త్రిష ఆట‌కు కోటి న‌జ‌రానా

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ గొంగ‌డి త్రిష ఆట‌కు తెలంగాణ ప్ర‌భుత్వం రూ.కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించింది.

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ గొంగ‌డి త్రిష ఆట‌కు తెలంగాణ ప్ర‌భుత్వం రూ.కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించింది. టీ20 అండ‌ర్‌-19 భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు వ‌రుస‌గా రెండోసారి వ‌ర‌ల్డ్‌కప్‌ను ద‌క్కించుకుంది. ఈ ద‌ఫా మ‌న జ‌ట్టు ఫైన‌ల్‌కు చేర‌డంలోనూ, అలాగే కీల‌క‌మైన చివ‌రి మ్యాచ్‌లో తెలంగాణ బిడ్డ త్రిష అద్భుతంగా రాణించింది. దీంతో భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం విజ‌య గ‌ర్వంతో రెప‌రెప‌లాడింది.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా భ‌ద్రాచ‌లం నివాసైన త్రిష‌ను సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి, అదే జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా అండ‌ర్‌-19 వ‌రల్డ్‌క‌ప్‌లో విజ‌యం సాధించిన తీరు గురించి త్రిష‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భ‌విష్య‌త్‌లో మ‌రింత‌గా రాణించాల‌ని త్రిష‌ను సీఎం ప్రోత్స‌హించారు.

త్రిష‌తో పాటు మ‌రికొంద‌రు మ‌హిళా క్రికెట‌ర్ల‌కు కూడా ప్రోత్సాహ‌క బ‌హుమ‌తుల్ని సీఎం అంద‌జేశారు. అండ‌ర్ -19 జ‌ట్టులో స‌భ్యురాలైన తెలంగాణ‌కు చెందిన కేస‌రి ధ్రుతికి రూ.10 ల‌క్ష‌లు, హెడ్ కోచ్ నౌషీన్‌, ట్రైన‌ర్ షాలినికి రూ.10 ల‌క్ష‌లు చొప్పున సీఎం అంద‌జేశారు.

4 Replies to “త్రిష ఆట‌కు కోటి న‌జ‌రానా”

Comments are closed.