తమిళ సూపర్ స్టార్ చిరకాల కోరిక !

సామాన్యుల నుంచి సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులవరకూ ప్రతీ ఒక్కరికీ కోరికలు ఉంటాయి. కొన్ని వ్యక్తిగతమైనవి ఉంటాయి. కొన్ని దేశానికి సంబంధించినవి, కొన్ని వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఉంటాయి. వాటిల్లో కొన్ని తీరొచ్చు. కొన్ని…

సామాన్యుల నుంచి సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులవరకూ ప్రతీ ఒక్కరికీ కోరికలు ఉంటాయి. కొన్ని వ్యక్తిగతమైనవి ఉంటాయి. కొన్ని దేశానికి సంబంధించినవి, కొన్ని వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఉంటాయి. వాటిల్లో కొన్ని తీరొచ్చు. కొన్ని తీరకపోవొచ్చు. ఇదంతా పరిస్థితులు, జరిగే పరిమాణాలబట్టి ఉంటుంది.

తమిళ సూపర్ స్టార్ కాదు …కాదు ఆలిండియా సూపర్ స్టార్ కమ్ రాజకీయ నాయకుడైన కమల హాసన్ కు ఓ చిరకాల కోరిక ఉంది. అది వ్యక్తిగతమైంది కాదు. ఆయన రాష్ట్రానికి సంబంధించింది. అదేమిటంటే …దేశానికి ఏనాటికైనా తమిళుడు ప్రధానమంత్రి కావాలనేది ఆయన చిరకాల కోరిక. ఇది సహజమైన కొరికే.

మొన్న ఆయన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ లో ఈ విషయం చెప్పాడు. దేశంలో దాదాపు అన్ని రంగాల్లో తమిళులు ఆధిక్యంలో ఉన్నారని చెప్పొచ్చు. దక్షిణ భారతంలో తమిళనాడు ప్రధాన రాష్ట్రం. చదువుల్లో, పారిశ్రామిక రంగంలో తమిళులు చాలా ముందున్నారు.

అలాగే రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే తమిళ పార్టీల మద్దతు లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉండలేదు. కేంద్ర మంత్రివర్గంలో కూడా కీలక మంత్రి పదవులను తమిళ నాయకులు దక్కించుకుంటారు. ప్రస్తుత మోడీమంత్రివర్గంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తమిళియనే. కానీ తెలుగింటి కోడలైంది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్న తమిళనాడుకు నిధులు ఎక్కువగా వస్తుంటాయి.

దేశంలో తమిళనాడువాళ్ళకు తెలివైన వాళ్లనే పేరుంది. ఈ రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్లో ఏదో ఒకటి అధికారంలో ఉంటుంది. ఈ రెండు పార్టీలు సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకం. ఇక డీఎంకే కరడుగట్టిన నాస్తిక పార్టీ. హిందూత్వ భావజాలానికి పక్కా వ్యతిరేకి. హిందీ భాషా వ్యతిరేకి. ఇంతటి ప్రత్యేకతలు ఉన్న తమిళనాడు నుంచి ఇప్పటివరకు ఎవరూ ప్రధాని కాలేకపోయారు.

దక్షిణాది నుంచి తెలుగు వ్యక్తి పీవీ నరసింహారావు ప్రధాని పీఠంపై విజయవంతంగా ఐదేళ్లపాటు ఉండగలిగారు. అది కూడా సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానిగా ఉండి క్లిష్ట పరిస్థితిలో ఉన్న దేశాన్ని తన తెలివితేటలతో ఒడ్డున పడేశారు. కానీ ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీయే ఆయన్ని చులకనగా చూసింది. అవమానించింది. ఇప్పటికీ ఆయన్ని గౌరవించడంలేదు.

దక్షిణాది నుంచి కొద్దికాలం ప్రధానిగా ఉన్న కర్ణాటక నాయకుడు దేవెగౌడ. కానీ ఈయనకంటూ ప్రధానిగా చెప్పుకోదగ్గ చరిత్ర లేదు. ఒకవేళ తమిళ వ్యక్తి ప్రధాని అయితే ఆయన గొప్ప మిరాకిల్స్ చేయకపోయినా వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. అదీ తెలుగువాళ్ళకు, తమిళియన్స్ కు తేడా.

పీవీకి కూడా అదృష్టం కలిసొచ్చి ప్రధాని అయ్యారు. కానీ ఆ పదవి కోసం ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. మరి తమిళనాడు నుంచి ఎవరైనా ప్రయత్నించి ప్రధాని అవుతారా ? అదృష్టం కలిసొచ్చి ప్రధాని అవుతారా ? భవిష్యత్తు తేల్చాలి.

7 Replies to “తమిళ సూపర్ స్టార్ చిరకాల కోరిక !”

  1. ఎన్ని చెప్పండి, ఒక వైస్సార్ కాని ఒక రేవంత్ కాని తెలుగు ప్రధాని కి ఒక్క విగ్రహం పెట్టలేదు, ఒక్క సంస్థ కి ఆయన పేరు పెట్టలేదు, సాటి కాంగ్రెస్ నాయకుడు అయి ఉండి!

      1. అలాంటప్పుడు తెలుగు, తెలంగాణా గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ కి

  2. పీవీ నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలతో ఒక చరిత్ర సృష్టించారు. అయినా ఆయనను తెలుగువారు అంతగా గుర్తించలేదు. ఉత్తరాది వారు సరే. కనీసం ఒక సంస్మరణ ఫలకం కూడా లేదు దిల్లీలో

Comments are closed.