చాయ్-సమోసా కూడా ఆదుకోలేకపోయాయి

సినిమా ఫ్లాప్ అయితే వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ఇస్తుంటారు. అది కూడా వర్కవుట్ కాకపోతే ఇక చేసేదేం లేక చేతులెత్తేస్తారు. వారం రోజులకే ఓటీటీకి ఇచ్చి చేతులు దులుపుకుంటారు. సర్ఫిరా యూనిట్…

సినిమా ఫ్లాప్ అయితే వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ఇస్తుంటారు. అది కూడా వర్కవుట్ కాకపోతే ఇక చేసేదేం లేక చేతులెత్తేస్తారు. వారం రోజులకే ఓటీటీకి ఇచ్చి చేతులు దులుపుకుంటారు. సర్ఫిరా యూనిట్ మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచించింది.

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా సర్ఫిరా. ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. దీంతో పీవీఆర్ ఐనాక్స్ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. తమ థియేటర్లలో సినిమా చూడండి, చాయ్-సమోసా ఉచితంగా పొందండి అంటూ ప్రకటించింది.

ప్రకటన 2 రోజుల కిందటే వచ్చింది కానీ ఆదరణ మాత్రం నిల్. కనీసం ఒక చాయి, 2 సమోసాల కోసం కూడా ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదంటే మూవీ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. అలా అని ఇదేదో ఊరుపేరు లేని సినిమా అనుకోవడానికి వీల్లేదు.

అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటించిన సినిమా. పైగా సూర్య నటించిన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమాకు రీమేక్. దర్శకురాలు కూడా సేమ్. కానీ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చాయ్-సమోసా కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయంటూ చిన్నపాటి ట్రోలింగ్ నడుస్తోందక్కడ.

కల్కి సినిమా ప్రభావం ఇటు భారతీయుడు-2 సినిమాపై పడ్డట్టుగానే, అటు ఉత్తరాదిన సర్ఫిరా మూవీపై పడింది. ఫలితంగా అక్షయ్ కుమార్ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.