దువ్వాడది వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం.. ఆయ‌న్ను విమ‌ర్శించం

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ ఇంటి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దువ్వాడ‌తో మాధురి అనే మ‌హిళ‌తో స్నేహం… చివ‌రికి రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. చాలా రోజులుగా లోలోప‌లే న‌లుగుతున్న…

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ ఇంటి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దువ్వాడ‌తో మాధురి అనే మ‌హిళ‌తో స్నేహం… చివ‌రికి రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. చాలా రోజులుగా లోలోప‌లే న‌లుగుతున్న వ్య‌వ‌హారం నాలుగైదు రోజుల క్రితం బ‌ట్ట‌బ‌య‌లైంది.

దువ్వాడ శ్రీ‌నివాస్‌, ఆయ‌న భార్య వాణి మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైన మాధురిది ఇంకో బాధ‌. త‌న‌ను అన‌వ‌స‌రంగా వాణి బ‌ద్నాం చేశార‌ని, త‌న‌ను ఒంట‌రిగా మిగిల్చార‌ని మాధురి ల‌బోదిబోమంటున్నారు. దువ్వాడ శ్రీ‌నుతో లేని సంబంధాల‌ను అంట‌గ‌ట్టార‌ని, దీంతో జీవితంపై విర‌క్తి క‌లిగి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి కూడా పాల్ప‌డిన‌ట్టు ఆమె వెల్ల‌డించారు.

దువ్వాడ ఇంటి పోరుపై తెలుగు ప్ర‌జ‌ల‌కు మీడియా వినోదాన్ని పంచుతోంది. ఒక‌రిద్ద‌రు మిన‌హాయిస్తే ప్ర‌త్య‌ర్థులెవ‌రూ రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. ఇవాళ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ మీడియాతో మాట్లాడుతూ దువ్వాడ వ్య‌వ‌హారం వ్య‌క్తిగ‌త‌మ‌ని తేల్చి చెప్పారు. ఆయ‌న‌పై తామెక్క‌డా విమ‌ర్శ‌లు చేయ‌డం లేద‌ని మంత్రి చెప్పుకొచ్చారు. త‌మ‌ను ఇబ్బందులు పెట్టిన వైసీపీ ముఖ్య‌నేత‌ల‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.

దువ్వాడ‌పై టీడీపీ సానుభూతి చూపింద‌ని చెప్పొచ్చు. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంలో త‌లెత్తిన గొడ‌వ‌కు రాజ‌కీయ రంగు పులిమేందుకు ప్ర‌య‌త్నించ‌లేదు. దువ్వాడ సంతోషించాల్సిన విష‌యం ఇది.

16 Replies to “దువ్వాడది వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం.. ఆయ‌న్ను విమ‌ర్శించం”

  1. మన మహిళా చెక్క మాత్రం నోరు తెరిస్తే పవన్ కి ముగ్గురి పెళ్ళాలని కోసేది

    చివరికి అదే ఇప్పుడు నాలుగో పెళ్ళాం అయి కూర్చుంది

    1. ఆడ వాలు సరిపోలేనా. మగవాలను పెళ్లి సేసుకున్నడు అంటే . మీ పావలా “గే” నా

  2. ఫిలాసఫర్, గైడ్, ఆదర్శం, ఆదరణ, నీడలేని ఆడది, 50 ఇయర్స్ యూత్. ఇవి విరివిగా విరబూసిన పువ్వుల పొదరిల్లు. వెరసి కలియుగ పాతివ్రతల కలహాల కాపురం

  3. గత అయిదు సం. ల కంపు కడగలేక మంత్రులందరూ సతమతమవుతున్నారు. ఇంకా వీళ్ళకి వైసీపీ వాళ్ళ కంపు గురుంచి మాట్లాడే తీరికెక్కడ వుంది

Comments are closed.