‘చీప్’ లిక్కర్ తాగండి- ‘కాస్ట్లీ’ సినిమా చూడండి

చీప్ గా మద్యం పంపకాలు, కాస్ట్లీగా సినిమా టికెట్ ధరల పెంపకాలు.. రెండూ మంచివి కావు.

జగన్ మోహన్ రెడ్డి హయాములో మద్యప్రియులు గడ్డుకాలం చూసారు. తాగాలంటే నాణ్యమైన మందు ఉండేది కాదు. పోనీ అదైనా పర్లేదనుకుంటే ధరలు ఆకాశాన్ని అంటేవి.

ఏ పని మీదో ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా ఊరికి వెళ్ళిన ఇతర రాష్ట్రాల వాళ్లకి సాయంత్రం సేద తీరాలని ఏ బాటిలో కొనుక్కుందామని వైన్ షాపుకి వెళితే ఎక్కడా కనీ వినీ ఎరుగని లోకల్ బ్రాండ్లు కనిపించేవి. పోనీ ఏదైనా బారుకి వెళితే అక్కడ కూడా వాళ్లకి కావాల్సిన బ్రాండ్ దొరికేది కాదు. ఆంధ్రకి రావడం పనిష్మెంటులా ఫీలయ్యేవాళ్లు చాలామంది.

పోనీ వచ్చేటప్పుడే కావాల్సిన సీసాని కూడా తెచ్చుకుందామంటే బార్డర్లో పట్టుకునేవాళ్లు. ఎక్కడో దాచి, ఒక్క బ్రాండెడ్ సీసాని బార్డర్ దాటిస్తే గంధపుచెక్కల్ని స్మగ్లింగ్ చేసిన పుష్ప రేంజులో ఫీలవ్వాల్సి వచ్చేది. ఇదంతా కచ్చితంగా రాష్ట్రం ఇమేజుపైన పడింది.

దానికి తోడు లిక్కర్ నగదు ద్వారానే అమ్మడం పలు విమర్శలకు దారి తీసింది. ఆ డబ్బు పెన్షన్లివ్వడానికి వాడామని ఆ ప్రభుత్వమంటే, కాదు సొంతానికి వాడుకున్నారని ప్రతిపక్షం అనేది.

జనం ఈ లిక్కర్ పాలిసీ వల్ల విసుగెత్తిపోతున్నారు, చిరాకు పడుతున్నారు అని అంటే.. తన లక్ష్యం నెరవేరుతున్నట్టుగా ఫీలయ్యేది వైకాపా అధిష్టానం.

ఇప్పుడు ప్రభుత్వం మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సీనంతా రివర్సయ్యింది. 99 రూపాయలకే నాణ్యమైన మధ్య‌మిస్తున్నామంటూ ప్రకటించారు. “నాణ్యత”- “తక్కువ ధర” రెండూ ఎలా పొసగుతాయో జనం అడగరనేది ప్రభుత్వం నమ్మకం కావొచ్చు.

నాణ్యత పెంచామని చెప్పడాన్ని అర్థం చేసుకోవచ్చు. ధర తగ్గించడం దేనికి? అంటే కావాల్సినంత తాగమని ఉసిగొల్పడమే కదా! ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకంపై వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయినట్టే కదా!

రేటెక్కువ పెడితే అరసీసా తాగేవాడు పావుసీసాకి ఆపే అవకాశముంది. రేటు తగ్గిస్తే పావుసీసా తాగేవాడు సైతం ఫుల్ బాటిల్ తాగే ఉత్సాహం చూపించొచ్చు. అప్పుడు ఎవరికి నష్టం? ఎంత నాణ్యమైన సరుకైనా డోసెక్కువైతే లివర్ పోవడం ఖాయం.

పైగా దీనివల్ల వీధికొక బెల్టు షాపు వచ్చేస్తుంది. టార్గెట్లు పెట్టుకుని మద్యం అమ్మకాలు చేస్తారు. మద్యం వాడకం పెరిగితే అనారోగ్య సమస్యలతో పాటూ క్రైం రేట్ కూడా పెరుతుంది. మళ్లీ అదంతా ప్రభుత్వం మీద ఆరోగ్యశ్రీ రూపంలోనూ, లా అండ్ ఆర్డర్ విషయంగానూ అదనపు భారమే.

నాణ్యమైన సరుకు తగ్గువ ధరకి ఇవ్వడం నిజమనుకుంటే మద్యం మీద సబ్సిడీ ఇస్తున్నట్టు అనుకోవాలి. అంటే, అది కూడా సంక్షేమపథకంలో భాగమన్నమాట. ఖజానాపై భారమే అన్నమాట.

సరే మద్యం చీపైపోతే…సినిమా టికెట్ మాత్రం కాస్ట్లీ అయిపోయింది. పెద్ద సినిమాల నిర్మాతలు ఇలా అడగగానే అలా టికెట్ రేట్లు పెంచేస్తూ జీవో జారీ అయిపోతోంది. ఒక్క సినిమాతో ఇది ఆగదు. రాబోయే అన్ని సినిమాలకి ఇదే వరమిస్తూ వెళ్లాలి. 99 రూపాయల మద్యం తాగిన వాడికి సినిమా చూడాలనిపిస్తే రూ 400 పెట్టాలి. అంటే వినోదం మద్యం కంటే ఖరీదైన పరిస్థితి. మద్యం విషయం పక్కనపెట్టి అసలీ టికెట్ రేట్ పెరుగుదల వల్ల ఏమౌతుందో ఒక్కసారి చూద్దాం!

పెద్ద హీరోల సినిమాలొచ్చినప్పుడే జనమంతా సినిమా హాల్ వైపు చూస్తారు. ఆ సమయంలో టికెట్ల రేట్లు 400, 500 అన్నట్టుగా ఉంటే జంకుతారు. టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా రెండో రోజే ఎవ్వడూ రాడు. అంతే కాదు, సినిమా అంటే ఖరీదైన విషయం అని మధ్యతరగతి ప్రజల మైండులో పడిపోతుంది. దాంతో ప్రత్యామ్నాయ వినోదాన్ని వెతుక్కుంటున్నారు. చిన్న సినిమాల టికెట్ రేట్లు అంత ఉండవన్న విషయం కూడా వాళ్లు పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాలకి ఆడియన్స్ లేకపోవడానికి కారణాల్లో ఇదొకటి.

బెంగళూరులో ఇదే జరిగింది. గతంలో సినిమాలకి మంచి మార్కెట్ ఉండేది. తెలుగు సినిమాలు కూడా అద్భుతంగా అడేవి. టికెట్ రేట్లు పెంచుకుంటూ పోయి రూ 1000 కి, అంతకంటే ఎక్కువకి కూడా అఫీషియల్ గా అమ్మడం మొదలుపెట్టారు. క్రమంగా జనానికి సినిమా దూరమైపోయింది. ఇప్పుడు కర్నాటక మార్కెట్ మునుపటంత లేనే లేదు. తెలుగుకి కూడా ఆ గతి పట్టించేట్టు ఉన్నాయి ఈ టికెట్ రేట్ పెంచడాలు.

చీప్ గా మద్యం పంపకాలు, కాస్ట్లీగా సినిమా టికెట్ ధరల పెంపకాలు.. రెండూ మంచివి కావు. ఒకటి ప్రజల ఆరోగ్యం మీద, రెండోది సినిమా వ్యాపారం మీద నెగిటివ్ ప్రభావమే చూపిస్తాయి.

ఒక ప్రభుత్వం అమలుపరిచిన విధానంలో ఉపయోగపడేది ఉంచుకుని, తేడాగా ఉన్నదానిని సరి చేయవచ్చు కానీ…అన్నింటినీ పూర్తి భిన్నంగా చేయాలనుకోవడం హర్షించే ఫలితాలు ఇవ్వవు. మద్యం విషయంలో అయినా, సినిమా టికెట్ల రేట్ల విషయంలోనైనా ఏకపక్షంగా కాకుండా ప్రభుత్వం ఇతర విషయాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే సమాజానికి మంచిది.

శ్రీనివాసమూర్తి

30 Replies to “‘చీప్’ లిక్కర్ తాగండి- ‘కాస్ట్లీ’ సినిమా చూడండి”

  1. నాణ్యత – ఒక్క Jagan బ్రాండ్లె కాదు అన్ని బ్రండ్లు లభ్యం.

    ధర – పెదవాడి బలహీనత ని అడ్డు పెట్టుకొని ఎగా దిగా దొచెయటం ఆపటం.

  2. ఆత్రం ఆగితే ఇంట్లోనే OTT లేదా I బొమ్మ లో చీపు, చీకులు మరియు సినిమా చూడొచ్చు, ఇదంతా పెద్ద విషయం కాదు…

  3. జగ్గడి హయంలో అన్నీ బ్రాండ్స్ వైసిపి స్మగ్లర్లు దగ్గర డబుల్ రేటుకు దొరికేవి. అవి కొనలేని వాళ్ళు వైన్ షాపుకు వెళ్లి స్పిరిట్ కొనుక్కొని తాగి ఆరోగ్యం పాడుచేసుకొన్నారు

  4. అధికారం కోసం ..మద్యపాన నిషేధం చేస్తాం..

    అధికారం వచ్చాక.. మద్యం మీద ఆదాయం తో రాష్ట్ర ఆదాయం పెంచాం..

  5. సినిమా టికెట్స్ రేట్ తగ్గించి, నిత్యావసర వస్తువులు, సాండ్, లిక్కర్, bus, కరెంటు ఛార్జీలు పెంచాలి అంతే కదా GA!! wah what an idea sir ji !!

  6. నిన్న చీనివాస “శర్మ” ఇవ్వాళా మూర్తి కానీ ఏడుపు మాత్రం షేమ్ to షేమ్…..

  7. Nanaya మయిన మద్యం కాదు రా అయ్య. మంచి బ్రాండ్స్ వి . ఎందుకంటే మీ బ్రాండ్ ల తో ఎక్కువ శాతం. స్పిరిట్ కలియోసి వారు అంటే. తొందర గా మత్తు వస్తుంది ధని వల్ల తెవర మయిన అనారోగ్యం . ఇప్పుదు అలా ఉండదు అంతే. ఇక రెట్లు అంటారా ఒక వస్తువు మీద అది ఎక్కువ మంది వినియోగిస్తున్న దాని మీద డబుల్ రెట్లు పెట్టి ప్రభుత్వమే దొచ్చు కోవడం కరెక్ట్ అయిన పని కాదు

  8. ఇక. సినిమా రెట్లు అంటారా. అవి కేవలం.ఫ్యాన్స్ కి మాత్రమే మహా హైతే మన జనాభా లో ఒక రెండు శాతం మాత్రమే. అది కూడా ముందే చేసెయ్యాలి అని అత్రం ఉంటే .కొన్నలు ఆగిత్3 రెట్లు తగ్గుతాయి హ్యాపీ గా చూడొచ్చు కొంపలు మునగవు .ఫ్లాప్ టాక్ వస్తే ఇంట్లో O T T lo చూడొచ్చు అది సమస్యే కాదు . కూటమి చేస్తుంది సారి అయినా చర్యే .

  9. నాణ్యత – ఒక్క Jagan బ్రాండ్లె కాదు అన్ని బ్రండ్లు లభ్యం.

    .

    ధర – పెదవాడి బలహీనత ని అడ్డు పెట్టుకొని ఎగా దిగా దొచెయటం ఆపటం.

  10. అసలు ఏవద్రా నువ్వు….ఏపీ లో లిక్కర్ తాగే జనాభా ఎంత ….సినిమా చూసే జనాభా ఎంత…

    ఏది రాస్తే అది చదివి నిన్ను శభాష్ అనే రోజులు పోయాయి…

    నీకు మళ్ళీ చెబుతున్నా వార్త రాయి… నీ తొక్కలో సంపాదకీయం వద్దు…

    అదే కథనాలు వద్దు…

    ఏపీ లో లిక్కర్ ధరలు తగ్గించారు…

    కొత్త సినిమా కి మొదటి వారం రెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు… ఇదీ వార్త….

    కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా లో లాగే వుంది .. నీ వార్తలు.

  11. కల్తీ మద్యం ఏపీ లో ,j బ్రాండ్ లు అమ్మినపుడు యాడికి పొయావురా….లివర్ లు దొబ్బి చాలా మంది చనిపోయారు,రోగాల పాలైనారు.

  12. హిందూ దేముళ్ళ ప్రసాదం లో జంతువుల కొవ్వు కలిపిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న గ్రేట్ ఆంధ్ర కొవ్వు ఎవడు కరిగిస్తాడు?

  13. దూల ఉన్నవాడు డబ్బులు ఎక్కువైనా రిలీజ్ ఐన రోజో.. ఆ వారంలోనో చూస్తాడు. అది వాడి ఇష్టం. సినిమా బాగోక పోతే next డేనే రేట్లు దిగి వస్తాయి. అదీ లేదంటే మరో వారం లో తగ్గుతాయి. ఇంకా ఒక నెలపోతే OTT లో వచ్చేస్తుంది. ఎటుచూసినా సినిమా టికెట్స్ పెరుగుదల వల్ల ఎవడికీ నష్టం లేదు. కానీ లిక్కర్ ధరల పెంపు వల్ల… అదికూడా నాణ్యమైనది కానందువల్ల.. పనికిమాలిన లోకల్ బ్రాండ్స్ వల్ల.. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది ఆప్షనల్ కాదు.

  14. శ్రీనివాసమూర్తి గారు.. జగన్ మోహన్ రెడ్డి హయాములో మద్యప్రియులు గడ్డుకాలం చూసారు. తాగాలంటే నాణ్యమైన మందు ఉండేది కాదు. పోనీ అదైనా పర్లేదనుకుంటే ధరలు ఆకాశాన్ని అంటేవి. అని ఈ ఆర్టికల్ లో రాశారు. కానీ గత ఐదేళ్ళలో ఈ విషయంపై జగన్ గారి విధానానికి వ్యతిరేఖంగా మీరు స్టోరీలు రాశారా లేదు. పైగా సపోర్ట్ చేస్తూ రాశారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇలా రాస్తున్నారు. కాస్త రాసేటప్పుడు గతంలో మద్యం పాలసీపై మన గ్రేట్ ఆంధ్రా స్టోరీలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోండి లేకపోతే పరువుపోద్ది.

  15. శ్రీనివాసమూర్తి గారు.. ఇది కూడా చూడండి. ఇదే ఆర్టికల్ లో 99 రూపాయలకే నాణ్యమైన మధ్య‌మిస్తున్నామంటూ ప్రకటించారు. “నాణ్యత”- “తక్కువ ధర” రెండూ ఎలా పొసగుతాయో జనం అడగరనేది ప్రభుత్వం నమ్మకం కావొచ్చు. మీ ఈ మాట ప్రకారమే.. తిరుమల తిరుపతి దేవస్థానం కోసం 319 రూపాయల 80 పైసలకు నాణ్యమైన కిలో నెయ్యి ఎలా దొరుకుతుందని టిటిజి చైర్మన్, ఈవో ఆయా కంపెనీలకు టెండర్లు ఇచ్చారో కూడా ఓ ఆర్టికల్ రాయండి. ఎందుకంటే మీరన్నట్లే… నాణ్యత-తక్కువ ధర ఎలా పొసుగుతాయో జనం అడగరనేది ప్రభుత్వం నమ్మకం అయ్యుండొచ్చు కదా.. చూడండి ఓ సారి.

Comments are closed.