చురుగ్గా రాజాసాబ్ షూటింగ్

ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాల్లో దాదాపు సగం వరకు పూర్తయిన సినిమా మారుతి దర్శకత్వంలోని రాజా సాబ్. కల్కితో ప్రభాస్ సినిమాకు వచ్చిన మార్కెట్ ఇంతా అంతా కాదు. ఇప్పుడు దీన్ని ముందుగా…

ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాల్లో దాదాపు సగం వరకు పూర్తయిన సినిమా మారుతి దర్శకత్వంలోని రాజా సాబ్. కల్కితో ప్రభాస్ సినిమాకు వచ్చిన మార్కెట్ ఇంతా అంతా కాదు. ఇప్పుడు దీన్ని ముందుగా ఎవరు అందిపుచ్చుకుంటారు అన్నది పాయింట్.

మైత్రీ మూవీస్ హను రాఘవపూడి సినిమా ఇంకా ప్రారంభం కావాల్సి వుంది. సందీప్ వంగా స్పిరిట్ కూడా అంతే. సలార్ 2 సంగతి తెలియాల్సి వుంది. ఇలాంటి నేపథ్యంలో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న రాజా సాబ్ మాత్రమే ముందుగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ వున్నాయి.

రాజా సాబ్ లేటెస్ట్ షెడ్యూలు ప్రారంభమైంది. హీరోయిన్ల మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీలో వున్న హీరో ప్రభాస్ తరువాత షెడ్యూలులో జాయిన్ అయ్యే అవకాశం వుంది. ప్రస్తుత షెడ్యూలు మాత్రం హీరోయిన్ల మీద జరుగుతోంది. ఇది ఓ వారం రోజుల పాటు కొనసాగుతుంది.

రాజా సాబ్ ఓ డిఫరెంట్ సినిమా. బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సినిమాలు వేరు. రాజా సాబ్ వేరు. ఈ సినిమాలో ప్రభాస్ నుంచి ఫన్ వుంటుంది. పాటలు వుంటాయి. డ్యాన్స్ లు వుంటాయి. ఫైట్లు వుంటాయి. ఇలా అన్నీ కలిసిన సకుటుంబ చిత్రం ఇది. తొలి భాగం మొత్తం ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. అందువల్ల ఈ సినిమా కచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ను అలరించేలా వుంటుంది.