హీరోయిన్ రష్మికకు యాక్సిడెంట్

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మికకు యాక్సిడెంట్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అందుకే ఈమధ్య బయటకు రాలేకపోయానని తెలిపింది. Advertisement “గత నెల నేను పబ్లిక్ గా, సోషల్ మీడియాలో…

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మికకు యాక్సిడెంట్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. అందుకే ఈమధ్య బయటకు రాలేకపోయానని తెలిపింది.

“గత నెల నేను పబ్లిక్ గా, సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఉండలేకపోయాను. దీనికి కారణం నాకు యాక్సిడెంట్ అయింది. కాకపోతే అది చిన్నదే. వైద్యుల సూచనల మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గా ఉంది.”

ఇలా తను చిన్న యాక్సిడెంట్ కు గురైన విషయాన్ని బయటపెట్టింది రష్మిక. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని, ప్రతి రోజు ఆనందంగా గడపాలని చెబుతోంది. రేపు అనేది మన చేతిలో ఉండదని, ఈ క్షణాన్ని ఆస్వాదించాలని సూచిస్తోంది.

ఇలా అప్ డేట్స్ ఇస్తూనే, తన లేటెస్ట్ ఫొటోను కూడా షేర్ చేసింది రష్మిక. ఇంట్లో ఖాళీగా ఉంటూ చాలా లడ్డూలు తింటున్నానంటూ సరదాగా చెప్పుకొచ్చింది. అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాల్ని మాత్రం రివీల్ చేయలేదు ఈ బ్యూటీ.

4 Replies to “హీరోయిన్ రష్మికకు యాక్సిడెంట్”

Comments are closed.