‘సరిపోతుందా’ శనివారం!

వరుసగా ధైర్యం చేసి, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు హీరో నాని. చేసిన ప్రతి సినిమా విషయంలో క్రిటిక్స్ నుంచి అప్లాఙ్ అందుకుంటూనే వున్నాడు. కొన్ని సినిమాలకు నిర్మాతలకు నష్టం వచ్చినా, కొన్ని సినిమాలకు…

వరుసగా ధైర్యం చేసి, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు హీరో నాని. చేసిన ప్రతి సినిమా విషయంలో క్రిటిక్స్ నుంచి అప్లాఙ్ అందుకుంటూనే వున్నాడు. కొన్ని సినిమాలకు నిర్మాతలకు నష్టం వచ్చినా, కొన్ని సినిమాలకు బయ్యర్లు నష్టపోయినా, మంచి సినిమాలు, హిట్ సినిమాలు అనే టాక్ నే ప్రచారం జ‌రిగింది. జ‌రిగిపోయింది.

సినిమాలు బాగుండడంతో, మంచి పేరు రావడంతో మొత్తానికి హ్యాపీ. శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న సినిమాలతో నాని నాన్ థియేటర్ మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఒక్క నాన్ థియేటర్ మార్కెట్ నే 70 కోట్లు దాటింది. థియేటర్ మార్కెట్ 30 కోట్లు దాటింది.

ఇలాంటి నేపథ్యంలో వస్తున్న సినిమా సరిపోతుందా శనివారం. ఇది కూడా విభిన్నమైన సినిమానే. ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో ట్రయ్ చేస్తూ వస్తూ, ఇప్పుడు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను టచ్ చేస్తున్నాడు. శాడిస్టింగ్ వీలన్, కోపాన్ని కంట్రోల్ లో వుంచుకుని వారానికి ఒక్క రోజు చూపించే భిన్నమైన పాత్ర. ఇప్పుడు ఈ సినిమాను కనుక జ‌నం బాగా రిసీవ్ చేసుకుంటే నాని మరో మెట్టు ఎక్కేస్తారు.

ఎందుకంటే శ్యామ్ సింగ రాయ్, దసరా, హాయ్ నాన్న సినిమాల పాత్రలు పూర్తిగా విభిన్నమైనవి. వాటిని ఇలా వుంటాయి తాను చేస్తే అని చేసి చూపించారు నాని. అంటే సుందరానికి సినిమా నాని కి సరిపోలేదు. పాత్ర చాల లేదు. సినిమా చాల లేదు.

గ్యాంగ్ లీడర్ లో ఫన్ చేసారు.. కానీ సినిమా ఎక్కడో తేడా కొట్టింది. వి సినిమా క్లాసిక్ గా తీసిన థ్రిల్లర్ జానర్. అది మళ్లీ క్లిక్ కాలేదు. పూర్తిగా జ‌నానికి నచ్చలేదు. ఇప్పుడు చేస్తున్న సరిపోదా శనివారం లో యాంగ్రీ యంగ్ మాన్, శాడిస్టిక్ విలన్ ఇవన్నీ కొత్తవి కాదు. కొత్తగా చెప్పే ప్రయత్నం మాత్రమే. అందువల్ల సినిమా ఎలా వచ్చింది అన్నది చూడాలి. అంటే సుందరానికి తీసిన వివేక్ అత్రేయ ఈసారి అయినా స్క్రిప్ట్ లో అస్సలు లోపం లేకుండా ముందుకు వెళ్తున్నారా అన్నది చూడాలి. నాని కూడా స్క్రిప్ట్ విషయంలో కేర్ తీసుకుంటారు.

ఇవన్నీ కలిసి సరిపోదా శనివారం సినిమాను సరిపెడితే ఓకె. లేదంటే నాని కన్నా ముందుగా వివేక్ ఆత్రేయకు కష్టం అవుతుంది. అలా జ‌రగదనే ఆశిద్దాం.

13 Replies to “‘సరిపోతుందా’ శనివారం!”

Comments are closed.