Advertisement

Advertisement


Home > Politics - Opinion

పవన్ కళ్యాణ్ కాపు తోలు కప్పుకున్న కమ్మ

పవన్ కళ్యాణ్ కాపు తోలు కప్పుకున్న కమ్మ

వైవాహిక జీవితాన్ని స్వేచ్ఛగా ఎంజాయ్ చేయగౌగుతున్నా అన్ని విషయల్లోనూ స్వేచ్ఛగా ఉందలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్. 

పవన్ కళ్యాణ్ ఉనికి ఎవరంటే చిరంజీవి. అన్నయ్య లేనిదే ఇతనెవరో కూడా లోకానికి తెలీదు. చాలాకాలం అన్నచాటు తమ్ముడిగా బతికాడు. అన్నయ్యని మోహన్ బాబు ఒక సభలో అవమానిస్తే.."తమ్ముడూ మోహన్ బాబు!..." అంటూ మోహన్ బాబుని సంబోధించి కలెక్షన్ కింగ్ కి సభాముఖంగా గాలి తీసిన ఘనుడు ఒకప్పుడు. 

కాలక్రమంలో అన్నయ్య పీఆర్పీ పెడితే కొమ్ముగాసాడు. అన్నకు తగిన తమ్ముడు అనుకున్నాం. కానీ పార్టీ సర్వనాశనమైతే దానికి కారణం అల్లు అరవింద్ అన్నాడు. 

అక్కడి నుంచి అతనికి ఏం బుద్ధి పుట్టిందో కానీ తన అన్నయ్య సాధించలేనిది తాను సాధించి అన్నయ్యకంటే గొప్ప అనిపించుకోవాలనే తుత్తర ఎక్కువైంది. తానే సొంత పార్టీ పెట్టుకుని బయలుదేరాడు. 

బాగానే ఉంది. సొంత పార్టీకి సత్తువ లేదని చంద్రబాబు మాటలు నమ్మి తెదేపాతొ చేతులు కలిపాడు. క్రమంగా కళ్లు బైర్లు కమ్మి అన్నయ్య కనిపించడం మానేసాడు. 

దానికి చాలా ముందే "మీలో ఎవరు కోటీశ్వరుడు"ప్రోగ్రాం కి గెస్ట్ గా పిలిస్తే తమ్ముడు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాలకృష్ణ "అన్ స్టాపబుల్" కి పిలిస్తే పరుగెట్టుకెళ్లాడు. ఎందుకంటే బాలకృష్ణ చంద్రబాబు బావ కాబట్టి, తెదేపాలో ముఖ్యుడు కాబట్టి. 

ఏ అల్లు అరవిందునైతే పీఆర్పీ విషయంలో వేలెత్తి చూపాడో అదే అల్లు అరవింద్ భాగస్వామైన ఆహా చానల్లో ప్రోగ్రాం అది. 

ఇదంతా చూస్తుంటే కాపులకి కమ్మగా ఉంటుందా? ఉండనే ఉండదు. మధ్యలో కాపుల సంగతేంటని అడగొచ్చు. జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లని పోలరైజ్ చేసే పనులు చాలానే చేసాడు. పోనీ అది తనకోసమా అంటే కాదు. అటు చేసి ఇటు చేసి చంద్రబాబుని గెలిపించడానికి. ఇదే మింగుడు పడని కాపులకి ఇప్పుడు పవన్ ఊపుకుంటూ అన్ స్టాపబుల్ షో కి గెష్ట్ గా వెళితే కోపం నషాళానికి అంటదూ!

అదొక్కటే కాదు..అసలీ షోకి ఆ మధ్యన చిరంజీవిని పిలుద్దామంటే బాలకృష్ణ "నో"చెప్పాడు. ఆ విధంగా అన్నయ్యకి గౌరవమివ్వని షో అది. అయినప్పటికీ చంద్రబాబు మీద భయమో, త్రివిక్రం రాయబారమో..ఒప్పేసుకున్నాడు. తన కుటుంబం కన్నా బాలకృష్ణ ఎక్కువైపోయాడు పవన్ కి. 

పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడని నాయకుడు కాదు. క్యాస్ట్ పాలిటిక్స్ విపరీతంగా చేస్తాడు. బహిరంగంగానే రెడ్ల ప్రభుత్వం అంటూ వైకాపాని వేలెత్తి చూపుతాడు. కాపులంతా ఒక్కటవ్వాలంటాడు. అసలు తన సినిమా ఫాలోయింగుకి, తన అన్నయ్య ఫాలోయింగుకి క్యాస్ట్ ప్రధానకారణమంటే బుర్రన్నవాడెవడూ కాదనడు. 

కులం సమీకరణంతో సినిమా స్టార్డం పొంది, ఎన్నికల్లో కూడా అదే కులబలంతో ఏదో చెయ్యాలనుకుంటున్న పవన్ పెళ్లిళ్ళు మాత్రం కాపులమ్మాయిల్ని చేసుకోలేదు. చేసుకోకూడదని కాదు. ఎవరు ఏ కులం వారినైనా, ఏ మతం వారినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ కులం కార్డుతో సినీ, రాజకీయ కెరీర్ ని నిర్మించుకునేవాడు మాత్రం నిఖార్సైన సదరుకులం వ్యక్తిగా ప్రవర్తించాలి. లేకపోతే కాపులు తమ నాయకుడిగా ఎలా ఓన్ చేసుకోగలుగుతారు? 

ఇదంతా చూస్తూ పవన్ కళ్యాణ్ ని కాపుతోలు కప్పుకున్న కమ్మవాడిగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతని మెదడులోనూ, మనసులోనూ కమ్మవారైన చంద్రబాబు, బాలయ్యబాబులే ఉన్నారు. పైకి మాత్రమే కాపు నాయకుడిగా బిల్డప్పు. 

ఇక్కడ మరొక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అతనే త్రివిక్రం. 

అతను దగ్గరుండి మరీ పవన్ ని తీసుకెళ్లి అన్ స్టాపబుల్ షోలో కూర్చోపెట్టాడు. ఈ త్రివిక్రమే గతంలో పవన్ కి ఉపనయనం చేయించి జంధ్యం వేసి బ్రాహ్మణుడ్ని చేసాడు. అసలీ ప్రక్రియ ఎందుకు జరిపారో అసలు రహస్యమేమిటో త్రివిక్రం కి, పవన్ కి మాత్రమే తెలియాలి. దీనినిబట్టి అసలు పవన్ కి "కాపు" గా తనని తాను నిలబెట్టుకోవడమే ఇష్టం లేనట్టుంది. ఇక కాపులనేమి ఉద్ధరిస్తాడు? తీసుకెళ్లి తెదేపాకి అమ్మేయడం తప్ప! 

కాపులకి రాజ్యాధికారం తీసుకొచ్చే దిశగా చిరంజీవి ప్రయత్నించారు. కానీ ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలు సరిపడక తప్పుకోవాల్సి వచ్చింది. పవన్ కి రాజకీయాలకి సరిపోయే వ్యక్తిత్వం ఉంది. కానీ ఏం లాభం? కమ్మపార్టీకి, బ్రాహ్మణ దర్శకుడికి అమ్ముడుపోయాడు. ఇకనైనా కాపు సోదరులు కళ్లు తెరిచి తమ పనులు తాము చేసుకోవాలి. సరైన నాయకుడికోసం పడిగాపులు కాయాలి. 

- సుంకర అనీల్ కుమార్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?