విశాఖలో వైసీపీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం కూటమి నేతలు ఇచ్చారు. ఈ నెల 19న ప్రత్యేక సమావేశం జరగనుంది. అయితే అదే ఊపులో డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. జీవీఎంసీ ఇంచార్జి కమిషనర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ కి దీని మీద నోటీసుని కూటమి నేతలు ఇచ్చారు.
అయితే ఆయన డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాసం నోటీసుని తిరస్కరించారు. దానికి కారణాలు వెల్లడించారు. సెక్షన్ 91 ఏ పురపాలక చట్టం 1955 ప్రకారం ఈ నోటీసుని తిరస్కరిస్తున్నట్లుగా చెప్పారు. ఈ చట్ట ప్రకారం నాలుగేళ్ళ పదవీ కాలం పూర్తి కాకుండా డిప్యూటీ మేయర్ మీద పెట్టే అవిశ్వాసం చెల్లదని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ డిప్యూటీ మేయర్ పదవిని 2021 జూలై 30న భర్తీ చేశారు. దాంతో మరో మూడు నెలలు ఆగాలి అన్న మాట. అయితే కూటమిలో మేయర్ టీడీపీకి ఇచ్చినా డిప్యూటీ మేయర్ల విషయంలో మిత్ర పక్షాలు ఆశపడుతున్నాయి. జనసేన, బీజేపీ తమకు ఆ పదవులు కావాలని కోరుతున్నాయి.
జీవీంసీలో రెండు డిప్యూటీ మేయర్ పదవులు ఉన్నాయి. మేయర్ నాలుగేళ్ళ కాలపరిమితి అయితే మార్చి 18తో ముగిసింది. కాబట్టి అవిశ్వాసం నోటీసుని ఇచ్చారు. డిప్యూటీ మేయర్ల కాల పరిమితి కూడా నాలుగేళ్ళు పూర్తి కావాల్సి ఉంది. కూటమిలో డిప్యూటీ మేయర్ పదవుల ఆశావహులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నోటీసుని ఇచ్చారు. కానీ కాల పరిమితి చట్టం గురించిన కారణాలతో కలెక్టర్ దానిని తిరస్కరించారని చెబుతున్నారు.
దాంతో డిప్యూటీ పదవుల కోసం ఆగాల్సిందే. అయినా ఇంత చేసి మేయర్ డిప్యూటీ మేయర్ కిరీటాలు తగిలించుకున్నా ఆ పదవులు అన్నీ 2026 మార్చితో పూర్తి అవుతాయని చెబుతున్నారు. కొద్ది నెలల కోసం ఇంత భారీ రాజకీయ కసరత్తు అవసరమా అన్నది కూడా అంతా తర్కించుకుంటున్నారు. కానీ కుర్చీలో ఒక్క రోజు కూర్చున్నా గ్రేటే అన్న పొలిటికల్ థియరీయే దీనిని అంతా నడిపిస్తోంది అని అంటున్నారు.
నువ్వు ఏమి కంగారు పడకు నాన్న మా పులి అన్నకు తగిలిన షాక్ తో పోల్చుకుంటే ఏది పెద్ద షాక్ కాదు లె