సమంత రీఎంట్రీ.. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు తయారైంది. స్వయంగా తను ఓ ప్రాజెక్టు ప్రకటించింది. అటు మలయాళం సినిమా సిద్ధంగా ఉంది. దీనికితోడు మరికొన్ని ప్రాజెక్టుల చుట్టూ సమంత పేరు తిరుగుతోంది.
ఇలా ఈ హీరోయిన్ చుట్టూ ప్రకటనలు, పుకార్లు జోరుగా నడుస్తున్నాయి. కానీ ఆమె ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు. మినిమం గ్యాప్స్ లో ఫొటోషూట్స్ చేస్తోంది, హెల్త్ టిప్స్ ఇస్తోంది తప్ప, సినిమా సెట్స్ పైకి మాత్రం రావడం లేదు.
కొత్తగా సమంతపై మరో ప్రచారం మొదలైంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఆమె ఓ ఒరిజినల్ మూవీ చేయబోతోందంట. తుంబాడ్ లాంటి మాంఛి థ్రిల్లర్ అందించిన అనీల్ బార్వే దర్శకత్వంలో ఆమె సినిమా చేయబోతోందనేది ఆ పుకార్ల సారాంశం.
ఈ సినిమాలో సమంతకు జోడీగా ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తాడట. సమంతతో ఫ్యామిలీమేన్ తీసిన రాజ్ అండ్ డీకే ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేసి నెట్ ఫ్లిక్స్ కు అందిస్తారట.
ఇలా సమంత పుకార్ల లిస్ట్ లోకి మరో సినిమా చేరింది. వీటిలో ఆమె ఏదో ఒకటి ప్రారంభిస్తే, అందరికీ ఓ నమ్మకం కలుగుతుంది.
జనం పట్టించుకోరు
Did you write a script to add this comment to all articles OR you read and then comment ???