తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘‘సీఎం రేవంత్‌ను దించేస్తాం, కేసీఆర్‌నే సీఎంగా చేస్తాం’’ అంటూ బెదిరిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు రోజుకో మాట మారుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని వ్యాపారులు, రియల్టర్లు కోరుకుంటున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘‘రేవంత్ ఈ ఐదేళ్లు అధికారంలో ఉండాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ తాము పట్టలేదని, ప్రజలకు కోపం వస్తే బంగ్లాదేశ్‌లో లాగానే వాళ్లే రోడెక్కి ప్రభుత్వాన్ని తొక్కుతారు. పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు. రేవంత్ రెడ్డి ఎంత? ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. చాలా మంది తమ వద్దకు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని అంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఇదే మాజీ మంత్రి కేటీఆర్ ‘‘ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదు, కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ వ్యతిరేక వర్గం ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తుంది’’ అని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మాటలకు జాగ్రత్త పడి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అప్పటి నుండి కేటీఆర్ “కూలదోస్తాం” అనే మాట చెప్పడం లేదు.
ఎంపీ ఎన్నికల్లో ఒక స్థానంలో కూడా బీఆర్ఎస్ ప్రభావం చూపకపోయినా, ‘‘తెలంగాణలో ప్రభుత్వం నడపాలంటే కేసీఆర్ వల్లే అవుతుంది’’ అనే భ్రమల్లో బీఆర్ఎస్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.
ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వాలను రాజకీయ కుట్రలతో కూలదోస్తే, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రేవంత్ పాలన బాగోలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇతర నాయకుడిని ఎంచుకుంటారు. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ అంటోంది. అలాగే ‘‘ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే’’ వారు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ‘‘తెలంగాణకు కేసీఆర్ తప్ప ఎవరు సీఎంగా పనికి రారు’’ అనే విధంగా మాట్లాడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అనేది మరో మూడున్నరేళ్లు వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ఈ బెదిరింపులు సర్వసాధారణమే.
AP lo ఆ జగ్లక్ దరిద్రుడు TGలో ఆ taaguబోతు ముక్కోడు ఎప్పటికీ మళ్ళి సీఎం కాలేరు
మీ సంగతి ఏమి రా గూట్లే బేవర్స్ గా తిరిగి ఇప్పుడు మాట్లాడతావు చెత్త నా కొడుకు