కె.-.సు పెట్టి ఒక ఎం.పి అని కూడా చూడకుండా పొలీస్ స్టషన్ లొ బాదెసింది ఎవరి టైమెలొ!

    ఎకంగా చంద్రబాబు ఇంటి మీధ దాడి చెస్తె ఎ చర్యలు తీసుకున్నరు?

    అలానె మాస్క్ అడిగిన సుధకర్ ని అలా చంత్రహింసలు పాలు చెసారు?

    అలానె ఒక శ్రినివస్ గుప్తా, ఒక రంగనయకమ్మ ఎలా వెదించారు?

    TDP office మీధ దాడి చెస్తె ఎ చర్యలు తీసుకున్నరు?

    మర్గదర్సి చిట్ ఫండ్స్, అమర్ రాజా బ్యాటరీస్ మీద కె.-.సులు ఎమిటి?

    ఇక వరుసగా ప్రతిపక్ష నాయకుల అక్రమ అర్రెస్ట్లు లు, రిమాండ్లు ఇవన్ని ఎమిటి?

    .

    వీటన్నిటి కంటె పెద్దాగా ఈమె చెసింది?

  3. “ భారత ఆర్థిక వ్యవస్థ రాణిస్తోంది. ఇందువల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఫలితంగా 2035 కల్లా రోజుకు 12,000కు పైగా కొత్త కార్లు భారత రోడ్ల పైకి వస్తాయని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేస్తోంది.”

    “ ఏటా 100 కోట్ల చదరపు మీటర్ల మేర రోడ్ల విస్తీర్ణం పెరుగుతుందని, ఫలితంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని మొత్తం రహదారుల విస్తీర్ణం కంటే అది అధికం అవుతుందని విశ్లేషించింది.”

    అంటే South Africa లో ఉన్న రహదారులకన్నా, దేశంలో ఉన్నవి చాలా తక్కువ అన్నమాట. జీవన ప్రమాణాలతో పాటు పన్నులూ పెరుగుతున్నాయి. 2035 కల్లా 2070 ఆదాయం ప్రకారం పన్నులు వేసుకోవచ్చు.

  4. ఇలాంటి మాటల ఒక సంవత్సరం క్రితం చెపితే నిన్ను నమ్మే వాళ్ళు. ఇప్పుడు నీతులు చెపుతుంటే వృద్ధ నారి పతివ్రతా లాగా ఉంది

  5. పోలీసులని మీ మాదిరి అడ్డగోలుగా అక్రమంగా ఉపయోగించుకునుంటే నువ్వు ఈ ఆర్టికల్ రాసేవాడివా హరీ?? ఈపాటికే నిన్ను హరీ అనిపించేవాళ్ళు కదా ??

  6. ఇలాంటి పొలిటికల్ అహంభావుల మీద కి తొడ కొట్టి మీసం దువ్వే ఒక రౌడీ పోలీస్ ఉండేవాడు …అలంటి మిగిలిన ఒకే ఒక్క ఆణిముత్యాన్ని కూడా అన్న తన పార్టీ లోకి తీసేసుకుని పోలీస్ వ్యవస్థ కి రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో నష్టం చేసేసారు …..అయ్యయ్యో……

  7. దూల బాబాయ్ నువ్వు సూపర్ ఎహె …ఆ టైటిల్ లోనే నీ మార్క్ తెలిసిపోతుంది ..ఇంకా ఆర్టికల్ చదవక్కర్లే ..డైరెక్ట్ జుంపింగ్ to కామెంట్ సెక్షన్

  8. దూల బాబాయ్ నువ్వు సూపర్ ఎహె …ఆ టైటిల్ లోనే నీ మార్క్ తెలిసిపోతుంది ..ఇంకా ఆర్టికల్ చదవక్కర్లే ..డైరెక్ట్ కింద సెక్షన్ కి వచ్చేయొచ్చు ….

  9. దూల బాబాయ్ వ్యాపారి లాభం అని ఎదో రాసారు కదా ఒక్కసారి medicover హాస్పిటల్స్ అన్ని మిగతా ఊర్లలో ఏ పేరు తో ఉంది విజయనగరం తిరుమల medicover అని ఎందుకు ఉంది….అలానే బొత్స బాబు కి చెందిన సత్య కాలేజీ కి విశాఖ లో ఫేమస్ కాలేజీ ఐన గాయత్రీ కి సంబంధం ఏమిటి …అశోక గజపతి రాజు గారు కి చెందిన హోటల్ లో బొత్స కి స్వామి కి వాటా ఇవ్వకపోతే పవర్ ఆపేస్తే కొన్నాళ్ల పటు జనరేటర్ పవర్ మీద నడిపించలేదా ????

  10. 4 నెలల క్రితం ఇదే పోలీస్ ఆఫీసర్స్ అందరూ సాయికుమార్ లాంటి వాళ్ళు అనుకోవచ్చా

  11. విసా రెడ్డి కూతురు కట్టబోయే యూనివర్సిటీ గ పోటీ లేకుండా చెయ్యడం కోసం గీతం మీద ఆరోణలు మర్చిపోయారా ????అణగతొక్కే ప్రయత్నాలు మర్చిపోయారా మన బ్లాక్ బిల్డర్ వైట్ నిర్మాత ఐన ఎంవీవీ విశాఖ లో ఎంత మంది చిన్న మధ్య స్థాయి బిల్డర్స్ పొట్ట కొట్టారు….

  12. విసా రెడ్డి కూతురు కట్టబోయే యూనివర్సిటీ గ పోటీ లేకుండా చెయ్యడం కోసం గీతం మీద ఆరోణలు మర్చిపోయారా ????అణగతొక్కే ప్రయత్నాలు మర్చిపోయారా మన “నల్ల ” బిల్డర్ “తెల్ల ” నిర్మాత ఐన ఎంవీవీ విశాఖ లో ఎంత మంది చిన్న మధ్య స్థాయి బిల్డర్స్ పొట్ట కొట్టారు….

  13. how shameful this guy is is in putting title “నేటి ఆంధ్రా పోలీసుల్లో సాయికుమార్లు లేరా?”…just shocking

  14. వై సీ పీ పాలనా లో 50% పోలీసు వ్యవస్థ మాత్రమే నాశనము అయిందా .. నీ గు ద్దకి సి గ్గు అనేది ఉందా నీ అ మ్మ / నా న్న అది పెట్టి కన్నారా లేక ఇలా 5/- కోసం కక్కుర్తిపడ్డామన్నారా ?

    1.RRR మీద కే సు

    2.సీబీన్ ఇంటి మీద దా డి

    3. టీడీపీ కార్యాలయం మీద దా డి

    4. మాస్క్ అడిగిన పాపానికి సుధకర్ అనే డాక్టర్

    5. సీబీన్ మీద అంగళ్ళు లో జరిగిన దా డి

    ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఇలా రాసుకుంటే పోతే కామెంట్ బాక్స్ సరిపోదు ఏమో !

  15. వై సీ పీ పాలనా లో 50% పో లీ సు వ్యవస్థ మాత్రమే నా శ న ము అయిందా .. నీ గు ద్ద కి సి గ్గు అనేది ఉందా నీ అ మ్మ నా న్న అది పె ట్టి క న్నా రా లేక ఇలా 5/- కోసం క క్కు ర్తి ప డ్డా మ న్నారా ..

    1. R R R మీద కే సు

    2.సీ బీ న్ ఇంటి మీద దా డి

    3. టీ డీ పీ కార్యాలయం మీద దా డి

    4. మాస్క్ అడిగిన పా పా ని కి సుధకర్ అనే డాక్టర్

    5. సీ బీ న్ మీద అం గ ళ్ళు లో జరిగిన దా డి

    ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఇలా రాసుకుంటే పోతే కా మెం ట్ బా క్స్ సరిపోదు ఏమో

  16. లేరు GA. ఉంటే ఎప్పుడో ja*** గాడ్ని రోడ్ల మీద గు*డ్డ*లు వూడదీసి త*న్ను*కుం*టూ ఈ*డ్చు*కొని వెళ్ళేవాళ్ళు!!

  17. సునిల్ , సంజయ్ అనే వాళ్ళు చేసిన లం*గా పనులు కూడా చెప్పు. వదినమ్మ వంట వాళ్ళకి ఫైర్ డిపార్టుమెంటు లో ఉద్యోగం, ఎవడబ్బ సొమ్ము అని ఇచ్చారు?

  18. “ఇలాంటివి వైకాపా పాలనలో జరగలేదా అంటే నిక్షేపంగా జరిగాయి. అయితే అప్పుడు 50% పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి జరిపితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 100% నిర్వీర్యమయ్యి అరాచకత్వం కోరలు చాపింది.”

    pichi l.kodaka..lies….looks like paid artists started campaign

  19. i restrained my self thinking that author is aged and should be respected even though articles are border line lies…but he does not deserve respect…look at the below statement from him…

    “ఇలాంటివి వైకాపా పాలనలో జరగలేదా అంటే నిక్షేపంగా జరిగాయి. అయితే అప్పుడు 50% పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి జరిపితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 100% నిర్వీర్యమయ్యి అరాచకత్వం కోరలు చాపింది.”

Comments are closed.