చిన్న లాజిక్ మిస్ అయ్యారు హరీష్!

మొగుడు తిట్టినందుకు కాదు, తోటి కోడలు దెప్పినందుకు అన్నట్లుంది దర్శకుడు హరీష్ శంకర్ మాటకారితనం.

మొగుడు తిట్టినందుకు కాదు, తోటి కోడలు దెప్పినందుకు అన్నట్లుంది దర్శకుడు హరీష్ శంకర్ మాటకారితనం. నిన్నటికి నిన్న ఫ్యాన్స్ మీట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హరీష్. రవితేజ‌ కేరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. బయ్యర్లకు తొంభై శాతం నష్టాలు మిగిల్చింది. ఇప్పుడు హరీష్ మైక్ పట్టుకుని, తనను తాను సమర్ధించుకునే పని మొదలుపెట్టారు.

కేవలం పాటల్లోనే హీరోయిన్ ఎక్స్ పోజ్ చేయించాను తప్ప, మిగిలిన అన్ని సన్నివేశాల్లో సంప్రదాయ బద్దంగా చీర, లంగా వోణీ కట్టాను అంటున్నారు. సదరు చీర, లంగా వోణీ ఏ విధంగా కట్టించారో, ఏ మేరకు శరీర భాగాలు బయటకు బాగా కనిపించేలా జాగ్రత్త పడ్డారో చూసిన జ‌నాలకు తెలియదా? అదేదీ తనకు తెలియదన్నట్లు మాట్లాడితే ఎలా? సినిమా అంతా సగం ఛాతీ భాగం ఎక్స్ పోజింగ్, నడుము భాగం అంతా ఎక్స్ పోజింగ్ అంతా సంప్రదాయ బద్దమా?

సరే, ఇలాంటి సమాధానాలు అన్నీ పక్కన పెడితే రావణాసుర, ఖిలాడీ, రామారావు అన్ డ్యూటీ కూడా బాగా నడవలేదు. వాటి దర్శకులను ఏమీ ట్రోల్ చేయలేదు. కానీ తననే ట్రోల్ చేస్తున్నారు అన్నారు. ఇవే కాదు, రవితేజ‌కు ఇంకా.. ఇంకా చాలా డిజాస్టర్లు వున్నాయి. కానీ హరీష్ చెప్పిన ఈ మూడు సినిమాల సంగతే చూద్దాం.

రావణాసురసుధీర్ వర్మ దర్శకుడు. సుధీర్ వర్మ మీద ఎవరికీ ఏ అంచనాలు లేవు. ఎందుకుంటే తొలి సినిమా తప్ప మరో హిట్ ఇచ్చింది లేదు. సినిమాలు చేస్తూ వస్తున్నారు తప్ప అన్నీ ఫ్లాపులే. అందువల్ల రావణాసుర ఫ్లాప్ అయితే, మరో ఫ్లాప్ ఇచ్చాడులే అని ఊరుకున్నారు.

ఖిలాడీ.. దర్శకుడు రమేష్ వర్మ. ఈయనతో రవితేజ‌ సినిమా చేయడమే పెద్ద సంగతి. ఎందుకంటే రమేష్ వర్మ మరీ పాపులర్ దర్శకుడేమీ కాదు. అందువల్ల ఎవరికీ ఖిలాడీ మీద మొదటి నుంచీ సరైన అంచనాలు లేవు. విడుదలైన కంటెంట్ బాగుంది. సినిమా బాగాలేదు. అందుకే రవితేజ‌ మరో ఫ్లాప్ అని నిట్టూర్చారు.

రామారావు అన్ డ్యూటీ. కొత్త దర్శకుడు శరత్ మండవ. ఏమి అంచనాలు వుంటాయి. ఎవరికి తెలుసు దర్శకుడు. అందుకే ఎవరూ పట్టించుకోలేదు.

కానీ హరీష్ అలా కాదు. మరో పదేళ్లు అయినా పలవరించడానికి పవన్ గబ్బర్ సింగ్ వుండనే వుంది. గద్దలకొండ గణేష్ సినిమా హిట్ అన్నది ఖాతాలో వుంది. పైగా పవన్ తో ఉస్తాద్ సినిమా తీస్తున్నారు. అంతే కాదు రవితేజ‌తో మిరపకాయ్ సినిమా తీసారు. అందువల్ల ఎవరి మీదా లేనన్ని అంచనాలు హరీష్ మీద పెట్టుకున్నారు ఫ్యాన్స్. తమ హీరోకి కమ్ బ్యాక్ ఇస్తారని నమ్మారు. పైగా హరీష్ పలు సార్లు సినిమా మీద మాట్లాడిన మాటలు మామూలుగా హైప్ ను పెంచలేదు.. ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి.

కట్ చేస్తే.. సినిమా చూస్తే, పరమ పాత ముతకవాసన సినిమా తీసి అక్కడ పెట్టారు. అది జ‌నాలకు కోపం తెప్పించింది. ఖిలాడీలా స్టయిలిష్ గానొ, రావాణాసుర మాదిరిగా డిఫరెంట్ గానో తీసి, ఫ్లాప్ అయి వుంటే వేరుగా వుండేది. అసలు సినిమానే అస్సలు అప్ డేట్ గా కాకుండా, పరమ రొటీన్ గా తీసారు రోత కామెడీ జోడించారు. మరి జ‌నం ఎలా హర్షిస్తారు.. విమర్శించకుండా. అందుకే హరీష్ మీద అంత ట్రోలింగ్ వచ్చింది.

అది గమనించకుండా, ఇప్పటికి ఇంకా ఎవరి మీదో పరోక్షంగా నిందలు వేస్తూ, తనను మాత్రమే అంటున్నారని బాధపడుతూ ముందుకు వెళ్లడం అంటే తనను తాను మోసం చేసుకోవడం తప్ప వేరు కాదు.

11 Replies to “చిన్న లాజిక్ మిస్ అయ్యారు హరీష్!”

  1. అరెయ్ బాబ్జీ.. నువ్వు చెప్పిన దర్సకులెవ్వరూ ప్రిరిలీస్ ప్రెస్ మీట్లొ కొవ్వు సమధనలు చెప్పడం, తొపులా బిల్డప్ ఇవ్వడం లాంటివి చెయలెదు కాబట్టి యెవరికీ కొపం రాలెదు, ట్రొల్ చెయలెదు

  2. “తనను తాను మోసం చేసుకోవడం తప్ప వేరు కాదు.”

    ఈ వ్యాసాలూ వ్రాసే వాడెవడో గతజన్మలో వేరు ముక్కలను HIV నివారణ మందుగా అమ్ముకున్నట్లున్నాడు. Same dialogue

  3. కామెంట్స్ లో చెక్కా

    పేడి అనే పదాలు వాడండి

    కానే లం..గా అని వాడితే వాడు మోడరేట్ చేస్తున్నాడు

    అన్నియ్యను లం..గా.. గాడు అని మాత్రం రాయొద్దు

Comments are closed.