సినిమా రివ్యూ: పోరా పోవే

రివ్యూ: పోరా పోవే రేటింగ్‌: 1/5 బ్యానర్‌: ఎస్‌.వి. మూవీ మేకర్స్‌ తారాగణం: కరణ్‌, సౌమ్య సుకుమార్‌ తదితరులు సంగీతం: యాజమాన్య కూర్పు: ఉద్ధవ్‌ ఛాయాగ్రహణం: జైపాల్‌రెడ్డి నిర్మాతలు: యెల్కిచర్ల వీరేంద్రరెడ్డి, శ్రీనివాస్‌ బింగమళ్ళ…

రివ్యూ: పోరా పోవే
రేటింగ్‌: 1/5

బ్యానర్‌: ఎస్‌.వి. మూవీ మేకర్స్‌
తారాగణం: కరణ్‌, సౌమ్య సుకుమార్‌ తదితరులు
సంగీతం: యాజమాన్య
కూర్పు: ఉద్ధవ్‌
ఛాయాగ్రహణం: జైపాల్‌రెడ్డి
నిర్మాతలు: యెల్కిచర్ల వీరేంద్రరెడ్డి, శ్రీనివాస్‌ బింగమళ్ళ
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: లంకపల్లి శ్రీనివాస్‌
విడుదల తేదీ: జులై 18, 2014

‘పోరా పోవే’ అంటూ టైటిల్‌లోనే సినిమాకి వద్దామనుకునే వారికి స్ట్రాంగ్‌ మెసేజ్‌ పాస్‌ చేస్తోన్న ఈ చిత్రం డీటెయిల్స్‌లోకి వెళితే..

కథేంటి?

వికాస్‌ (కరణ్‌) చిన్నప్పట్నుంచి ఇంటర్‌ వరకు బాయ్స్‌ స్కూల్‌లోనే చదువుతాడు. శ్రీచైతన్య (సౌమ్య) కూడా అంతే… ఇంజినీరింగ్‌ వరకు కో ఎడ్యుకేషన్‌ అంటే ఏంటో తెలీదు. ఎప్పుడు కో ఎడ్యుకేషన్‌లో జాయినవుదామా, లవ్‌లో పడిపోదామా అని చూస్తున్న ఈ ఇద్దరూ కాలేజ్‌లో జాయిన్‌ కాగానే లవ్‌లో పడిపోతారు. 

కళాకారుల పనితీరు:

ప్రేమకథా చిత్రాల్లో ఏది బాగున్నా లేకున్నా ముందు ఆ ప్రేమజంట బాగుండాలి. కానీ దీంట్లో లీడ్‌ పెయిర్‌ని ఛూజ్‌ చేసుకోవడంలోనే దర్శకుడు ఫెయిలయ్యాడు. కరణ్‌, సౌమ్య ఇద్దరూ కూడా లీడ్‌ రోల్‌ మెటీరియల్‌ కాదు. లుక్స్‌తో ఆకట్టుకోలేకపోయినా కనీసం పర్‌ఫార్మెన్స్‌తో అయినా కొంచెం మెప్పించవచ్చు. కానీ వీరిద్దరికీ అది కూడా చేతకాలేదు. జబర్దస్త్‌ కామెడీ షో ఫేమ్‌ చంటి నవ్వించాలని చాలా ట్రై చేసాడు. మిగతా నటీనటుల పేర్లు కూడా తెలీదు. 

సాంకేతిక వర్గం పనితీరు:

యాజమాన్య సంగీతం ఫర్వాలేదు. ఒకటి రెండు పాటలు ఓకే అనిపిస్తాయి. ఇందులో పాటలన్నీ చంద్రబోస్‌ రాసాడు. ఒక లో బడ్జెట్‌ సినిమాకి సినిమాటోగ్రఫీ బాగున్నట్టే అని చెప్పాలి. దర్శకుడే ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు కూడా రాసారు. డైలాగ్స్‌ చాలా ఆర్డినరీగా ఉన్నాయి. కథలో సినిమా తీసేంత విషయం లేదు. సినిమా మొత్తంలో ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటీ లేదు. కాకపోతే తనకున్న వనరుల్లో క్వాలిటీ పరంగా డీసెంట్‌ అనిపించే చిత్రం తీసాడు. మరీ ఇలా షాలో స్క్రిప్టుతో, ఆకట్టుకోలేని జంటతో సినిమా తెరకెక్కిస్తే అద్భుతాలు జరిగినా గట్టెక్కలేరు.

హైలైట్స్‌:

  • ఏమీ లేవు

డ్రాబ్యాక్స్‌:

  • హీరో
  • హీరోయిన్‌
  • స్క్రిప్ట్‌

విశ్లేషణ:

కో ఎడ్యుకేషన్‌తో టచ్‌ లేని విద్యార్థులు కాలేజ్‌కి లవ్‌లో పడిపోవడానికే వస్తారని దర్శకుడు పేద్ద ఉపోద్ఘాతం ఇస్తాడు. స్కూలుకెళ్లే టైమ్‌ నుంచి వేరే జెండర్‌ పక్కన లేకపోవడంతో ఆవహించే దిగులు ఇంటర్‌మీడియట్‌కి వచ్చేసరికి తోడు కోసం తహతహలాడేట్టు చేస్తుందని ‘సిగ్నల్‌ లైట్‌’ సిద్ధాంతం ఏదో తాపీగా వివరిస్తాడు. అవడానికి ఇది ప్రేమ కథే అయినా కానీ ఆకట్టుకోనే లవ్‌ సీన్‌ ఒక్కటీ లేదు. 

పాటల్లో కొరియోగ్రాఫర్లు, సినిమాటోగ్రాఫరు అయినా కొన్ని లవ్‌ ఫీలింగ్స్‌ చూపించగలిగారు కానీ దర్శకుడు మాత్రం టైమ్‌ వేస్ట్‌ చేసాడు తప్ప తన కథతో టచ్‌ చేయలేదు. ఫస్టాఫ్‌ ఆల్‌మోస్ట్‌ మేటర్‌ ఏమీ లేకుండా నడిచిపోతే ఇంటర్వెల్‌ తర్వాత అయినా కథ మొదలవుతుందేమో అని ఎదురు చూసినా ఫలితం ఉండదు. దాదాపుగా ప్రీ క్లయిమాక్స్‌కి వచ్చే వరకు కాన్‌ఫ్లిక్ట్‌ జోలికే పోడు.     

మరో పావుగంటలో సినిమా అయిపోతుందనగా అప్పుడు తన కథ దేని గురించనేది దర్శకుడు ఓపెన్‌ చేస్తాడు. హీరో హీరోయిన్ల మధ్య ఖుషీ మార్కు ఈగోని రెచ్చగొట్టి ఒక పాథాస్‌ సాంగ్‌ కూడా వేసుకుంటాడు. కనీసం క్లయిమాక్స్‌లో అయినా ఎంతో కొంత విషయం ఉంటుందేమో అని చూస్తే అదీ జరగదు. దర్శకుడు ఏం చెప్పి నిర్మాతల్ని ఒప్పించాడో, వారు ఏం విని డబ్బులు ఖర్చు పెట్టారో అర్థం కాదు. లో బడ్జెట్‌ సినిమా కదా అని టీవీ సీరియల్స్‌ కంటే ఘోరమైన ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో చుట్టి పారేయకుండా సినిమాని సినిమాలానే తెరకెక్కించడం, టికెట్‌ కొని వచ్చిన ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్‌ చేసినా లేకపోయినా కనీసం అది తమ బాధ్యత అని తెలుసుకొని దానికోసం ప్రయత్నించడం మెచ్చుకోవచ్చు. 

‘పోరా పోవే’ అంటున్నా థియేటర్లోకి వెళ్లినపుడు ఏం చూపించినా కిక్కురుమనడం అనవసరం. ఏ క్షణంలో లేచి వెళ్లిపోయినా కానీ ఏమీ మిస్‌ కాకపోవడం దీనికున్న సౌకర్యం. పొమ్మంటున్నా.. పొరపాట్న లోనికి పోయినా… ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లిపోవచ్చు కనుక దీనికి పోతారో, పోరో అనేది మీ ఇష్టం.

బోటమ్‌ లైన్‌: పోరా పోవే: ఈ ప్రేమని భరించడం కష్టమే! 

-జి.కె.