హ‌రీశ్‌ క్యాంప్ కార్యాల‌యంపై దాడి

సిద్ధిపేట‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు క్యాంప్ కార్యాల‌యంపై కాంగ్రెస్ నాయ‌కులు దాడికి పాల్ప‌డ్డారు. గ‌త ఆర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీని ఆగ‌స్టు 15వ తేదీలోపు చేస్తే తాను రాజీనామా చేస్తాన‌ని…

సిద్ధిపేట‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు క్యాంప్ కార్యాల‌యంపై కాంగ్రెస్ నాయ‌కులు దాడికి పాల్ప‌డ్డారు. గ‌త ఆర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీని ఆగ‌స్టు 15వ తేదీలోపు చేస్తే తాను రాజీనామా చేస్తాన‌ని హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తాము రుణ‌మాఫీ చేశామ‌ని, హ‌రీశ్‌రావుకు చిత్త‌శుద్ధి వుంటే రాజీనామా చేయాల‌ని, లేదంటూ ఎక్క‌డైనా న‌దిలో దూకి చావాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి వైరా స‌భ‌లో డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో హ‌రీశ్‌రావు రాజీనామా చేయాలంటే కాంగ్రెస్ ఒత్తిడి పెంచింది. అయిన‌ప్ప‌టికీ హ‌రీశ్ రాజీనామా చేయ‌లేదు.

దీంతో సిద్ధిపేట‌లో హ‌రీశ్‌రావు క్యాంప్ కార్యాల‌యంపై కాంగ్రెస్ నాయ‌కులు అర్ధ‌రాత్రి దాడికి పాల్ప‌డ్డారు. గేటును కాళ్లతో తన్నుతూ కాంగ్రెస్ నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు లోపలికి వెళ్లారు. హరీశ్‌రావు ఫ్లెక్సీని చించివేసి హ‌డావుడి చేశారు. హరీశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ ఘ‌ట‌నపై బీఆర్ఎస్ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. ఈ చ‌ర్య అప్ర‌జాస్వామిక‌మ‌ని హ‌రీశ్‌రావు అన్నారు. ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. పోలీసుల ఎదుటే కార్యాల‌యంపై దాడి జ‌ర‌గ‌డం సిగ్గుచేట‌న్నారు.

5 Replies to “హ‌రీశ్‌ క్యాంప్ కార్యాల‌యంపై దాడి”

  1. హ‌రీశ్‌రావు రాజీనామా చేసి , చేసిన అవినీతికి తప్పులకి ప్రభుత్వానికి లొంగిపోవాల లేకుంటే నీచుడికి ప్రజల చేతుల చా!వు తప్పదు

  2. అక్కడ కూడా రెడ్డి vs వెలమ రంగు లోకి వస్తుందేమో, దాడి చెయ్యాల్సిన అవసరం ఏముంది?

Comments are closed.