నా దగ్గర డ్రామాలు నడవవు – కంగనా

అన్నీ తానై కంగనా రనౌత్ తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. Advertisement సినిమాలో తమ వర్గాన్ని…

అన్నీ తానై కంగనా రనౌత్ తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది.

సినిమాలో తమ వర్గాన్ని దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రమాదం ఉందని పలువురు సిక్కులు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణలో ఆ చిత్రం విడుదలను నిలిపేయాలంటూ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకొని, చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తామని రేవంత్ వాళ్లకు హామీ ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలనలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో కంగనా సినిమా తెరకెక్కించింది. ఇందులో ఆమె ఇందిరాగాంధీ పాత్రలో నటించడమే కాకుండా, తనే స్వయంగా దర్శకత్వం కూడా వహించింది.

బీజేపీ అండతో ఈ సినిమాను దేశవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు కంగనా ఇప్పటికే అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వ వ్యాఖ్యలపై ఆమె సూటిగా స్పందించింది.

“నన్ను ఎవ్వరూ బెదిరించలేదు, భయపెట్టలేరు. సెన్సార్ సర్టిఫికేట్ రావడానికి కొన్ని రోజుల ముందు ఇలాంటి డ్రామాలు సహజం. సెన్సార్ బోర్డ్ ఎందుకో మొహమాటపడుతున్నట్టుంది.”

ఒకవేళ తన సినిమాకు సెన్సార్ పూర్తికాకపోతే ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తానని, అక్కడ కూడా ఫలితం దక్కకపోతే కోర్టుకు వెళ్తానని కంగనా విస్పష్టంగా ప్రకటించింది. తన సినిమాను కచ్చితంగా తెలంగాణలో విడుదల చేసి తీరుతానంటోంది ఈ బీజేపీ ఎంపీ.

23 Replies to “నా దగ్గర డ్రామాలు నడవవు – కంగనా”

  1. బీజేపీ అండ తో రిలీజ్ చెయ్యడం ఏమిటీ? సినిమాలు ఒక పార్టీ అండ తో మాత్రమే రిలీజ్ అవుతున్నాయా?

  2. అయినా కాంగ్రెస్ ఇందిరా పార్టీ అధికారం లో వున్న తెలంగాణ లో ఆమె బయోగ్రఫీ రిలీజ్ కాకపోవడమేంటి? ఇదేమో విడ్డూరం. ఇటువంటి వింతలు ఎన్ని చూడాలో?

    అయినా ఈ ఎమర్జెన్సీ లో ఇందిర తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు, ఆమె చావుకి కారణమయ్యాయి. కంగన వాటిని తెరకెక్కించిందో లేదో చూడాలి.

    1. ఇది ఇందిరా గాంధీ బయోగ్రఫీ కాదు. ఆమెకి, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తీసే సినిమా. కంగనా చేసేవాన్నీ అతి వేషాలే. ఆమె ఒక బీజేపీ ఎంపీ

      1. I know about operation blue star, but that is the for public consumption. During emergency she nationalized all private banks in one stroke. The world banking king pin who arranged her murder, watched her shooting live through BBC telecast just like Obama watched Osama go down. That is the power of world richest man. There is no way an average Indian knew this.

  3. Are the Jairnailsingh bindranwale actions right? Then Smt Gandhi Govt action against them is wrong. If their actions are wrong then Smt Gandhi Govt actions are correct. Then how come Telangana Congi Govt is colluding with Bindranwale supporters. It is just anti BJP approach by both. Just for this reason if this Cinema is banned it is Anti democratic

  4. Kangana is wrong..she should make movie against Muslims like Kerala Story, Rajakar or Kashmir files.. She would have made huge money and full support from all governments.

    1. I guess the second movie Kerala story and third movie Rajakar got super hit talk and collected millions of rupees (?). So if Kangana makes fourth movie then she will become big millionaire.

  5. కంగనా జీ సరిగ్గానే ప్రవర్తిస్తున్నారు.BJP లో లేకున్నా ఆమె అలాగే ప్రవర్తిస్తారు. వివాదాలు గా సినిమాలు తీసే ఇతరుల గురించి మాట్లాడనివారు కంగన పట్ల ఉత్ప్రేక్ష తో స్పందిస్తుంటారు.

Comments are closed.